-
-
సినిమా పూర్తి అయింది... పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ వుండండి
Date & Time : 10:07 PM August 23, 2018
-
ఫైనల్ ఫేస్-ఆఫ్ ఎపిసోడ్ కోసం స్టేజ్ సెట్ చేయబడింది. ప్రస్తుతం మంచి యాక్షన్ సన్నివేశం జరుగుతోంది
Date & Time : 10:02 PM August 23, 2018
-
ఆ మోసగాడు చాలా తెలివైనవాడు, ఆదిని ఎంతో తెలివిగా ముప్పతిప్పలు పెట్టాడు.. అతడితో హీరో ఆది ప్రస్తుతం తుది సమరానికి సిద్దమయ్యాడు...
Date & Time : 09:55 PM August 23, 2018
-
తన గతంలో జరిగిన కథలో మోసగాడిని ఆది వెంటాడుతున్నారు...దానికి సంబందించిన సన్నివేశాలు మంచి ఉత్కఠతతో సాగుతున్నాయి
Date & Time : 09:45 PM August 23, 2018
-
అది తనకు గతంలో ఏమి జరిగిందో తెలుసుకున్నాడు...తెలుసుకున్న దానివల్ల ఆ పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి
Date & Time : 09:32 PM August 23, 2018
-
అతనిలానే మరొక అంధుడు కూడా తనకు ఎదురైన పరిస్థితి వంటిదే ఎదుర్కొంటున్నట్లు ఆది తెలుసుకున్నాడు... ఆ సన్నివేశాలు పెద్ద సస్పెన్స్ కి దారితీస్తున్నాయి
Date & Time : 09:24 PM August 23, 2018
-
కొన్ని ఆసక్తికర సన్నివేశాలు సినిమా థ్రిల్లింగ్ గా సాగేలా చేసాయి... వాటితో సినిమా మంచి జోరుగా ఇంటరెస్టింగ్ గా సాగుతోంది
Date & Time : 09:15 PM August 23, 2018
-
ఆది మరియు వెన్నెల కిషోర్ తాప్సీ జాడ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. వెతుకులాట ప్రాసెస్ లో వారి మధ్య కొంత ఎంటర్టైన్మెంట్ నడుస్తోంది
Date & Time : 09:05 PM August 23, 2018
-
సెకండ్ హాఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆది పోలీసుల సాయంతో తాప్సీ ని వెతికే పనిలో పడ్డాడు, కానీ పోలీసులు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు.... అతను ప్రస్తుతం వెన్నెల కిశోర్ ని కలిసాడు, సీన్ మంచి ఫన్నీగా సాగుతోంది....
Date & Time : 08:56 PM August 23, 2018
-
ప్రస్తుతం ఇంటర్వెల్.. సస్పెన్స్ మాత్రం బాగా నడిచింది.. ఇకరాబోయే సెకండ్ హాఫ్ లో దానిని ఎలా కొనసాగిస్తారు అనే దానిపై సినిమా రిజల్ట్ ఆధారపడి వుంది
Date & Time : 08:42 PM August 23, 2018
-
గతంలో తీసుకున్న బలమైన నిర్ణయాలు వాటి పరిణామాలతో ఆది ఒక గందరగోళమైన పరిస్థితిలో వున్నాడు. ప్రస్తుతం కొన్ని భావోద్వేగ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 08:38 PM August 23, 2018
-
హీరోకి తన కంటి చూపు తిరిగి రావడంతో కనిపించకుండాపోయిన తాప్సీ కోసం అన్వేషణలో పడ్డాడు. తరువాత తన వ్యక్తిగత జీవితం గురించి అతను పెద్ద నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ప్రస్తుతం మరో ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 08:30 PM August 23, 2018
-
యాక్సిడెంట్ కి ముందు అసలు ఏమి జరిగిందో అని, జరిగిన ఘటనలు గుర్తు చేసుకుంటున్నాడు హీరో ఆది
Date & Time : 08:20 PM August 23, 2018
-
హీరోకి యాక్సిడెంట్ జరగడంతో కథలో పెద్ద ట్విస్ట్ వచ్చింది. పరిస్థితులు ఇంటరెస్టింగ్ మలుపులు దారి తీస్తున్నాయి.....
Date & Time : 08:15 PM August 23, 2018
-
ఆది స్వభావాన్ని ఇష్టపడే అమ్మాయిగా తాప్సి ఇపుడే ఎంటర్ అయింది.. వారిద్దరూ మెల్లగా ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇపుడు సినిమాలోని మొదటి సాంగ్ గా వెన్నెల అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ సాంగ్ వస్తోంది
Date & Time : 08:08 PM August 23, 2018
-
తన అంధత్వాన్ని ఏమాత్రం ఒక బలహీనతగా కాకుండా జీవితాన్ని దృఢంగా ఎదుర్కునే యువకుడిగా హీరో అది కనపడుతున్నాడు. అతని క్యారెక్టర్ కి సంబంధించిన సన్నివేశాలు ప్రస్తుతం వస్తున్నాయి
Date & Time : 08:00 PM August 23, 2018
-
అది బెస్ట్ ఫ్రెండ్ గా రితిక సింగ్ ఎంటర్ అయింది. అది మరియు అతని ఫామిలీ మధ్య ప్రస్తుతం కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 07:50 PM August 23, 2018
-
సినిమా ఇప్పుడే మొదలయింది. ఆదిపినిశెట్టి ఒక అంధ చెఫ్ గా ఇప్పుడే సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 07:45 PM August 23, 2018
-
ఆది పినిషెట్టి, రితికా సింగ్ మరియు తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలలో నటించిన నీవేవెరో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదలకు సిద్దమయింది. అయితే ఒకరోజు ముందే ఈ చిత్రం యొక్క స్పెషల్ స్క్రీనింగ్ ఇవాళ జరుగుతోంది. మేము థియేటర్ నుండి లైవ్ అప్ డేట్స్ అందిస్తున్నాము.
Date & Time : 07:40 PM August 23, 2018