-
ఒక భారీ ఫైట్ సీన్ తర్వాత, సినిమా ముగింపు దశకు చేరుకుంది....నారాయణ్ పసారి అన్నిఆధారాలతో అరెస్ట్ కబడ్డాడు..... సినిమా పూర్తి అయింది..... పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ వుండండి.
Date & Time : 06:55 AM June 01, 2018
-
ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది...మొత్తానికి నాగ్ మరియు నారాయణ్ పసారి ఒకరికొకరు ఎదురుపడ్డారు.....ప్రస్తుతం ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:45 AM June 01, 2018
-
ప్రస్తుతం నారాయణ్ పసారి వంతు వచ్చింది.... నాగ్ కోసం అతని కూతురిని ఉపయోగించుకుంటాడు నారాయణ్.... వారిమధ్య ప్రస్తుతం కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:40 AM June 01, 2018
-
మొత్తానికి ఏదోలా తప్పించుకున్న నాగ్, నారాయణ్ పసారి గ్యాంగ్ లోని వారిని టార్గెట్ చేసాడు....ఆలా ఒకరితర్వాత మరొకరుగా ఆ గ్యాంగ్ సభ్యులను తెలివిగా చంపుతూ వెళ్తున్నాడు...
Date & Time : 06:34 AM June 01, 2018
-
నాగ్ ని చంపాలని చేసిన ఎటాక్ లో అజయ్ ప్రాణాలు కోల్పోతాడు....ప్రస్తుతం నాగ్ కోసం వెతుకుతూ, ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కావలసిన అధారాలు సిద్ధం చేస్తున్నాడు నారాయణ్ పసారి...
Date & Time : 06:29 AM June 01, 2018
-
ప్రస్తుతం మొత్తం సీన్ నాగ్, నారాయణ్ పసారి మధ్య ఒంటరి పోరుకు దారి తీసింది....ఒకరిపై మరొకరు గెలుపొందాలని కసిగా వున్నారు...ప్రస్తుతం కొన్ని నాటకీయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:23 AM June 01, 2018
-
పార్క్ లో నాగార్జున మీద ఒక పెద్ద ఎటాక్ ప్లాన్ చేసారు.....ఆ సీన్ పూర్తిగా షూట్ ఔట్స్, బుల్లెట్స్ తో నిండిపోయింది.
Date & Time : 06:15 AM June 01, 2018
-
తండ్రి, కూతరు మధ్య కొన్ని అందమైన సన్నివేశాల తరువాత ప్రస్తుతం నవ్వే నువ్వు పాట వస్తోంది.
Date & Time : 06:11 AM June 01, 2018
-
ఇంటర్వెల్ తర్వాత నాగార్జున, మరియు అతని అధికారి నారాయణ్ పసారి మధ్య కొన్ని మైండ్ గేమ్ తో కూడిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:08 AM June 01, 2018
-
నాగార్జున, ఆయన పై అధికారి మధ్య కొన్ని ఘర్షణ సన్నివేశాలు వస్తున్నాయి...... సినిమా సగం పూర్తి అయింది.... ప్రస్తుతం ఇంటర్వెల్
Date & Time : 06:00 AM June 01, 2018
-
ఇప్పటివరకు అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకున్న సమయంలో, సరైన ప్రూఫ్ లు లేని కారణంగా వాటన్నిటికీ కారణమైన ముఖ్యమైన వ్యక్తి జైలు నుండి రిలీజ్ కాబడతాడు.
Date & Time : 05:54 AM June 01, 2018
-
ఒక భారీ ఇన్వెస్టిగేషన్ తర్వాత, ఎన్కౌంటర్ లకు కారకుడైన ముఖ్యుడిని నాగ్ అరెస్ట్ చేసారు....సినిమా మంచి సెలబ్రేషన్ మూడ్ లోకి వచ్చింది.... ప్రస్తుతం షెహనాయ్ బాజే పాట వస్తోంది.
Date & Time : 05:44 AM June 01, 2018
-
రకరకాల వ్యక్తులను కలవడం ద్వారా నాగార్జున సమాచారం సేకరిస్తున్నారు....ఈ సమయంలో అలరించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడిన కొన్ని ముఖ్య సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 05:39 AM June 01, 2018
-
ఫేక్ ఎన్కౌంటర్స్ మీద నాగ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసారు....ఆ ఇన్వెస్టిగేషన్ కు సంబందించిన కొన్ని సన్నివేశాలు ప్రస్తుతం వస్తున్నాయి
Date & Time : 05:32 AM June 01, 2018
-
ఇప్పుడు సినిమా ప్రస్తుత కాలానికి వచ్చింది.....క్రైమ్ బ్రాంచ్ డిసిపి గా మైరా సరీన్ ఇప్పుడే మూవీలో కి ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 05:27 AM June 01, 2018
-
యాక్టర్ షాయాజీ షిండే ఆఫీసర్ అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చారు.... సినిమా ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ మూడ్ లోకి వచ్చింది.....నాగ్ ను తనను చంపడానికి ఒక అటవీ ప్రాంతంలో చేసిన కుట్రలో ఆయన భార్యని కోల్పోతాడు....ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 05:24 AM June 01, 2018
-
ఒక చిన్న పాపకు తండ్రిగా సినిమాలో నాగ్ కనిపిస్తారు......ప్రస్తుతం వారిద్దరి మధ్య అనుబంధాన్ని తెలిపే సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 05:18 AM June 01, 2018
-
కొన్ని పోలీస్ ట్రైనింగ్ సీన్ల తర్వాత ఒక కేసు నిమిత్తం నాగ్ ముంబైలోకి ఎంటర్ అయ్యారు....ప్రస్తుతం నాగ్ టీమ్ లో సభ్యుడిగా యాక్టర్ అజయ్ ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 05:14 AM June 01, 2018
-
హీరో నాగార్జున ఇప్పుడే పోలీస్ ఆఫిసర్ గా ఎంట్రీ ఇచ్చారు...ప్రస్తుతం కొన్ని పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 05:10 AM June 01, 2018
-
ముంబై సిటీలో సినిమా ప్రారంభం అయింది... ఇంట్రెస్టింగ్ థీమ్ మ్యూజిక్ తో టైటిల్స్ వస్తున్నాయి
Date & Time : 05:05 AM June 01, 2018
-
హాయ్.. 124 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 05:00 AM June 01, 2018