-
ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ వస్తున్నాయి శర్వానంద్ అమలాల మధ్య ఎమోషనల్ సీన్స్ నడుస్తున్నాయి. మొత్తంగా టైం ట్రావెల్ జర్నీ విజయవంతమైంది... ఇప్పటివరకు జరిగిన సినిమా ఆద్యంతం చాలా ఆకట్టుకుంది. కాగా మూవీ యొక్క పూర్తి రివ్యూ కోసం మా 123 తెలుగు సైట్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 10:20 PM September 09, 2022
-
ప్రస్తుతం హీరో శర్వానంద్, అమల అక్కినేని మధ్య హృద్యమైన సన్నివేశాలు వస్తున్నాయి. మెల్లగా అన్ని సమస్యలు తొలగిపోతున్నాయి, సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ దిశగా కొనసాగుతోంది.
Date & Time : 10:10 PM September 09, 2022
-
పరిస్థితులు మరింత జఠిలంగా మారాయి. స్నేహితులు ముగ్గురు ప్రస్తుత కాలానికి రాబోయే సమయం ఆసన్నమైంది. సినిమా అత్యద్భుతమైన స్క్రీన్ ప్లే తో కొనసాగుతోంది. సినిమాలో ముగ్గురు వ్యక్తులు తాలూకు చిన్నపిల్లలుగా నటించిన వారు ఎంతో బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారికి సంబంధించి ఆసక్తికర సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 10:05 PM September 09, 2022
-
సినిమా ప్రస్తుతం కొంత సస్పెన్స్ సీన్స్ తో కొనసాగుతోంది. ముగ్గురు స్నేహితులు ప్రస్తుత కాలానికి రావడం కోసం సైంటిస్ట్ నాజర్ ని వెతుకుతున్నారు. ఆ సందర్భంగా వారి మధ్య ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:50 PM September 09, 2022
-
సినిమాలో గతానికి ప్రస్తుత కాలానికి మధ్య కనెక్టివ్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. కామెడీ, థ్రిల్లింగ్, ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలతో ప్రస్తుతం సినిమా మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది
Date & Time : 09:40 PM September 09, 2022
-
ఆ విధంగా పెద్ద వయసు వారు పూర్వపు కాలంలో, చిన్న వయసు వారు ప్రస్తుత కాలంలో ఉండిపోవడంతో ఇరు కాలాల మధ్య, ఇరువైపుల వ్యక్తుల మధ్య ప్రస్తుతం ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:25 PM September 09, 2022
-
ఇంటర్వెల్ తర్వాత ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన సీను వస్తోంది. ముగ్గురు కీలక నటుల పెద్ద వయసు వ్యక్తులు 1998లో ఇరుక్కుపోగా, అదే వ్యక్తుల చిన్నవయసు పిల్లలు 2019 కి వచ్చారు. సినిమా ప్రస్తుతం వారికి సంబంధించి థ్రిల్లింగ్ అంశాలతో కొనసాగుతోంది.
Date & Time : 09:15 PM September 09, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్ డేట్ :మొత్తంగా ఫస్టాఫ్ ని పరిశీలించినట్లయితే అలరించే కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ సన్నివేశాలతో సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తిని పెంచేలా ఉంది ఇంటర్వెల్ ట్విస్ట్. కాగా ఇవన్నీ ఎంతో బాగున్నాయి, మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:05 PM September 09, 2022
-
ఇప్పుడే ఆకట్టుకునే సన్నివేశంతో ఇంటర్వెల్ సీన్ వచ్చింది.
Date & Time : 09:05 PM September 09, 2022
-
సినిమాలో ఇప్పుడే ఒక కీలకమైన ట్విస్ట్ వచ్చింది. దానితో ముగ్గురు స్నేహితులు ఒకింత ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. వారి మధ్య ప్రస్తుతం ఆకట్టుకునే సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా ఇంటర్వెల్ దిశగా కొనసాగుతోంది.
Date & Time : 09:00 PM September 09, 2022
-
సినిమాలో ప్రస్తుతం శర్వానంద్, అమల అక్కినేని మధ్య ఆకట్టుకునే హృద్యమైన సన్నివేశాలు వస్తున్నాయి. అలానే త్వరలో సినిమాలో కీలక సన్నివేశం రివిల్ కాబోతుంది
Date & Time : 08:55 PM September 09, 2022
-
సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రియదర్శి వెన్నెల కిషోర్ మధ్య ఆకట్టుకునే కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 08:45 PM September 09, 2022
-
శర్వానంద్ తల్లిగా ఇప్పుడే అమల అక్కినేని ఎంట్రీ ఇచ్చారు. అలానే అతడి స్నేహితులు ఇద్దరూ కూడా గతకాలానికి తమ వ్యక్తిగత విషయాల నిమిత్తం రావడం జరిగింది. ప్రస్తుతం వారందరి మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 08:35 PM September 09, 2022
-
మొత్తానికి స్నేహితులు ముగ్గురు 1998 కాలానికి చేరారు. ప్రస్తుతం వారి మధ్య కొన్ని సిట్యువేషనల్ కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 08:30 PM September 09, 2022
-
ముగ్గురు స్నేహితులని టైం మెషిన్ ఉపయోగించి పూర్వపు కాలానికి పంపేందుకు నాజర్ వారిని కన్విన్స్ చేశారు. ప్రస్తుతం వారి మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 08:20 PM September 09, 2022
-
సైంటిస్ట్ అయిన నాజర్ ఒక టైం మెషిన్ ని కనిపెడతారు. అనంతరం హీరో శర్వానంద్ ని గతంలో తన తల్లి చనిపోయిన కాలానికి వెళ్ళమని కోరుతారు. ప్రస్తుతం ఆ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 08:10 PM September 09, 2022
-
హీరో శర్వానంద్ స్టేజి ఫియర్ కలిగిన ఒక సింగర్. అయితే తన స్నేహితులు ప్రియదర్శి, వెన్నెల కిషోర్ల జీవితంపై శర్వానంద్ పాడిన ఒక మెలోడీ సాంగ్ ప్రస్తుతం వస్తుంది
Date & Time : 08:00 PM September 09, 2022
-
మూవీ గతం నుంచి ప్రస్తుత కాలానికి మారింది. హీరో శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ల మధ్య పలు సీన్స్ ప్రస్తుతం వస్తున్నాయి
Date & Time : 07:50 PM September 09, 2022
-
1998 కాలం నాటి కథగా సినిమా ప్రారంభమైంది. నటుడు నాజర్ ఇప్పుడే సైంటిస్ట్ గా పరిచయమయ్యారు
Date & Time : 07:45 PM September 09, 2022
-
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని స్మరించుకుంటూ ఇప్పుడే సినిమా యొక్క టైటిల్స్ ప్రారంభమయ్యాయి
Date & Time : 07:40 PM September 08, 2022