-
చివరిగా తన కుటుంబంలోని కన్ఫ్యూజన్ కు కారణం తాను కాదని హీరో తెలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది..... సినిమా పూర్తి అయింది... పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ వుండండి.
Date & Time : 12:30 AM June 01, 2018
-
కుటుంబంలో కన్ఫ్యూజన్ నింపినది ఎవరు అని హీరో వారిని కనుక్కునే పనిలో వున్నాడు....ప్రస్తుతం ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ వస్తూ, సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 12:25 AM June 01, 2018
-
సినిమాలో మరొక ట్విస్ట్ రివీల్ అయింది.....ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 12:20 AM June 01, 2018
-
ప్రస్తుతం హీరో, హీరోయిన్ ల ఎంగేజ్మెంట్ కు సంబంధించి మంచి సెలెబ్రేషన్ సాంగ్ వస్తోంది.
Date & Time : 12:09 AM June 01, 2018
-
హీరో రకరకాల కథలు సృష్టించి తన తండ్రి కూడా దొంగే అని చెప్తాడు....ప్రస్తుతం వారి మధ్య కొన్ని కామెడీ సీన్లు వస్తున్నాయి
Date & Time : 11:57 AM June 01, 2018
-
ఇతరులను ఇబ్బందిపెట్టే వ్యక్తిగా రావు రమేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.....హీరోయిన్ తాతయ్యతో పలు గొడవలుండడంతో ఆయనపై కక్ష తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 11:57 AM June 01, 2018
-
సుబ్బరాజు హీరోను దొంగగా అందరిముందు రుజువుచేయాలని చూస్తున్న ప్రతిసారీ పెద్ద దెబ్బ తింటున్నాడు.....ప్రస్తుతం సుబ్బరాజు, కృష్ణ భగవాన్ లపై కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 11:49 AM June 01, 2018
-
మంచి లొకేషన్లలో నయనానందకరంగా పిక్చరైజ్ చేయబడిన సినిమాలోని నాలుగవ పాట ప్రస్తుతం వస్తోంది.
Date & Time : 11:39 AM June 01, 2018
-
సెకండ్ హాఫ్ మంచి ఇంటరెస్టింగ్ గా మొదలయింది....నటుడు సుబ్బరాజు వన్ సైడ్ లవర్ గా హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 11:29 AM June 01, 2018
-
హీరో, హీరోయిన్ల పెళ్ళికి ఆమె తాతయ్య అనుమతిచ్చారు...రెండు కుటుంబాలు హీరోయిన్ గ్రామానికి బయలుదేరారు.... ప్రస్తుతం ఇంటర్వెల్ సమయం
Date & Time : 11:17 AM June 01, 2018
-
సినిమాలో పెద్ద ట్విస్ట్ రివీల్ అయింది....ప్రస్తుతం సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది
Date & Time : 11:10 AM June 01, 2018
-
ప్రస్తుతం మరొకపాట రాజుగడు అనే రొమాంటిక్ గీతం వస్తోంది
Date & Time : 11:01 AM June 01, 2018
-
హీరో ఫ్యామిలీని హీరోయిన్ తన పోలీస్ ఆఫీసర్ అయిన తన తండ్రికి పరిచయం చేసింది....రాజ్ తరుణ్ తన చోర కళను బయటపడకుండా తగు జాగ్రత్తలు పడుతున్నాడు...ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:56 AM June 01, 2018
-
హీరోయిన్ ఒక చిన్న దొంగతనం చేయమని అడగడంతో ఆ పనిలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు హీరో ...... సీన్ ఫన్నీగా సాగుతోంది
Date & Time : 10:51 AM June 01, 2018
-
ఎవరినైనా ప్రేమించడం వల్ల తన వ్యాధి నయం అవుతుందని హీరో తెలుసుకుంటాడు.....హీరోయిన్ ను ఎలా అయినా తన ప్రేమలో పడేయాలని చూస్తున్నాడు
Date & Time : 10:43 AM June 01, 2018
-
సినిమాలోకి హీరోయిన్ అమైరా ఎంట్రీతో రెండవ సాంగ్ మొదలయింది .....హీరో మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడ్డాడు
Date & Time : 10:35 AM June 01, 2018
-
క్లప్టోమేనియా అనే ఒక వింత వ్యాధితో హీరో బాధ పడుతున్నాడు. కమెడియన్ పృథ్వి డాక్టర్ గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు....హీరోకు వున్నా వ్యాధిని నయం చేస్తానని ఛాలెంజ్ చేసాడు... ప్రస్తుతం కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:30 AM June 01, 2018
-
ఒక యూత్ ఫుల్ సాంగ్ తో హీరో రాజ్ తరుణ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 10:24 AM June 01, 2018
-
ఒక ఫన్నీ సీన్ తో సినిమా మొదలయింది....హీరో చిన్నప్పటి సన్నివేశాలు వస్తున్నాయి....చిన్నతనం నుండి హీరో ఒక దొంగగా చూపించబడ్డాడు
Date & Time : 10:19 AM June 01, 2018
-
హాయ్.. 130 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:15 AM June 01, 2018