
మొదటి షో వివరాలు : ఓజి
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా పూర్తి యాక్షన్‌తో సాగింది. పవన్ కళ్యాణ్ స్టైలిష్‌గా కనిపించాడు. ఆయన యాక్షన్ సీక్వెన్స్‌లు టెర్రిఫిక్‌గా ఉన్నాయి. హై ఇంపాక్ట్ సీన్స్ ప్రేక్షకులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చాయి. పవన్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకున్నారో సుజీత్ అలాగే చూపెట్టాడు. సెకండాఫ్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది.
కొన్ని షాకింగ్ ఈవెంట్స్‌తో ఓజీ ఓ బ్రూటల్ బ్లడ్‌బాత్‌కు సిద్ధమవుతున్నాడు. ఇక ఇంటర్వెల్ సమయానికి ఓజీ, ఓమి మధ్య వార్ మొదలు కానుంది.
ఇమ్రాన్ హష్మి ఓ స్టైలిష్ ఎంట్రీతో పరిచయమయ్యాడు. కొన్ని సీన్స్ తర్వాత ఇప్పుడు ఓజీ తిరిగి వచ్చే సమయం ఆసన్నమయ్యింది.
కథ ఇప్పుడు ఓజస్ గంభీర గతంలోకి షిఫ్ట్ అవుతుంది. అతడి భార్యగా ప్రియాంక మోహన్ పరిచయమైంది. ఇప్పుడు ‘సువ్వి సువ్వి’ రొమాంటిక్ సాంగ్ వస్తోంది.
ఓజస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ఎంట్రీ తర్వాత కథ ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి గ్యాంగ్ లీడర్ జిమ్మీ ఓ కంటెయినర్ కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి.
ఓ వ్యక్తి మృతి కారణంగా ముంబైలో టెన్షన్ ఏర్పడుతుంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరుల ఇంట్రొడక్షన్ తర్వాత మెయిన్ లీడ్ ఓ ఇంటెన్స్ ఫైట్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. ఆయనకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ గ్లింప్స్ చూపెట్టారు.
పవన్ కళ్యాణ్ ఇంట్రోతో ఓ యునిక్ టైటిల్ కార్డు పడింది. ఇప్పుడు కథ 1993లో బొంబాయికి షిఫ్ట్ అయింది.
కథ 1940లో ప్రారంభమై 1970కి మారుతుంది. సమురాయ్ మరియు మాఫియా మధ్య యుద్ధంతో కథ మొదలవుతుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు.
హాయ్.. పవన్ కళ్యాణ్ ఓజీ ప్రీమియర్ షో ఇప్పుడే మొదలైంది. ఈ చిత్రం నిడివి 2 గంటల 34 నిమిషాలుగా ఉంది.
పవన్ కళ్యాణ్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ ‘ఓజీ’ ప్రీమియర్ కోసం హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌కు అభిమానులు, సెలబ్రిటీలు, సినీ ప్రేమికులు భారీగా తరలివచ్చారు.