మొదటి షో వివరాలు : ‘నారీ నారీ నడుమ మురారి’
ఒక హ్యాపీ నోట్‌తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
సాక్షి, ఆమె కుటుంబ సభ్యులు శర్వాకు సంబంధించిన గతాన్ని, అతడు చేసిన మోసాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు కథ కోర్ట్‌రూమ్‌కు షిఫ్ట్ అయింది. ఓ యంగ్ హీరో క్యామియో పాత్రలో సర్‌ప్రైజ్ చేశాడు.
శర్వా తన సమస్యలకు ఓ చక్కటి పరిష్కారం కనుగొంటాడు. అయితే, తన మాజీ ప్రేయసికి సంబంధించి కొన్ని విషయాలు తెలియడంతో కథ ఎమోషనల్‌గా మారుతుంది.
అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మరికొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి. శర్వా మాత్రం సమస్యలను పరిష్కరించేందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.
కథలో మరో ట్విస్ట్ వస్తుంది. పరిస్థితులను చక్కబెట్టేందుకు శర్వా ప్రయత్నించే క్రమంలో మరికొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
సెకండాఫ్‌లో కూడా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. నరేష్, తదితరులపై మరికొన్ని కామెడీ మూమెంట్స్ వస్తున్నాయి.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా డీసెంట్‌గా సాగింది. నరేష్ కామెడీ, శర్వా పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. సాక్షి వైద్య, సంయుక్త తమ పాత్రల్లో బాగున్నారు. మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఫ్లాష్‌బ్యాక్ ముగిశాక శర్వా-సాక్షి పెళ్లికి ఓ అడ్డంకి ఏర్పడుతుంది. ఓ షాకింగ్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ వస్తుంది.
కొన్ని కామెడీ సీన్స్ తర్వాత శర్వాకు సంబంధించి మరో ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది. ఇప్పుడు సంయుక్త అతడి గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయమైంది. వారి లవ్ స్టోరీ సీన్స్ వస్తున్నాయి.
ఫ్లాష్‌బ్యాక్ తర్వాత కథలో కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి. శర్వా, సాక్షి కుటుంబాలకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
శర్వానంద్ ప్రేయసిగా సాక్షి వైద్య పరిచయం అయింది. ఆమె తండ్రి సంపత్ రాజ్‌ను కలిసిన శర్వా, తన ప్రేమ కథను చెబుతున్నాడు.
శర్వానంద్, సత్య పారిపోతూ పరిచయం అవుతారు. వారి కోసం ఓ ఛేజింగ్ సీన్ నడుస్తుండగా ఓ షాకింగ్, ఫన్నీ ట్విస్ట్‌తో అది ముగుస్తుంది.
హాయ్.. 2 గంటల 25 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.