-
భారీ క్లైమాక్స్ తర్వాత సినిమా మంచి నోట్‌తో ముగుస్తుంది. రాధే శ్యామ్ యొక్క పూర్తి సమీక్ష కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 02:35 AM March 11, 2022
-
సినిమా ఇప్పుడు పూర్తి సీరియస్‌గా నడుస్తూ.. భారీ క్లైమాక్స్ దిశగా వెళ్తుంది
Date & Time : 02:18 AM March 11, 2022
-
లీడ్ పెయిర్ మధ్య రొమాంటిక్ సాంగ్.. నిన్నే లే అనే పాట వస్తుంది.
Date & Time : 02:05 AM March 11, 2022
-
ఇప్పుడు కథలో బిగ్ రివీల్ జరుగుతుంది.
Date & Time : 01:53 AM March 11, 2022
-
ప్రస్తుతం ప్రభాస్, సచిన్ ఖేడేకర్ మధ్య హస్తసాముద్రిక సన్నివేశాలు జరుగుతున్నాయి. చిన్న ట్విస్ట్‌తో జగపతి బాబు మళ్లీ సీన్ లోకి వచ్చాడు.
Date & Time : 01:42 AM March 11, 2022
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా అద్భుతమైన విజువల్స్ మరియు సంగీతంతో ఎంతో రిచ్‌గా మరియు అందంగా అనిపించింది. ప్రభాస్, పూజా హెగ్డే చక్కటి నటనను కనబరిచారు. కానీ ప్రొసీడింగ్స్ మాత్రం యావరేజ్‌గా ఉన్నాయి. మరి సెకండాఫ్‌లో సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.
Date & Time : 01:25 AM March 11, 2022
-
కథలో ఓ షాకింగ్ ట్విస్ట్ ఏర్పడింది. ఇప్పుడు ఇంటర్వెల్ సమయం.
Date & Time : 01:20 AM March 11, 2022
-
నగుమోము తారలే మెలోడియస్ సాంగ్‌ని చాలా బాగా చిత్రీకరించారు. కథానాయకుల మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 01:05 AM March 11, 2022
-
కథలో చిన్న ట్విస్ట్ ఏర్పడింది. పూజా హెగ్డేని ఆకర్షించేందుకు ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. కొన్ని అందమైన సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 00:57 AM March 11, 2022
-
ఈ రాతలే సాంగ్ చాలా బాగుంది. పెద్ద బిజినెస్‌మెన్‌గా జగపతిబాబు ఎంట్రీ ఇవ్వగా, అతడిని ప్రభాస్ కలిశాడు.
Date & Time : 00:45 AM March 11, 2022
-
ప్రభాస్ మరియు పూజా హెగ్డే ఒకరినొకరు కలుసుకున్నారు. ఇద్దరి మధ్య కొన్ని క్యూట్ సీన్స్ సాగుతున్నాయి.
Date & Time : 00:34 AM March 11, 2022
-
డా.ప్రేరణగా పూజా హెగ్డే లవ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఇతర కీలక పాత్రలను కూడా పరిచయం చేశారు.
Date & Time : 00:27 AM March 11, 2022
-
మొదటి పాటగా సంచారీ సాంగ్ మొదలయ్యింది. విజువల్స్ మరియు లొకేషన్స్ చాలా బాగున్నాయి.
Date & Time : 00:21 AM March 11, 2022
-
రాకింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రభాస్ విక్రమాదిత్యగా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 00:18 AM March 11, 2022
-
అద్భుతమైన ఓషియన్ షాట్లతో ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలతో సినిమా మొదలయ్యింది.
Date & Time : 00:14 AM March 11, 2022
-
మెగాస్టార్ చిరంజీవి మరియు ఎస్ఎస్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా ప్రారంభమయ్యింది.
Date & Time : 00:10 AM March 11, 2022
-
హాయ్..138 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 00:05 AM March 11, 2022