-
ఒక అద్భుతమైన సీన్ తో సినిమా ముగుస్తుంది. పుష్ప 2 పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
Date & Time : 01:15 AM December 05, 2024
-
ఊహించని విధంగా ఒక ఎక్సట్రార్డినరీ ఫైట్ సీన్ వస్తుంది. అల్లు అర్జున్ పూర్తిగా డెవిల్ మోడ్ లోకి మారిపోతాడు. ఆడియన్స్ కి ఇది మాస్ ఫీస్ట్ అని చెప్పాలి. కథ క్లైమాక్స్ కి చేరుకుంటుంది.
Date & Time : 00:55 AM December 05, 2024
-
అల్లు అర్జున్ ర్యాంపేజీ మూడ్ కి షిఫ్ట్ అవుతాడు. పర్సనల్ విషయాలు, రైజింగ్ అతడిని మరింత ఎత్తుకి తీసుకెళ్తాయి.
Date & Time : 00:40 AM December 05, 2024
-
హీరో, విలన్ మధ్య మరో భీకర ఫైట్ చోటు చేసుకుంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్, రావు రమేష్ ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 00:23 AM December 05, 2024
-
జాతర ఫైట్ సీన్ అదిరిపోయింది. పైసా వసూల్ పర్ఫెక్ట్ మూమెంట్ ఇది. రష్మిక నాన్ స్టాప్ డైలాగ్ కూడా అదిరింది.
Date & Time : 00:10 AM December 05, 2024
-
ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ తర్వాత.. జాతర ఎపిసోడ్ వస్తుంది. అల్లు అర్జున్ డాన్స్ అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సూసేకి సాంగ్ కూడా వస్తుంది.
Date & Time : 11:45 PM December 04, 2024
-
ఒక గ్రిప్పింగ్ ఛేజ్ సీన్స్ తో సెకండ్ హాఫ్ మొదలైంది. అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ మధ్య అదిరిపోయే సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:35 PM December 04, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు కథ బాగుంది. అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ ల సాలిడ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది.. అందరు సెకండ్ హాఫ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Date & Time : 11:25 PM December 04, 2024
-
తనని ఆపాలంటూ అల్లు అర్జున్ ఫహద్ కు ఛాలెంజ్ విసురుతాడు. ఇక్కడ ఇంటర్వెల్ వస్తుంది.
Date & Time : 11:15 PM December 04, 2024
-
అల్లు అర్జున్, ఫహద్ ల సేఫ్ ఫ్యామిలీ సీన్స్ తరువాత ఊహించని ట్విస్ట్ తో కథ మరింత ఆసక్తిగా మారింది.
Date & Time : 11:05 PM December 04, 2024
-
ఫహద్ ఫాజిల్ సహాయంతో పుష్ప చేసిన మాస్టర్ ప్లాన్ ని విధ్వంసం చేసేందుకు అనసూయ, సునీల్ ఎంటర్ అవుతారు.
Date & Time : 10:44 PM December 04, 2024
-
సిండికేట్ మీటింగ్ తర్వాత పీలింగ్స్ సాంగ్ కి టైమ్ అయ్యింది. అల్లు అర్జున్, రష్మిక మధ్య మాస్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:34 PM December 04, 2024
-
క్యాంప్ ఆఫీస్ లో అల్లు అర్జున్, రావు రమేష్, ముఖ్యమంత్రిల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కథ ఇప్పుడు ఢిల్లీకి షిఫ్ట్ అవడంతో జగపతి బాబు సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:24 PM December 04, 2024
-
టైటిల్ సాంగ్ తో మూవీ టైటిల్ రివీల్ అయ్యింది. అల్లు అర్జున్ రష్మిక మందన్న మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ జరుగుతున్నాయి.
Date & Time : 10:14 PM December 04, 2024
-
కథలో చిన్న ట్విస్ట్ తర్వాత, పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్, ఆఫీసర్ల మధ్యలో కొన్ని ఇంటెన్స్ సీన్స్ నడుస్తున్నాయి.
Date & Time : 10:04 PM December 04, 2024
-
పోర్ట్ లో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్.. హీరో అదిరిపోయే ఎంట్రీ తర్వాత కథలో ఊహించని విధంగా ఫహద్ ఫాజిల్ ఎంట్రీ ఇస్తాడు.
Date & Time : 09:52 PM December 04, 2024
-
జపాన్ లోని యోకొహమా పోర్ట్ లో కథ ప్రారంభం అవుతుంది. అల్లు అర్జున్ మాసివ్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది.
Date & Time : 09:42 PM December 04, 2024
-
హాయ్.. 3 గంటల 20 నిమిషాల నిడివితో సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:32 PM December 04, 2024
-
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' స్పెషల్ ప్రీమియర్ సందర్భంగా థియేటర్ లో పండుగ వాతావరణం నెలకొంది.
Date & Time : 09:22 PM December 04, 2024