-
మొత్తానికి చిత్రం సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 04:52 AM December 20, 2019
-
ఇప్పుడు చిత్రం క్లైమాక్స్ కు చేరుకుంది.ఇక్కడ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు.
Date & Time : 04:46 AM December 20, 2019
-
ఇప్పుడొక వింతైన ట్విస్ట్ చోటు చేసుకోడంతో పాటు ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:40 AM December 20, 2019
-
ఇప్పుడు మరో ఎమోషనల్ సీన్..సత్యరాజ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.
Date & Time : 04:35 AM December 20, 2019
-
తండ్రికి మరియు కొంతమంది చెడు కొడుకుల మధ్య బాంధవ్యాలను వ్యక్తపరుస్తూ మురళీ శర్మ పై ఒక అద్భుతమైన సీన్ వస్తుంది.
Date & Time : 04:30 AM December 20, 2019
-
అజయ్ మరియు సత్యం రాజేష్ లు ఓ యాక్షన్ సీన్ తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు తేజ్ సిక్స్ ప్యాక్ ఫైట్ మొదలయ్యింది.
Date & Time : 04:25 AM December 20, 2019
-
ఇప్పుడు సత్యరాజ్ పుట్టిన రోజు వేడుకల్లో తకిట తకిట సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 04:15 AM December 20, 2019
-
ఇప్పుడు రావు రమేష్ మరియు హరితేజ మధ్య హిలేరియస్ కామెడీ సీన్ వస్తుంది.
Date & Time : 04:05 AM December 20, 2019
-
ఇప్పుడు మరికొన్ని ఫ్యామిలీ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:00 AM December 20, 2019
-
ఇప్పుడు యు ఆర్ మై హై సాంగ్ మొదలయ్యింది.ఈ పాటలో తేజ్ మరియు రాశిల డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి.
Date & Time : 03:50 AM December 20, 2019
-
ఇంటర్వెల్ అనంతరం రావు రమేష్ పై కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:45 AM December 20, 2019
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఊహించదగ్గ కథనంతో ఒకే అని చెప్పొచ్చు.కొన్ని ఫ్యామిలీ ఫన్నీ సీన్స్ మినహా ఇంకా అంత గొప్ప అంశాలు ఏమీ కనిపించలేదు.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 03:40 AM December 20, 2019
-
సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది.ఇపుడు విరామం.
Date & Time : 03:35 AM December 20, 2019
-
ఇప్పుడు హాస్పిటల్ లో కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఆందోళనకర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:30 AM December 20, 2019
-
కుటుంబ సభ్యులు అందరిని ఓ చోటకు చేర్చే సీన్స్ చాలా హిలేరియస్ పద్దతిలో వస్తున్నాయి.
Date & Time : 03:24 AM December 20, 2019
-
ఇప్పుడు టైటిల్ సాంగ్ తో సాయి తేజ్ మరియు రాశీల పెళ్లి పనులు మొదలయ్యాయి.
Date & Time : 03:20 AM December 20, 2019
-
ఇప్పుడు రాశీ మరియు తేజ్ ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:12 AM December 20, 2019
-
ఇప్పుడు సత్యం రాజేష్ మరియు అజయ్ లు సింక్ బ్రదర్స్ గా పరిచయం అయ్యారు.వారితో కొన్ని భూమి సంబంధిత సమస్యలపై తేజ్ మాట్లాడుతున్నాడు.
Date & Time : 03:06 AM December 20, 2019
-
ఇప్పుడు రాశి మరియు ఆమె చెల్లెళ్ళతో సూపర్ హిట్ ట్రాక్ ఓ బావ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 03:00 AM December 20, 2019
-
ఇప్పుడు సాయి మరియు రాశీఖన్నా ఫ్యామిలి మధ్య కొన్ని కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:55 AM December 20, 2019
-
ఇప్పుడు ఫేమస్ టిక్ టాక్ సెలెబ్ ఏంజెల్ ఆర్న గా హీరోయిన్ రాశీ ఖన్నా ఒక ఫన్నీ వే లో పరిచయం అయ్యింది.
Date & Time : 02:51 AM December 20, 2019
-
ఇప్పుడు 96 సినిమా నుంచి సత్యరాజ్ మరియు ప్రభా ల మధ్య ఓ స్పూఫ్ సీన్ వస్తుంది.
Date & Time : 02:47 AM December 20, 2019
-
ఇప్పుడు జబర్దస్త్ మహేష్ సత్యరాజ్ దగ్గర పని చేసే మనిషిగా పరిచయం అయ్యాడు.కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 02:45 AM December 20, 2019
-
బ్యాక్గ్రౌండ్ లో చిన్నతనమే సాంగ్ తో సాయి ధరమ్ తేజ్ యూఎస్ నుంచి ఇండియాలోని రాజమండ్రికి వస్తున్నాడు.
Date & Time : 02:40 AM December 20, 2019
-
ఇప్పుడు కొన్ని కీలక ఎన్నారై తండ్రి కొడుకుల సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:35 AM December 20, 2019
-
ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధ పడుతున్న వ్యక్తిగా నటుడు సత్య రాజ్ పరిచయం అయ్యారు.కొన్ని రోజుల గడువు మాత్రమే అతనికి మిగిలి ఉంది.
Date & Time : 02:30 AM December 20, 2019
-
ఇప్పుడు సాయి తేజ్ గా సాయి ధరమ్ తేజ్ పరిచయం అయ్యాడు.రావు రమేష్ మరియు తేజ్ ల మధ్య కొన్ని తండ్రి కొడుకుల బంధానికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:25 AM December 20, 2019
-
మహిళా రక్షణకై సందేశాన్ని ఇస్తూ సాయి ధరమ్ తేజ్ వాయిస్ ఓవర్ తో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 02:22 AM December 20, 2019
-
హాయ్..146 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 02:15 AM December 20, 2019