మొదటి షో వివరాలు : పెద్ది
సినిమా ఒక గుడ్ నోట్‌తో ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
రామ్ చరణ్ గెలుపు తర్వాత ఇచ్చే స్పీచ్ అసలైన మెసేజ్ చెబుతుంది. సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
రామ్ చరణ్ ఒక షాకింగ్ నిర్ణయం అతని లైఫ్ మారిపోయింది. ఇప్పుడు ఒక కొత్త ఆటలోకి అడుగు పెట్టాడు. కొన్ని ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి.
కథలో ఒక ఊహించని ట్విస్ట్ తో ఎమోషనల్ డ్రామా సాగుతుంది. తర్వాత ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంటుంది.
జాతీయ స్థాయి పోటీలకు పెద్ది సెలెక్ట్ అవుతాడు. ఉత్కంఠగా సాగే రెజ్లింగ్ పోటీలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది.
ఒక ట్విస్ట్ తో పెద్ది రింగ్ లోకి ఎంటర్ అయ్యాడు. క్రాస్ ఓవర్ అథ్లెట్ మూమెంట్స్ రెహమాన్ స్కోర్ తో బాగా పండాయి.
సెకండాఫ్‌లో రామ్ చరణ్ రెజ్లింగ్‌లో ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు. ‘మసా మసా’ సాంగ్‌లో అతడి ట్రెయినింగ్ చూపిస్తున్నారు.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు పెద్ది సినిమా డీసెంట్‌గా సాగింది. రామ్ చరణ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. క్రికెట్ సీక్వెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ మెప్పిస్తాయి. మ్యూజిక్ డీసెంట్‌గా ఉంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
రామ్ చరణ్ ఇప్పుడు తన జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు ఇంటర్వెల్‌కు టైమ్ అయింది.
ఒక షాకింగ్ ఇన్సిడెంట్‌తో రామ్ చరణ్ చేసే పనితో అతడు ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
రెజ్లింగ్ మాస్టర్‌గా శివ రాజ్‌కుమార్ పరిచయం అయ్యాడు. అనుకోని ఓ ఘటనతో ఒక ఇంటెన్స్ ఫైట్ రావడంతో అది ఒక టెర్రిఫిక్ క్రికెట్ మ్యాచ్‌కు దారి తీస్తుంది.
మాజీ ఎమ్మెల్యే కూతురిగా జాన్వీ కపూర్ పరిచయం అయింది. కొన్ని ఫన్, రొమాంటిక్ మూమెంట్స్ తర్వాత బ్లాక్‌బస్టర్ ‘చికిరి చికిరి’ పాట వస్తుంది.
‘పెద్ది’ గ్రామం, వారి కష్టాలకు సంబంధించిన నేపథ్యం రివీల్ చేశారు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబు ఎంట్రీ ఇవ్వగా, కొన్ని ఎమోషనల్ సీన్స్ సాగుతున్నాయి.
ఒక భారీ బిల్డప్ తర్వాత రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్‌లో టెర్రిఫిక్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ‘రై రై రా రా’ సాంగ్ వస్తుంది.
ఒలింపిక్ మెడల్స్ కోసం కృషి చేసేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సమావేశంతో ఈ చిత్ర కథ ప్రారంభం అవుతుంది.
3 గంటల 9 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
హాయ్.. ‘పెద్ది’ ప్రీమియర్ షో కోసం సినిమా థియేటర్ అభిమానులతో కిక్కిరిసిపోయింది.