-
సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది. ఓ మాస్ ఫైట్ సీన్ వస్తుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ తో అయితే సినిమా పూర్తయ్యింది. కంప్లీట్ రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:25 AM July 29, 2022
-
రవితేజ టేకప్ చేసిన కేసులో ఇప్పుడే అన్నీ క్లియర్ అవుతున్నాయి. సినిమా క్లైమాక్స్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 11:15 AM July 29, 2022
-
ఈ దందా అంతటి వెనుక ఉన్న వ్యక్తిని సింపుల్ గా రివీల్ చేసేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు తనికెళ్ళ భరణి, రవితేజాల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:10 AM July 29, 2022
-
ఈ కిడ్నాప్ లు అలాగే ఎర్ర చందనం స్మగ్లింగ్స్ వెనుక ఒక గవర్నమెంట్ వ్యక్తే ఉన్నాడు. కానీ సినిమా కాస్త డౌన్ అవుతున్నట్టు అనిపిస్తుంది.
Date & Time : 10:55 AM July 29, 2022
-
కొన్ని కీలక సన్నివేశాల అనంతరం సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ రవితేజ మరియు దివ్యాన్షా ల మధ్య మొదలైంది. సినిమాలో సాంగ్స్ అయితే అంత ఎఫెక్టీవ్ గా లేవు.
Date & Time : 10:40 AM July 29, 2022
-
ఇప్పుడు ఎర్ర చందనం రిలేటెడ్ కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు కథనం మరింత ఆసక్తిగా మారుతుంది.
Date & Time : 10:30 AM July 29, 2022
-
ఇంటర్వెల్ అనంతం, మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రవితేజ ఆ కేసును పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు.
Date & Time : 10:25 AM July 29, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు ఈ చిత్రం కాస్త సీరియస్ టోన్ లోనే నడిచింది కానీ అంత థ్రిల్ చేసే స్థాయిలో అనిపించలేదు. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అంశాలు కనిపించవు.అయితే తన రోల్ లో అయితే రవితేజ సాలిడ్ పెర్ఫామెన్స్ కనబరిచారు. ఇంటర్వెల్ సమయానికి సినిమా కీలకంగా మారింది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:15 AM July 29, 2022
-
ఇప్పుడు ఇంటర్వల్ బ్యాంగ్.. ట్రైన్ ఫైట్ సీన్ వస్తుంది. మరో ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:10 AM July 29, 2022
-
ఇప్పుడు కథనంలో రాహుల్ రామకృష్ణ రోల్ తో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా ఇంటర్వల్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 10:05 AM July 29, 2022
-
ఇప్పుడు నటీనటులు పవిత్ర లోకేష్, నరేశ్,నాజర్ లు రవితేజ ఫ్యామిలీ గా కనిపిస్తున్నారు. వీరి రాకతో థియేటర్ లో ఒక్కసారిగా నవ్వులు మొదలయ్యాయి.
Date & Time : 09:55 AM July 29, 2022
-
రాజిష భర్త మిస్సయ్యిన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. రవితేజ ఈ కేసును టేకప్ చెయ్యగా ఇప్పుడు సినిమా కొత్త టర్న్ తీసుకుంది.
Date & Time : 09:45 AM July 29, 2022
-
ఇప్పుడు రవితేజ మరియు రాజిష లపై సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ వస్తుంది. రాజిష లుక్స్ బాగున్నాయి.
Date & Time : 09:35 AM July 29, 2022
-
రాజిష విజయన్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది. ఈమెతో రవితేజ గతానికి సంబంధించి కొన్ని సీన్స్ వస్తున్నాయి. ఇంకా సినిమా మెయిన్ పాయింట్ లోకి వెళ్ళలేదు.
Date & Time : 09:30 AM July 29, 2022
-
ఇప్పుడు తెరపైకి నటుడు వేణు తొట్టెంపూడి పోలీస్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సినిమాలో మాస్ ఐటెం సాంగ్ సీసా స్టార్ట్ అయ్యింది. ఇందులో అన్వేషి జైన్ తన గ్లామ్ షో తో అదరగొడుతుంది.
Date & Time : 09:20 AM July 29, 2022
-
ఇప్పుడు రవితేజ తన వృత్తికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. వీటి తర్వాత రవితేజ భార్య గా దివ్యాన్షా కౌశిక్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:10 AM July 29, 2022
-
ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ మాస్ ఎంట్రీ ఇచ్చారు. తాను ఒక జిల్లా ఫేమస్ కలెక్టర్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 09:00 AM July 29, 2022
-
ఇప్పుడు సినిమా 1996 చిత్తూర్ దృశ్యాలతో మొదలయింది. ఒక సీరియస్ నోట్ తో టైటిల్స్ మొదలయ్యాయి.
Date & Time : 08:55 AM July 29, 2022
-
హాయ్..150 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:50 AM July 29, 2022