-
ఆసక్తికరమైన ఫైట్ సీన్ తరువాత చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 6:03 AM October 18, 2017
-
సాంగ్ లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో నింపేశారు. రాధిక విలన్ కి వార్నింగ్ ఇచ్చిన తరువాత హీరో విలన్ మధ్య పోరాట సన్నివేశం వస్తోంది.
Date & Time : 5:59 AM October 18, 2017
-
కామెడీ హీరోయిజం రెండు కలగలిపిన చేసిన ఫైట్ సీన్ బావుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సాంగ్ 'ఎన్నీయల్లో ఎన్నీయల్లో' వస్తోంది.
Date & Time : 5:52 AM October 18, 2017
-
సాంగ్ పూర్తయింది. చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. ఆసక్తికరమైన ఫైట్ సీన్ కు అంతా సిద్ధం అయింది.
Date & Time : 5:44 AM October 18, 2017
-
మెహ్రీన్ రవితేజ ప్రేమలో పడింది. ప్రస్తుతం అందమైన 'నాకే నే నచ్చేస్తున్నా' సాంగ్ వస్తోంది. రాశిఖన్నా సాంగ్ లో సర్ప్రైజింగ్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 5:34 AM October 18, 2017
-
ప్రస్తుతం విలన్ గ్యాంగ్ మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి. దర్శకుడు కొన్ని మంచి కామెడీ సీన్స్ ని జత చేశారు.
Date & Time : 5:30 AM October 18, 2017
-
ప్రస్తుతం విలేజ్ లో జరిగే ఉత్సవంలో ఫైట్ సీన్ వస్తోంది. హీరో విలన్ మధ్య హోరాహోరీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 5:24 AM October 18, 2017
-
కొన్ని పొట్ట చెక్కలయ్యే కామెడీ సీన్స్ తరువాత నటుడు సాయి కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 5:17 AM October 18, 2017
-
బాగా ప్రచారం పొందిన 'గున్న గున్న మామిడి' సాంగ్ వస్తోంది.
Date & Time : 5:14 AM October 18, 2017
-
గ్రామంలో రవితేజకు, మెహ్రీన్ బాబాయిలకు మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 5:10 AM October 18, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. హీరో, విలన్ మధ్య వార్నింగ్ సీన్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చిత్రం మెహ్రీన్ చిన్ననాటి గ్రామానికి మారింది.
Date & Time : 5:03 AM October 18, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : కొన్ని కామెడీ సీన్స్, మంచి డైలాగులతో రాజ ది గ్రేట్ చిత్ర ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ముగిసింది. రవితేజ ఎనర్జిటిక్ ఫెర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
Date & Time : 5:00 AM October 18, 2017
-
రవితేజ చూపులేని వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో ఫైట్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్ అనే డైలాగ్ రవితేజ క్యారెక్టర్ కు సరిపోయే విధంగా ఉంది. ఇప్పుడు ఇంటర్వెల్.
Date & Time : 4:57 AM October 18, 2017
-
చిత్రం ఇంటర్వల్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం హీరో విలన్ల మధ్య భారీ ఫైట్ సీన్ వస్తోంది.
Date & Time : 4:52 AM October 18, 2017
-
విలన్ గ్యాంగ్ మెహ్రీర్ జాడని కనిపెట్టారు. ప్రస్తుతం ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 4:50 AM October 18, 2017
-
మరి కొన్ని కామెడీ సీన్స్ తరువాత చిత్రంలో 'ఆల్లబె ఆల్లబె' అనే సాంగ్ వస్తోంది. డార్జిలింగ్ లోని అందమైన లొకేషన్ లలో సాంగ్ ని చిత్రీకరించారు.
Date & Time : 4:45 AM October 18, 2017
-
చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. రవితేజ చిన్న నటి సన్నివేశాలు చూపిస్తున్నారు. రవితేజ కొడుకే చిన్ననాటి రవితేజగా నటిస్తున్నాడు.
Date & Time : 4:42 AM October 18, 2017
-
ప్రస్తుతం బ్యాంక్ రాబరీ సీన్స్ వస్తున్నాయి. చిత్రంలో కామెడీ సన్నివేశాలు బాగా పండుతున్నాయి.
Date & Time : 4:39 AM October 18, 2017
-
హీరోయిన్ తో స్నేహం కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు. 30 ఇయర్స్ పృద్వి ఎంట్రీ ఇచ్చాడు. హీరో, రాజేంద్ర ప్రసాద్, పృద్వి మధ్య అద్భుతమైన కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 4:33 AM October 18, 2017
-
మరో సీనియర్ నటి అన్నపూర్ణ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 4:23 AM October 18, 2017
-
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. అతడి కుమార్తెగా కమెడియన్ విద్యుల్లేఖ పరిచయం అయింది. ప్రస్తుతం ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 4:20 AM October 18, 2017
-
చిత్రం ఇప్పుడు డార్జిలింగ్ కు మారింది. హీరోయిన్ కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 4:18 AM October 18, 2017
-
ప్రస్తుతం రాధిక, రవితేజ మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 4:16 AM October 18, 2017
-
Yహీరో తల్లిగా సీనియర్ నటి రాధిక పరిచయం అయ్యారు. ఆమె ఒక మహిళా కానిస్టేబుల్.
Date & Time : 4:14 AM October 18, 2017
-
మ్యాచ్ లో హీరో గ్యాంగ్ విజయం సాధించింది. ప్రస్తుతం సూపర్ హిట్ టైటిల్ సాంగ్ 'రాజా ది గ్రేట్ రా' వస్తోంది.
Date & Time : 4:10 AM October 18, 2017
-
ప్రముఖ కమెడియన్స్ అలీ, బిత్తిరి సత్తి, రఘు బాబులు వరుసగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హీరో గ్యాంగ్ కు, ఇతరులకి మధ్య కబడ్డీ మ్యాచ్ జరుగుతోంది.
Date & Time : 4:06 AM October 18, 2017
-
మాస్ మహారాజ రవితేజ ఎనర్జిటిక్ ఎంట్రీ ఇచ్చాడు. హీరో ఫ్రెండ్ గా శ్రీనివాస్ రెడ్డి కూడా సీన్ లోకి వచ్చాడు.
Date & Time : 4:02 AM October 18, 2017
-
ప్రస్తుతం విలన్ పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ సిన్సియర్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు.
Date & Time : 3:54 AM October 18, 2017
-
అదే సాంగ్ లో హీరోయిన్ మెహ్రీన్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 3:45 AM October 18, 2017
-
పోలీస్ గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. అతడి కుమార్తె చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో చిన్నారి సాంగ్ ప్లే అవుతోంది.
Date & Time : 3:42 AM October 18, 2017
-
హాయ్..149 నిమిషాల నిడివి గల 'రాజా ది గ్రేట్' చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది.
Date & Time : 3:40 AM October 18, 2017