-
సంతోషంగా అన్ని అంశాలు ప్రశాంతంగా ముగిశాయి.. చిత్రం పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి
Date & Time : 12:03 AM March 23, 2018
-
హీరో మరియు అతని తండ్రి మధ్య కదిలించే దృశ్యాలు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి.. కథ క్లైమాక్స్ కి చేరుకుంది
Date & Time : 11:59 PM March 22, 2018
-
సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.. ఎమోషనల్ ట్విస్ట్ అద్భుతంగా ఉంది.. శ్రీ విష్ణు పరిస్థితి చాలా మారింది.
Date & Time : 11:52 PM March 22, 2018
-
పరిస్థితులు తీవ్రమైన బావోద్వేగంగా మారాయి. ప్రస్తుతం హీరో మరియు అతడి తండ్రికి మధ్య ఆసక్తికరమైన సంభాషణలు వస్తున్నాయి.. శ్రీ విష్ణు అద్భుతంగా నటిస్తున్నాడు
Date & Time : 11:42 PM March 22, 2018
-
సర్ప్రైజ్.. హీరో నారా రోహిత్ సడన్ ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 11:34 PM March 22, 2018
-
ప్రస్తుతం ఒక రొమాంటిక్ సాంగ్ వస్తోంది.. ఊటీ లో అద్భుతంగా తెరకెక్కించారు
Date & Time : 11:24 PM March 22, 2018
-
సమస్యలతో సతమతమవుతోన్న హీరోకి హీరోయిన్ అండగా ఉంటుంది. అతనికి ఎంతో సహాయాన్ని చేస్తుంటుంది.. లవ్ స్టొరీ చాలా బాగా ఆకట్టుకుంటోంది.
Date & Time : 11:21 PM March 22, 2018
-
శ్రీ విష్ణు మరియు అతని తండ్రి మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:17 PM March 22, 2018
-
ఇంటర్వెల్ తరువాత సినిమా సీరియస్ నోట్ తో స్టార్ట్ అయ్యింది. శ్రీ విష్ణు చాలా బాధతో కనిపిస్తున్నాడు
Date & Time : 11:13 PM March 22, 2018
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ - శ్రీ విష్ణు మంచి నటనతో ఫస్ట్ హాఫ్ మొత్తంగా స్టార్ గా నిలిచాడు. ఈ చిత్రం సింపుల్ గా ట్విస్ట్ మరియు మంచి భావోద్వేగాలతో నడుస్తోంది.. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం.
Date & Time : 10:58 PM March 22, 2018
-
ప్రధాన జంట మధ్య కొన్ని పరిస్థితులు చాలా సీరియస్ గా మారాయి.. చిత్రం సగం పూర్తయ్యింది.. ఇప్పుడు బ్రేక్
Date & Time : 10:54 PM March 22, 2018
-
ప్రధాన జంట మధ్య భావోద్వేగ సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 10:51 PM March 22, 2018
-
ఇంటర్వెల్ ముందు సినిమా కథలో మరో చిన్న ట్విస్ట్ తో చాలా ఆసక్తికరంగా సాగుతోంది.
Date & Time : 10:48 PM March 22, 2018
-
హీరోయిన్ ప్రేమలో పడింది. ఇప్పుడు బ్యూటిఫుల్ లవ్ సాంగ్ తెరపై ఆకట్టుకుంటోంది.
Date & Time : 10:45 PM March 22, 2018
-
పోసాని కృష్ణ మురళి పర్సనాలిటీ డెవెలప్ మేంట్ టీచర్ గా ఎంట్రీ ఇచ్చారు.. కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:40 PM March 22, 2018
-
హీరో లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు కానీ అతను అన్ని సమయాల్లో విఫలమయ్యాడు. అందుకు సంబంధించిన సీన్స్ ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 10:34 PM March 22, 2018
-
హీరో హీరోయిన్ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.. శ్రీ విష్ణు తన క్యారెక్టర్ తో అలరిస్తున్నాడు
Date & Time : 10:27 PM March 22, 2018
-
ఇప్పుడు హీరోయిన్ సత్నా టైటస్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 10:18 PM March 22, 2018
-
కథలో ఒక ఊహించని ట్విస్ట్.. పరిస్థితులు ఒక్కసారిగా కుటుంబాన్ని ఎమోషనల్ అయ్యేలా చేశాయి..
Date & Time : 10:15 PM March 22, 2018
-
శ్రీ విష్ణు తన ఎగ్జామ్స్ ని క్లియర్ గా ఫినిష్ చేశాడు.. ఇప్పుడు ఒక హ్యాపీ సాంగ్.. పాట చాలా ఆసక్తికరంగా ఉంది.
Date & Time : 10:07 PM March 22, 2018
-
సాగర్ కుటుంబానికి సంబంధించిన కొన్ని మధ్య తరగతి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:02 PM March 22, 2018
-
సాగర్ గా శ్రీ విష్ణు పరిచయం చేయబడ్డాడు. అతను పరీక్షలను రాస్తున్నాడు. సినిమా ఒక ఆహ్లాదకరమైన నోట్ తో మొదలయ్యింది.
Date & Time : 09:54 PM March 22, 2018
-
చాలా సున్నితమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆసక్తికరంగా టైటిల్స్ పడుతున్నాయి
Date & Time : 09:45 PM March 22, 2018
-
హాయ్.. 121 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 09:43 PM March 22, 2018