మొదటి షో వివరాలు : నాగబంధం
ఈ చిత్రం సనాతన ధర్మం గురించిన సందేశంతోనూ, సీక్వెల్‌కు దారితీసే అంశంతోనూ ముగిసింది. పూర్తి స్థాయి సమీక్ష కోసం వేచి చూడండి.
ఒక వార్ సీక్వెన్స్ వస్తుంది ఇప్పుడు. నాగ సాధువుల ఎంట్రీ కోసం అందరు చూస్తున్నారు.
ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది. మహేష్ మాంజరేకర్ ఒక కీలక పాత్రలో కనిపించారు.
కొన్ని కీలక ట్విస్ట్ ల ద్వారా విరాట్ కర్ణ ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు..
హీరో కుటుంబానికి సంబంఛిన ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా సగానికి చేరుకుంది.
ఇప్పుడు కథ కాస్త రొమాంటిక్ జోన్ లోకి మారింది. 'నీకోసం' అనే పాట ఇప్పుడు వస్తుంది.
ఇప్పుడు 'నమోరే' అనే భక్తి పాట వస్తుంది. నభా నటేష్, దక్ష నాగర్కర్ కలయికలో ఈ పాట మంచి విజువల్స్, చక్కటి నిర్మాణ విలువతో గ్రాండ్ గా ఉంది.
రుద్ర పాత్రలో విరాట్ కర్ణ పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. శరణ్య, ఐశ్వర్య మెనన్, అనసూయ, సోనియా సింగ్ కూడా పరిచయం అయ్యారు.
జగపతి బాబు ఒక పురావాస్తు శాఖ జీనియస్ గా పరిచయం అయ్యాడు. నాగబంధం గురించిన విషయాలు కనుగొనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు.
3 గంటల 16 నిముషాలు నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
'నాగబంధం' రెడ్ కార్పెట్ ప్రీమియర్ అల్లు సినిమాస్ లో స్క్రీనింగ్ జరుగుతుంది. చిత్ర యూనిట్ తో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరయ్యారు. ఈ మూవీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్రత్యేకంగా మీ కోసం.