-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 7:50 AM November 03, 2017
-
రాజశేఖర్ ఎట్టకేలకు విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకున్నాడు. మైనింగ్ స్కామ్ గురించి నిజాలు బయట పెట్టాడు.
Date & Time : 7:42 AM November 03, 2017
-
పిఎస్వి గరుడ వేగ టైటిల్ వెనుక ఉన్న అసలు విషయం రివీల్ అయింది. కథనం ఆసక్తికరంగా సాగుతోంది.
Date & Time : 7:35 AM November 03, 2017
-
మరో వైపు ఎన్ఐఏ టీమ్ ప్రధాన విలన్ కోసం అన్వేషిస్తున్నారు. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 7:27 AM November 03, 2017
-
విలన్ గ్యాంగ్ రాజశేఖర్ పై అటాక్ చేస్తున్నారు. ప్రస్తుతం భారీ ఫైట్ సీన్ వస్తోంది.
Date & Time : 7:23 AM November 03, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం సన్నీలియోన్ సూపర్ హిట్ సాంగ్ 'డియో డియో' వస్తోంది.
Date & Time : 7:16 AM November 03, 2017
-
అక్రమ మైనింగ్ లో దాగి ఉన్న రహస్యాల్ని కనిపెట్టేందుకు రాజశేఖర్ ప్రయత్నిస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 7:11 AM November 03, 2017
-
సాయాజీ షిండే మైనింగ్ మినిస్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అతని పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 7:06 AM November 03, 2017
-
చిత్రం ప్రస్తుతం అక్రమ మైనింగ్ నేపథ్యానికి మారింది. హ్యాకింగ్ కు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 7:03 AM November 03, 2017
-
ఎన్ఐఏ టీమ్ కి విలన్ గ్యాంగ్ కి మధ్య సాగుతున్న సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 6:53 AM November 03, 2017
-
కిషోర్ కి సంబంధించిన వ్యక్తిని కాపాడేందుకు పోసాని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం రాజకీయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 6:43 AM November 03, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. నటుడు కిషోర్ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం దర్యాప్తు సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతున్నాయి.
Date & Time : 6:38 AM November 03, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చిత్రం బావుంది. బలమైన కథనం, గ్రాండ్ గా ఉన్న విజువల్స్ ఫస్ట్ హాఫ్ లో ప్లస్ పాయింట్స్ గా చెపుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
Date & Time : 6:33 AM November 03, 2017
-
ఆసక్తికరమైన సన్నివేశంతో చిత్రం తొలి అర్ధభాగం ముగిసింది. ఇప్పుడు ఇంటర్వెల్.
Date & Time : 6:30 AM November 03, 2017
-
రిపోర్ట్రర్ గా శ్రద్దా దాస్ ఎంట్రీ ఇచ్చింది. పోసాని రాజకీయ నాయకుడిగా ఎంటర్ అయ్యారు. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 6:20 AM November 03, 2017
-
జరుగుతున్న మర్డర్ ల వెనుక ఉన్న వ్యక్తిని చివరకు ఎన్ఐఏ గుర్తించింది. ప్రస్తుతం ఛేజ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 6:10 AM November 03, 2017
-
మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో దాని వెనుక ఉన్న చీకటి కోణాల్ని రాజశేఖర్ కనుగొన్నాడు. ప్రస్తుతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 6:01 AM November 03, 2017
-
హీరో ఓ మర్డర్ కేసుని దర్యాప్తు చేస్తున్నాడు. కథ వేగంగా సాగుతోంది.
Date & Time : 5:53 AM November 03, 2017
-
ఎన్ఐఏ లో ఉన్నతాధికారిగా నాజర్ ఎంటర్ అయ్యారు. సీరియస్ గా సాగే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 5:46 AM November 03, 2017
-
కమెడియన్ పృథ్వి డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం హాస్యభరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 5:43 AM November 03, 2017
-
కొన్ని ఫ్యామిలీ సన్నివేశాల తరువాత 'ప్రేమలే' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 5:40 AM November 03, 2017
-
రాజశేఖర్ ఎన్ఐఏ లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం దర్యాప్తుకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 5:37 AM November 03, 2017
-
చిత్రంలో డ్రగ్ మాఫియాకు సంబంధించిన సీన్లు వస్తున్నాయి. విజువల్స్ చాలా బావున్నాయి.
Date & Time : 5:31 AM November 03, 2017
-
అలీ లాయర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 5:26 AM November 03, 2017
-
ఛేజింగ్ ఎపిసోడ్ మొత్తం చాలా బావుంది. ఇప్పుడు చిత్రం హైదరాబాద్ కు మారింది. హీరో రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చాడు. పూజా కుమార్ అతని భార్యగా సీన్ లోకి వచ్చింది.
Date & Time : 5:23 AM November 03, 2017
-
టైటిల్స్ పడుతున్నాయి. డార్జిలింగ్ లో అద్భుతమైన బైక్ ఛేజింగ్ సన్నివేశంతో చిత్రం ప్రారంభమైంది.
Date & Time : 5:17 AM November 03, 2017
-
హాయ్..160 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 5:10 AM November 03, 2017