
మొదటి షో వివరాలు : ఓదెల 2
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
తిరుపతిని కట్టడి చేసేందుకు తమన్నా ఒక ప్లాన్ చేస్తుంది. కానీ దానిని అతడు చెడగొట్టి ఊరు అంతటి ముందు ఆమెకి అవమానం కలిగేలా చేసాడు. ఈ ఉద్రిక్త సన్నివేశాలతో సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతుంది.
ఇప్పుడు తిరుపతి మరింత క్రూరంగా మారుతున్నాడు. ఓదెల గ్రామం మరింత బాధించబడుతుండగా తమన్నా తన సాయ శక్తులా పోరాడుతుంది.
ఇప్పుడు మొదటి సారి శివ శక్తి, తిరుపతి ఇద్దరూ ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ గ్రామంలో మరికొన్ని టెన్స్ సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు తమన్నా ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకుంది. తర్వాత గ్రామస్తులకు ఏం చెయ్యాలో వివరించింది. మరికొన్ని సన్నివేశాలు దీనిపై వస్తున్నాయి.
ఇంటర్వెల్ అనంతరం.. ఓదెలకి తమన్నా చేరుకుంది. తనపై సన్నివేశాలు ఇపుడు కొనసాగుతున్నాయి.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు సినిమా ఓకే రేంజ్ లో కొనసాగింది. మ్యూజిక్ సినిమాలో పలు కీలక సన్నివేశాలకి కీలక పాత్ర పోషించింది. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఒక పవర్ఫుల్ ఎలివేషన్ సీన్ తర్వాత ఓ ఫైట్ తో తమన్నా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు విరామం.
ఇప్పుడు మరో మర్డర్ చోటు చేసుకుంది. వీటి వెనుక ఎవరున్నారు అనే దానిని గ్రామస్తులే ఓ నిర్ణయానికి వచ్చారు. ఇపుడు ఓ పోలీస్ కూడా ఈ మ్యాటర్ లో దిగడం జరిగింది. ప్రస్తుతం మరికొన్ని ఇంటెన్స్ సీన్స్ కొనసాగుతున్నాయి.
ఇప్పుడు ఆ గ్రామస్తులు అక్కడ ఏదో తప్పుగా జరుగుతుంది అని గమనిస్తున్నారు. ఇంకోపక్క అక్కడ ఎంపీటీసీ చైర్మన్ కూతురు పెళ్ళి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో భయానక ఘటన చోటు చేసుకుంది.
సమాధి నుంచి తిరుపతి (వశిష్ఠ) బయటకి వచ్చాడు. రావడంతోనే కొన్ని భయానక పరిస్థితులు సృష్టించాడు. ఇపుడు ఆ గ్రామంలో ఆందోళన మొదలైంది.
ఓదెలలో ఓ సాంగ్ తర్వాత ఇపుడు కథనంలో ఓ ఆసక్తికర మలుపు చోటు చేసుకుంటుంది.
ఓదెల గ్రామంలో ఒక షాకింగ్ సీన్ తో సినిమా మొదలైంది. దీనికి సంబంధించిన సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
హాయ్.. 149 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.