-
-
ఇక్కడే మరో ఆసక్తికర ట్విస్ట్ తో సినిమా మొత్తానికి పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:53 AM January 10, 2019
-
సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దిశగా చేరుకుంటుంది.నవాజుద్దీన్ సిద్ధిఖీ మీద దాడి చేసేందుకు రజిని మరియు విజయ్ సేతుపతి చేతులు కలిపారు.
Date & Time : 07:40 AM January 10, 2019
-
సినిమా ఇప్పుడు కాస్త సైడ్ ట్రాక్ తీసుకున్నట్టు అనిపిస్తుంది.రజిని మరియు సేతుపతిల మధ్య సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 07:30 AM January 10, 2019
-
ఇప్పుడు విజయ్ సేతుపతితో రజిని మరో ఆసక్తికర ప్లాన్ చేస్తున్న సన్నివేశం వస్తుంది.చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ మరోసారి సిగెరెట్ తాగుతున్న సీన్ తో కనిపిస్తున్నారు.
Date & Time : 07:19 AM January 10, 2019
-
ఇప్పుడు రజినీని ఎలివేట్ చేసే సీన్లు పేట పరాక్ బ్యాక్గ్రౌండ్ పాటతో వస్తున్నాయి.
Date & Time : 07:11 AM January 10, 2019
-
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ముగిసిపోయింది.ఇప్పుడు రజిని నవాజ్ పై తన ప్రతీకారాన్ని తీర్చుకోడానికి కాలేజ్ విద్యార్థుల సాయంతో ప్లాన్ చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:05 AM January 10, 2019
-
అన్ని సినిమాల్లో లానే పేట భార్య త్రిషను,అతని స్నేహితుడు శశి కుమార్ ను నవాజ్ బాంబు దాడితో చంపేశారు.
Date & Time : 06:58 AM January 10, 2019
-
ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సుద్దికీ సోదరున్ని చంపడానికి పేట ఒక ఇంటెరెస్టింగ్ ప్లాన్ వేస్తున్నాడు.ఇప్పుడు ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:48 AM January 10, 2019
-
పేట భార్యగా హీరోయిన్ త్రిష ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 06:40 AM January 10, 2019
-
ఇంటర్వెల్ తర్వాత రజిని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.శశి కుమార్ పేట(రజిని) స్నేహితునిగా ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు ఆహ కళ్యాణం పాట వస్తుంది.
Date & Time : 06:35 AM January 10, 2019
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : మొత్తానికి మొదటి సగం అంతా రజిని హిట్ సినిమా బాషా స్టైల్ లో మంచి నరేషన్ తో మంచి ఎలివేషన్ సీన్లతో బాగానే ఉంది.
Date & Time : 06:29 AM January 10, 2019
-
చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా సగం పూర్తి కావచ్చింది.ఇప్పుడు విరామం.
Date & Time : 06:25 AM January 10, 2019
-
ఇప్పుడు సినిమా ప్రారంభంలో వచ్చిన ఫైట్ సీన్ కి కనెక్ట్ చేసే విధంగా మారింది.రజిని నాన్ చాక్ తో ఫైట్ అదగొడుతున్నారు.
Date & Time : 06:21 AM January 10, 2019
-
సినిమా ఇప్పుడు ఇంకా సీరియస్ గా సాగుతుంది.రజిని మరియు విలన్ల మధ్య భారీ పోరాట సన్నివేశానికి ఇప్పుడు రంగం సిద్ధమయ్యింది.
Date & Time : 06:17 AM January 10, 2019
-
ఫైట్ సీన్ లో ఇప్పుడొక ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది.రజిని మరోసారి తన యాక్షన్ అదరగొడుతుంటే దానికి తగ్గట్టుగా అనిరుద్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అడగొడుతున్నాడు.
Date & Time : 06:10 AM January 10, 2019
-
బాబీ సింహా అతని గ్యాంగ్ అక్కడి కాలేజ్ జూనియర్స్ మీద మరియు రజిని పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..ఇప్పుడు రజిని మరియు స్టూడెంట్స్ మధ్య ఉల్లాల్ల పాట వస్తుంది.
Date & Time : 06:05 AM January 10, 2019
-
మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లో ప్రేమికులకు పెళ్లి చేసే గ్యాంగ్ లీడర్ గా విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 05:57 AM January 10, 2019
-
ఇప్పుడు సిమ్రాన్ మరియు రజినీలా మధ్య పెదవి చివరికే పాట వస్తుంది.ఈ పాటలో ఈ ఇద్దరి జంట ముచ్చటగా ఉంది.
Date & Time : 05:48 AM January 10, 2019
-
అక్కడి క్యాంపస్ లో పిశాచి సినిమా హీరో నాగ మరియు మేఘా ఆకాష్ లు ప్రేమికులుగా కనిపిస్తున్నారు.ఇప్పుడు ప్రాణిక్ హీలర్ గా సీనియర్ నటి సిమ్రాన్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 05:42 AM January 10, 2019
-
మొదటి సంవత్సరం విద్యార్ధినిగా మేఘా ఆకాష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 05:29 AM January 10, 2019
-
జూనియర్స్ ని ర్యాగింగ్ చేసే సీనియర్ లా బాబీ సింహా ఎంట్రీ ఇచ్చారు,ఇప్పుడు అనిరుద్ అందించిన మాస్ బీట్ మాసు మరనం పాటకి బాబీ సింహా మరియు స్టూడెంట్స్ తో పాటు సూపర్ స్టార్ కూడా తనదైన స్టెప్స్ వేస్తున్నారు.
Date & Time : 05:19 AM January 10, 2019
-
ఇప్పుడు చిత్రం 6 నెలల వెనక్కి వెళ్ళింది,రజినీకాంత్ ఒక హాస్టల్ వార్డెన్ గా పరిచయం కాబడ్డారు.
Date & Time : 05:12 AM January 10, 2019
-
యాక్షన్ సన్నివేశంతో సినిమా మొదలయ్యింది..రజిని ఎంట్రీకి ఇప్పుడు రంగం సిద్ధమయ్యింది.
Date & Time : 05:06 AM January 10, 2019
-
హాయ్ 172 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది..
Date & Time : 05:00 AM January 10, 2019