-
ఆసక్తికరమైన మనోజ్ పోరాటం ముగిసింది. చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:28 AM November 10, 2017
-
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనోజ్ విప్లవం తీసుకుని వచ్చాడు. ఉత్కంఠ భరితమైన క్లైమాక్స్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 11:23 AM November 10, 2017
-
చిత్రం మళ్లీ వెనక్కు వెళ్ళింది. 20 వ శతాబ్దానికి సంబంధించిన సమస్యలని చూపిస్తున్నారు. చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:16 AM November 10, 2017
-
ఎట్టకేలకు ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగింది. వారికి కొంత సాయం అందింది.
Date & Time : 11:12 AM November 10, 2017
-
ప్రజల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ ప్రస్తుతం వస్తున్నాయి.
Date & Time : 11:08 AM November 10, 2017
-
పడవలో ఒక్కొక్కరుగా చనిపోతున్న వైనాన్ని చాలా ఉద్వేగభరితంగా చూపిస్తున్నారు.
Date & Time : 10:57 AM November 10, 2017
-
నడి సముద్రంలో ప్రయాణిస్తున్న వారి ఇబ్బందులని చూపిస్తున్నారు.
Date & Time : 10:48 AM November 10, 2017
-
ఇంటర్వల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. మనోజ్ కొంత మంది శరణార్ధులని తీసుకుని పడవలో బయలుదేరాడు. భయంకరమైన పడవ ప్రయాణాన్ని చూపిస్తున్నారు.
Date & Time : 10:40 AM November 10, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : చిత్రం ఇప్పటి వరకు చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. మనోజ్ నటన హైలైట్ గా నిలిచింది. ద్వితీయార్థం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
Date & Time : 10:25 AM November 10, 2017
-
ఇప్పుడు ఇంటర్వెల్ ఫైట్ మొదలైంది. శరణార్ధులని రక్షించడానికి మనోజ్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఇంటర్వెల్.
Date & Time : 10:20 AM November 10, 2017
-
చిత్ర కథ మరింత ఉత్కంఠ భరితంగా మారింది. కథ మొత్తం శ్రీలంక లోని శరణార్థులకు, ఆర్మీకి మధ్య జరుగుతోంది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:14 AM November 10, 2017
-
శ్రీలంక ఆర్మీకి మనోజ్ కి మధ్య అద్భుతమైన ఫైట్ సీన్ వస్తోంది. ఫైట్ లో మనోజ్ హీరోయిజాన్ని చూపిస్తున్నారు.
Date & Time : 10:05 AM November 10, 2017
-
ఎల్ టి టి ఈ హెడ్ ప్రభాకరన్ గా మనోజ్ మరో పాత్రలో కనిపిస్తున్నాడు. విప్లవాత్మక భావాలతో మనోజ్ ని చూపిస్తున్నారు.
Date & Time : 09:54 AM November 10, 2017
-
చిత్రం శ్రీలంకకు మారింది. శ్రీలంకకు వలస వెళ్లిన వారి పోరాటాలని చూపిస్తున్నారు.
Date & Time : 09:45 AM November 10, 2017
-
హీరోయిన్ అనీషా రిపోర్టర్ గా ఎంట్రీ ఇచ్చింది.నటుడు మురళి మోహన్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు.
Date & Time : 09:38 AM November 10, 2017
-
చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. మనోజ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తున్నాడు. విద్యార్థుల తరుపున వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు.
Date & Time : 09:33 AM November 10, 2017
-
జైలులో ఖైదీగా మనోజ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభ సన్నివేశం నుంచే సీరియస్ వాతావరణం నెలకొనివుంది.
Date & Time : 09:23 AM November 10, 2017
-
చిత్రం నారా రోహిత్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది.
Date & Time : 09:20 AM November 10, 2017
-
హాయ్..140 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 09:10 AM November 10, 2017