-
ఒక భావోద్వేగపూరిత నోట్ తో సినిమా ముగింపుకు వచ్చింది, అసలు నిందితులకు శిక్ష పడింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:30 AM February 19, 2021
-
ఇలాంటి పనుల వెనుక ఉన్న కొంతమందిని బయటకు తీసుకు రావడానికి నరేష్ తన జీవితాన్నే పణంగా పెట్టాడు. ఓ ఎమోషనల్ క్లైమాక్స్..
Date & Time : 11:25 AM February 19, 2021
-
ఇప్పుడు మరో మంచి ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:20 AM February 19, 2021
-
ఈ ఘటన వెనుక ఒక పెద్ద పొలిటికల్ లీడర్ ఉన్నాడు అతనితోనే నరేష్ పోరాటం చేస్తున్నాడు. ఎమోషన్స్ మాత్రం తారా స్థాయిలో కనిపిస్తున్నాయి. అలాగే వరలక్ష్మి చాలా బాగా చేస్తున్నారు.
Date & Time : 11:15 AM February 19, 2021
-
ఇప్పుడు మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. వరలక్ష్మి మరియు శ్రీకాంత్ అయ్యంగర్ ల మధ్య కోర్టులో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:05 AM February 19, 2021
-
బయటకు వచ్చాక నరేష్ అసలు నిందితలకు వ్యతిరేఖంగా కేసు పెట్టాడు. ఓ ఎవరికీ తెలియని లీగల్ సెక్షన్ 211 కోసం చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:50 AM February 19, 2021
-
ఒక ఉత్కంఠభరిత ఫైట్ తర్వాత వరలక్ష్మి ఎట్టకేలకు నరేష్ ను బయటకు తీసుకొచ్చింది. కానీ ఇక్కడ నుంచే సినిమా కొత్త యాంగిల్ లోకి మారింది. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:40 AM February 19, 2021
-
మరి ఈ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. నరేష్ అయితే ప్రాణం పెట్టేసాడు, తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇదే అని చెప్పొచ్చు.
Date & Time : 10:35 AM February 19, 2021
-
ఇప్పుడు మరో ఆసక్తికర కోర్ట్ సీన్స్ వస్తున్నాయి. వరలక్ష్మి నరేష్ ను కాపాడటానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 10:30 AM February 19, 2021
-
వరలక్ష్మి శరత్ కుమార్ మళ్ళీ తన రోల్ లో సూపర్బ్ గా కనిపిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ కోర్ట్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:25 AM February 19, 2021
-
ఇంటర్వెల్ అనంతరం, సినిమాలో అంశాలు మరింత క్లియర్ అవుతున్నాయి. నరేష్ పై సింపతీ పెరుగుతుంది.
Date & Time : 10:20 AM February 19, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఓ డార్క్ థీమ్ లో కనిపిస్తూ ఇప్పటి వరకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అలాగే అల్లరి నరేష్ తన రోల్ లో అద్భుతంగా కనిపిస్తున్నాడు. వరలక్ష్మి కూడా ఇప్పుడే ఎంటర్ కావడం మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మరి సెకండాఫ్ ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా డీల్ చేస్తారో చూడాలి.
Date & Time : 10:15 AM February 19, 2021
-
ఓ ఆసక్తికర ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇపుడు..దీనితో నరేష్ మరిన్ని సమస్యల్లో పడ్డాడు. ఇప్పుడు విరామం.
Date & Time : 10:10 AM February 19, 2021
-
ఇప్పుడు సినిమాలోని సన్నివేశాలు మరింత సీరియస్ గా మారాయి. ఇప్పుడు నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఇప్పుడు ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:05 AM February 19, 2021
-
ఇప్పుడు నరేష్ కు అంతా క్లియర్ అయ్యింది, దీనితో జైలు నుంచి బయటకు రావాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. వ్యక్తిగతంగా కూడా అతడికి చాలా నష్టం జరిగింది. ఏడాది గడిచిపోయి కొన్ని కోర్ట్ సీన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి.
Date & Time : 09:55 AM February 19, 2021
-
ఇప్పుడు మరిన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి. అతను చెయ్యని ఓ క్రైమ్ విషయంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. కొన్ని ఆసక్తికర పోలీస్ స్టేషన్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:40 AM February 19, 2021
-
ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ అయ్యింది. అల్లరి నరేష్ కు ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇప్పుడు నరేష్ జైలు లైఫ్ ను చిత్రీకరిస్తూ ఒక పాట వస్తుంది.
Date & Time : 09:30 AM February 19, 2021
-
అతనికి వచ్చిన తీర్పుతో నరేశ్ బాగా కుంగిపోయాడు. ఇప్పుడు తన కథని ప్రియదర్శికి చెబుతున్నాడు, సినిమా ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళింది. కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:20 AM February 19, 2021
-
ఇప్పుడు అల్లరి నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. అతడిపై కొన్ని జైల్ స్టే సన్నివేశాలు వస్తున్నాయి. ప్రియదర్శి కూడా ఇప్పుడు యాడ్ అయ్యాడు.
Date & Time : 09:10 AM February 19, 2021
-
ఒక సీరియస్ నోట్ లో సినిమా మొదలయ్యింది. ఈ దేశంలోని కొన్ని జైళ్ళు గురించి ఓ వాయిస్ ఓవర్ లో చెప్తున్న సన్నివేశం వస్తుంది.
Date & Time : 09:05 AM February 19, 2021
-
హాయ్..146 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 09:00 AM February 19, 2021