-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 11:15 AM May 05, 2023
-
ఇప్పుడు జగపతిబాబు పై కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్ కి జీకే మనుషులకి మధ్య యాక్షన్ సీన్ వస్తుంది.
Date & Time : 11:00 AM May 05, 2023
-
జగపతిబాబు ఇప్పుడు గోపిచంద్ పై అసలు నిజం తెలుసుకున్నాడు. ఇప్పుడు మరికొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:50 AM May 05, 2023
-
ఇప్పుడు గోపీచంద్ తన అన్నయ్య సమస్యని సాల్వ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. మరో యాక్షన్ సీన్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:45 AM May 05, 2023
-
ఆ సాంగ్ అనంతరం ఇప్పుడు గోపీచంద్ మరియు తరుణ్ అరోరా లు మధ్య ఇంట్రెస్టింగ్ ఫేస్ ఆఫ్ సీన్ వస్తుంది.
Date & Time : 10:40 AM May 05, 2023
-
కొన్ని ఫామిలీ సీన్స్ తర్వాత ఇప్పుడు మాస్ సాంగ్ మోనాలిసా మొదలైంది. ఇది మాస్ ఆడియెన్స్ కి నచ్చేలా ఉంటుంది.
Date & Time : 10:30 AM May 05, 2023
-
ఇప్పుడు గోపీచంద్, కమెడియన్స్ మధ్య కొన్ని ఫన్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:25 AM May 05, 2023
-
ఇంటర్వెల్ అనంతరం..గోపీచంద్, జగపతి బాబు మరియు జీకే ల మధ్య ఉన్న గొడవ ఏంటో కుష్బూ వివరిస్తున్న సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:15 AM May 05, 2023
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా బాగానే ఉందని చెప్పొచ్చు. కథ సింపుల్ గానే ఉన్నా కథనం డీసెంట్ గా ఉంది. ఫైట్స్, కామెడీ సీన్స్ బాగున్నాయి. అలాగే గోపిచంద్ మంచి పెర్ఫార్మన్స్ కనిపిస్తుంది. మ్యూజిక్ కూడా బానే ఉంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:05 AM May 05, 2023
-
ఈ అదిరే యాక్షన్ సీన్, వార్నింగ్ సీన్స్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:00 AM May 05, 2023
-
ఇప్పుడు గోపిచంద్ తన అన్నయ్య జగపతిబాబు కి ప్రమాదం ఉందని తెలుసుకుంటాడు. అలాగే తరుణ్ అరోరా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఓ గుడి దగ్గర పవర్ ప్యాకెడ్ యాక్షన్ సీన్ మొదలైంది.
Date & Time : 09:50 AM May 05, 2023
-
ఓ ఇంటెన్స్ యాక్షన్ సీన్ తర్వాత మరో సాంగ్ దరువేయ్ రా మొదలైంది.
Date & Time : 09:40 AM May 05, 2023
-
ఇప్పుడు డింపుల్ హయాతి గోపిచంద్ ఇంటికి వచ్చింది. కొన్ని కామెడీ సీన్స్ తర్వాత మెయిన్ లీడ్ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి. దీనితో హిట్ ట్రాక్ ఐఫోన్ పిల్ల సాంగ్ మొదలైంది.
Date & Time : 09:30 AM May 05, 2023
-
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు అనంతరం ఇప్పుడు గోపీచంద్, వెన్నెల కిషోర్, ఆలీ మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:20 AM May 05, 2023
-
డింపుల్ హయాతి తండ్రిగా నటుడు సచిన్ ఖేడేకర్ పరిచయం అయ్యారు. సచిన్ మరియు గోపీచంద్ మధ్య ఓ కీలక సన్నివేశం తర్వాత గోపీచంద్ తన ఇంటికి వెళ్ళాడు.
Date & Time : 09:10 AM May 05, 2023
-
ఇప్పుడు సినిమాలో మెలోడీ సాంగ్ నువ్వే నువ్వే మొదలైంది.అలాగే భైరవి (డింపుల్ హయాతి) ఓ వ్లోగర్ గా అయితే పరిచయం అయ్యింది. వారి లవ్ రిలేటెడ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:05 AM May 05, 2023
-
ఇప్పుడు గోపీచంద్ పై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ మొదలైంది.
Date & Time : 09:00 AM May 05, 2023
-
ఇప్పుడు జగపతిబాబు గోపీచంద్ అన్నయ్యగా పరిచయం అయ్యారు. అలాగే నాజర్ కూడా స్క్రీన్ పైకి వచ్చారు. గోపీచంద్, జగపతి బాబు తో చిన్న స్పర్ధల వల్ల తన ఇంటి నుంచి బయటకి వచ్చేసాడు.
Date & Time : 08:55 AM May 05, 2023
-
సినిమా కలకత్తా లో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు గోపీచంద్ ఒక సింపుల్ అండ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ సీన్ మొదలైంది.
Date & Time : 08:50 AM May 05, 2023
-
హాయ్..145 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:45 AM May 05, 2023