-
-
ఓ చిన్న సర్ప్రైజ్ ద్వారా సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 06:20 AM July 05, 2019
-
మరికొన్ని కుటుంబ నేపధ్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:10 AM July 05, 2019
-
కొన్ని భావోద్వేగపూరిత సన్నివేశాల తర్వాత మహా అద్భుతం పాట మొదలైంది.
Date & Time : 05:55 AM July 05, 2019
-
ఇప్పుడు సమంత మరియు రాజేంద్ర ప్రసాద్ ల మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:40 AM July 05, 2019
-
సమంత మరియు నాగశౌర్యల మధ్య కొన్ని హాస్య సన్నివేశాల అనంతరం నాల్గవ పాట అయినటువంటి "నాలో మైమరపు" మొదలైంది.
Date & Time : 05:28 AM July 05, 2019
-
ఇప్పుడు ఆకాశం లోనా పాట మొదలైంది.ఇపుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు షిఫ్ట్ అయ్యింది.బేబీ భర్తగా అడవి శేష్ క్యామియో పాత్ర పరిచయం అయ్యింది.
Date & Time : 05:20 AM July 05, 2019
-
ఇప్పుడు సమంత మరియు నాగశౌర్యల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:12 AM July 05, 2019
-
ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మరియు రావు రమేష్ ల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:07 AM July 05, 2019
-
ఇంటర్వెల్ అనంతరం రాజేంద్ర ప్రసాద్ మరియు సమంతల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.ఇప్పటి వరకు జరిగిన అసలు కథను రాజేంద్ర ప్రసాద్ కు సమంత చెప్పేసింది.
Date & Time : 05:06 AM July 05, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి ఒక సరికొత్త కథనంతో బాగుందనే చెప్పాలి.సమంత తన పెర్ఫామెన్స్ ఇప్పటి వరకు హైలైట్ గా నిలిచారు.మరి సెకండాఫ్ ఇంకెలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:02 AM July 05, 2019
-
సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 05:00 AM July 05, 2019
-
నాగశౌర్య సమంతాను ఇష్టపడి ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నాడు. ఈ కథనం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.
Date & Time : 04:50 AM July 05, 2019
-
యుక్త వయసుకు మారిన లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ ఇంటికే అద్దెకు ఉండడానికి వస్తుంది.ఆ సంబంధిత కామెడీ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:33 AM July 05, 2019
-
ఇప్పుడు "ఓహ్ బేబీ" పాటకు వేళయింది.ఈ పాటలో సమంత తన హావభావాలతో అదరగొట్టేస్తున్నారు.
Date & Time : 04:24 AM July 05, 2019
-
ఒక కీలక సంఘటన ద్వారా వయసులో పెద్దగా ఉన్న బేబీ(లక్ష్మి)ను యుంగ్ బేబీ(సమంత)గా మార్చడానికి ఉపయోగపడే పాత్రగా జగపతిబాబు ఎంటర్ అయ్యారు.ఇప్పుడు అసలు ఫన్ మొదలయ్యింది.
Date & Time : 04:18 AM July 05, 2019
-
ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మరియు లక్ష్మిల మధ్య కొన్ని భావిద్వేగపూరిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:10 AM July 05, 2019
-
ఇప్పుడు నటి ప్రగతి, బేబీ(లక్ష్మి) కోడలిగా పరిచయం కాబడ్డారు.ఇప్పుడు కొన్ని కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:03 AM July 05, 2019
-
రాజేంద్ర ప్రసాద్ మరియు లక్ష్మిలు ఒక మంచి పాత మిత్రులుగా కనిపిస్తున్నారు.ఇప్పుడు నాగ శౌర్య ఒక మ్యూజికల్ షో కో ఆర్డినేటర్ గా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 03:58 AM July 05, 2019
-
సినిమా ముసలి వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నదానిపై ఒక మెడికల్ కాలేజీలో రావు రమేష్ చెప్తున్న ఒక క్లాస్ తో ఇప్పుడే మొదలయ్యింది.ఇప్పుడు సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ మరియు లక్ష్మి ఆ మెడికల్ కాలేజ్ కాంటీన్ యాజమాన్యంగా ఎంట్రీ ఇచ్చారు.సంబంధిత కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:49 AM July 05, 2019
-
హాయ్..160 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది
Date & Time : 03:42 AM July 05, 2019