-
-
సినిమా ఒక ఆసక్తికర అంశంతో ఊహించని విధంగా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 08:30 AM December 21, 2018
-
మొత్తానికి సినిమా క్లైమాక్స్ దిశకు చేరుకుంటుంది.ఇప్పుడే ఎమోషనల్ గా సాగే "ఏమైపోయావే" పాట వస్తుంది.
Date & Time : 08:05 AM December 21, 2018
-
శర్వానంద్ మరో సారి సాయి పల్లవిని ఇంప్రెస్ చేసి తన ప్రేమను గెలిపించుకోడానికి ప్రయత్నిస్తున్నారు.ఇప్పుడే హాస్య నటులు వెన్నెల కిశోర్ మరియు సునీల్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:52 AM December 21, 2018
-
హీరో హీరోయిన్ల మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 07:35 AM December 21, 2018
-
శర్వానంద్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ముగిసింది.ఇప్పుడు నేపాల్ లో కథ మొదలయ్యింది.
Date & Time : 07:30 AM December 21, 2018
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : మొత్తానికి శర్వానంద్ మరియు సాయి పల్లవి అద్భుతమైన నటన,ఆసక్తికరంగా ఎక్కడా బోర్ కొట్టించుకుండా సాగే స్క్రీన్ ప్లే మరియు ఫస్టాఫ్ లో వచ్చే అన్ని పాటలు బాగున్నాయి.సినిమాలో చూపించే విజువల్స్ మరియు బాక్గ్రౌంగ్ స్కోర్ కూడా సూపర్ అని చెప్పొచ్చు.కథానుసారం అక్కడక్కడా వచ్చే హాస్య సన్నివేశాలతో మొత్తానికి ఫస్టాఫ్ అద్భుతంగా ఉందనే చెప్పాలి.
Date & Time : 07:13 AM December 21, 2018
-
ఇప్పుడే ఒక ఊహించని ట్విస్ట్ తో మొదటి సగం ముగిసింది.ఇప్పుడు విరామం.
Date & Time : 07:07 AM December 21, 2018
-
ప్రధాన పాత్రధారుల ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంది.క్లాస్ రూమ్ లో హగ్ చేసుకునే సన్నివేశాలను చూస్తే కాస్త మణిరత్నం సినిమాల్లో కనిపించే రొమాంటిక్ సన్నివేశాలను చూసిన అనుభవం కలుగుతుంది.
Date & Time : 07:02 AM December 21, 2018
-
శర్వానంద్, సాయి పల్లవికి తన ప్రేమను కాస్త భిన్నంగా వ్యక్తపరిచారు.హీరోయిన్ కూడా ప్రేమను అంగీకరించింది,ఇప్పుడు ఈ సినిమా హిట్ ట్రాక్ "పడి పడి లేచె మనసు" పాట వస్తుంది.
Date & Time : 06:55 AM December 21, 2018
-
హీరో,హీరోయిన్ల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:37 AM December 21, 2018
-
సాయి పల్లవి ఇప్పుడిప్పుడే శర్వానంద్ ను ఇష్టపడడం మొదలు పెట్టింది.ఇదే సమయంలో ఓ మై లవ్లీ లలన పాట మొదలయ్యింది.చిత్రీకరణ మరియు కొరియోగ్రఫీ బాగున్నాయి.
Date & Time : 06:30 AM December 21, 2018
-
"నువ్ ఇన్స్టాంట్ గా ఇన్ని దోశలు ఎట్లా వేస్తావురా" అనే సన్నివేశానికి థియేటర్లో మంచి స్పందన వస్తుంది.ఇప్పుడు ఒక ఫైట్ సన్నివేశం వస్తుంది,ఆర్ట్ వర్క్ మరియు డైరక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫి బాగుంది.
Date & Time : 06:22 AM December 21, 2018
-
బాక్గ్రౌండ్ లో ప్రపంచమే పాటతో హీరో సాయి పల్లవిని ఫాలో అవుతున్నారు.
Date & Time : 06:15 AM December 21, 2018
-
శర్వా మరియు సాయి పల్లవి మొదటి సారి కలుసుకున్న సన్నివేశం వస్తుంది.హీరో స్నేహితులుగా ప్రియాదర్శి మరియు అతని గ్యాంగ్ ఇప్పుడు పరిచయం కాబడ్డారు.
Date & Time : 06:10 AM December 21, 2018
-
వైశాలిగా హీరోయిన్ సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు మొదటి పాట వైపు సినిమా వెళ్తుంది.
Date & Time : 06:02 AM December 21, 2018
-
ఇప్పుడు హీరో శర్వానంద్ కు మరియు కొరియోగ్రాఫర్ రాజు సుందరంలకు మధ్య ఒక ఫన్నీ ఫైట్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 05:57 AM December 21, 2018
-
నేపాల్ లో సన్నివేశాలతో చిత్రం మొదలయ్యింది.హీరో శర్వానంద్(సూర్య) తన కథను చెప్పడం మొదలుపెట్టారు.ఇప్పుడు కథ కలకత్తాకు వచ్చింది.
Date & Time : 05:52 AM December 21, 2018
-
హాయ్ 160 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది...
Date & Time : 05:48 AM December 21, 2018