-
ఇప్పుడు క్లైమాక్స్.. మెయిన్ లీడ్ మధ్య ఒక సింపుల్ సన్నివేశంతో సినిమా చాలా సింపుల్ గానే పూర్తయ్యిపోయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 11:40 AM September 16, 2022
-
ఫైనల్ గా ఆ ట్విస్ట్ ప్రస్తుత స్టోరీ తో కలిసినట్టు చూపించడం బాగుంది. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:30 AM September 16, 2022
-
ఇప్పుడు లవ్ స్టోరీ లో మరో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమాలో అయితే సరైన పాయింట్ ఉన్నట్టు అనిపించట్లేదు కానీ హీరో కిరణ్ డీసెంట్ నటనతో మెప్పిస్తున్నాడు.
Date & Time : 11:20 AM September 16, 2022
-
ఫైనల్ గా ఇద్దరి లవ్ స్టోరీ లు ముగిసాయి. ఇక ఇక్కడ నుంచి కొత్త లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 11:10 AM September 16, 2022
-
ఇప్పుడు ఈ లవ్ ట్రాక్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ ఫైట్ సీన్ ఇప్పుడు వస్తుంది. కిరణ్ అబ్బవరం మంచి మాస్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 11:00 AM September 16, 2022
-
హీరోయిన్ ని ఇంప్రెస్ చెయ్యాలని హీరో చాలా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మరి కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి. బాబా భాస్కర్ తన రోల్ లో మంచి నటన కనబరుస్తున్నాడు.
Date & Time : 10:50 AM September 16, 2022
-
ఇప్పుడు మరో హీరోయిన్ సోనా ఠాకూర్ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ హాఫ్ మంచి ఫన్ తో స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:45 AM September 16, 2022
-
ఇంటర్వెల్ అనంతరం ఇపుడు హీరో తన గతాన్ని చెప్తున్నాడు. బాబా భాస్కర్ సినిమాలో ఎంటర్ అయ్యాడు.
Date & Time : 10:40 AM September 16, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు సినిమా పర్వాలేదని చెప్పొచ్చు. హీరోయిన్ తన లవ్ స్టోరీ నరేషన్ తో ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు డీసెంట్ గా ఉన్నాయి. అలాగే హీరో కిరణ్ అబ్బవరం రోల్ కూడా ఫస్టాప్ లో పెద్దగా కనిపించలేదు కానీ ఇక్కడ నుంచి అసలు కథ తనపై స్టార్ట్ అయ్యేలా కనిపిస్తుంది.
Date & Time : 10:35 AM September 16, 2022
-
ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్.. లవ్ స్టోరీ ఊహించని ట్విస్ట్ తో ఇప్పుడు సినిమా సగానికి చేరింది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:30 AM September 16, 2022
-
ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కథనంలో చోటు చేసుకుంది. సినిమా ఇంటర్వల్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:25 AM September 16, 2022
-
ఫైనల్ గా కథనంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. మెయిన్ హీరో కిరణ్ అబ్బవరం ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కనిపించలేదు. కేవలం హీరోయిన్ కథ మాత్రమే ఇంకా నడుస్తుంది.
Date & Time : 10:20 AM September 16, 2022
-
ఫ్లాష్ బ్యాక్ లో ఓ కొత్త హీరో కనిపిస్తున్నాడు. తనకి హీరోయిన్ కి మధ్య ఓ లవ్ సాంగ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. సినిమా మెయిన్ కథ లోకి ఇప్పుడు ఎంటర్ అవుతుంది.
Date & Time : 10:10 AM September 16, 2022
-
ఇప్పుడు హీరోయిన్ హీరోకి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతున్న సన్నివేశాలు వస్తున్నాయి. ఓ ఫ్యామిలీ సాంగ్ తో వెటరన్ దర్శకుడు కృష్ణా రెడ్డి అసలైన ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:00 AM September 16, 2022
-
ఇప్పుడు హీరోయిన్ సంజనా ఆనంద్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెపై ఓ కిడ్నాప్ సీన్ రాగా హీరో ఆమెని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.
Date & Time : 09:50 AM September 16, 2022
-
ఇప్పుడు సినిమాలో ఫస్ట్ మాస్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో కిరణ్ అబ్బవరం డీసెంట్ స్టెప్స్ తో కనిపిస్తున్నాడు.
Date & Time : 09:40 AM September 16, 2022
-
ఒక ఫన్ సీన్ తో హీరో కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చాడు. అలాగే కమెడియన్ గెటప్ శ్రీను కూడా ఎంటర్ అయ్యాడు.
Date & Time : 09:35 AM September 16, 2022
-
ఒక సీరియస్ నోట్ తో సినిమా స్టార్ట్ అయ్యింది, సీనియర్ దర్శకుడు ఎస్ వి కృష్ణా రెడ్డికి హార్ట్ అటాక్ వచ్చిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:30 AM September 16, 2022
-
హాయ్.. నిర్మాత కోడి దీప్తి తన తండ్రి కోడి రామకృష్ణ పై వాయిస్ నోట్ తో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 09:20 AM September 16, 2022