-
చాలా ఇబ్బందులు తరువాత చివరికి హీరో హీరోయిన్ వద్దకు చేరతాడు. ఫైనల్ గా సినిమా హ్యాపీ నోట్ తో ఎండ్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 06:02 AM June 14, 2018
-
ప్రముఖ నటుడు ప్రియదర్శి సన్నివేశానికి వచ్చి, కళ్యాణ్ రామ్ ను తమన్న వద్దకు చేర్చడానికి సహాయం చేస్తున్నాడు.
Date & Time : 06:00 AM June 14, 2018
-
కొన్ని ఎమోషనల్ సన్నివేశాల తరువాత ప్రేమిక సాంగ్ వస్తోంది.. ఇప్పుడు హీరో తన ప్రేయసి గురించి నిరాశలో ఉన్నాడు
Date & Time : 05:53 AM June 14, 2018
-
సినిమా ఓపెనింగ్ సీన్ లో తమన్నాకు సంబంధించిన ఎఫ్.ఎమ్ ఛానల్ సీన్ ఇంకా కొనసాగుతోంది. ఆమె గత జ్ఞాపకాలను షేర్ చేసుకుంటోంది.
Date & Time : 05:47 AM June 14, 2018
-
ఫ్లాష్ బ్యాక్ పూర్తయింది మరియు చిత్ర కథనం ప్రస్తుత రోజుల్లోకి వస్తుంది ... సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ టికెట్ కలెక్టర్ గా సన్నివేశంలోకి ఎంట్రి ఇచ్చారు.
Date & Time : 05:42 AM June 14, 2018
-
కథలో ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంది. సినిమా ఎమోషనల్ గా ముందుకు సాగుతోంది.
Date & Time : 05:40 AM June 14, 2018
-
జంట మధ్య కొన్ని అపార్థాల తరువాత మళ్లీ వారు ఒకటవుతున్నారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం చినికి చినికి సాంగ్ ద్వారా నరేట్ చేయబడుతోంది.
Date & Time : 05:35 AM June 14, 2018
-
ఇంటర్వెల్ తరువాత ప్రధాన జంట మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హే హే అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 05:23 AM June 14, 2018
-
హీరో తమన్నకు ఒక చిన్న పరీక్ష పెడతాడు. మరియు ఆమె ఎదుర్కొనేందుకు అంగీకరిస్తుంది. చిత్రం సగం పూర్తయ్యింది ... ఇప్పుడు ఇంటర్వెల్
Date & Time : 05:15 AM June 14, 2018
-
ఎట్టకేలకు ప్రధాన జంట ఒకరికొకరు నేరుగా కలుసుకున్నారు ... హీరో మరియు హీరోయిన్ మధ్య కొన్ని క్లాసి మరియు చక్కగా వ్రాసిన రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 05:01 AM June 14, 2018
-
కథానాయకుడు మరియు హీరోయిన్ యొక్క తొలి సమావేశానికి సమయం సెట్ అయ్యింది. ఇప్పుడు మంచి టైమింగ్ లో నిజమా మనాస అనే సాంగ్ వస్తోంది ... బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బావుంది.
Date & Time : 04:54 AM June 14, 2018
-
కళ్యాణ్ రామ్ కోసం తమన్న వేతకటం ప్రారంభించింది. ఈ సమయంలో ఆమెకు రేడియో జాకీగా కూడా ఉద్యోగం దొరుకుతుంది.
Date & Time : 04:45 AM June 14, 2018
-
కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కి ఇంప్రెస్ అయిన తమన్నా చూడకుండానే అతని ప్రేమలో పడుతుంది. ప్రధాన జంట మధ్య కొన్ని ఆసక్తికరమైన ఇమాజినేషన్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 04:37 AM June 14, 2018
-
హైదరాబాద్ వీధుల్లో ఒక పెప్పీ సాంగ్.. మొదటి పాట రైట్ రైట్ రైట్ వస్తోంది...
Date & Time : 04:30 AM June 14, 2018
-
తనికెళ్ల భరణి హీరోయిన్ ఫాదర్ గా పరిచయం చేయబడ్డారు. కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:27 AM June 14, 2018
-
ప్రముఖ నటుడు బిత్తిరి సత్తి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. బిత్తిరి సత్తి తమన్నలకు మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:23 AM June 14, 2018
-
కొన్ని ఇంట్రడక్షన్ సన్నివేశాలు తర్వాత ఈ చిత్రం తిరిగి ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది ... చిత్రం యొక్క అసలైన కథాంశం వెల్లడైంది ... ప్రధాన జంట మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 04:20 AM June 14, 2018
-
హీరో కల్యాణ్ రామ్ కూడా విమానాశ్రయం లో సింపుల్ ఎంట్రీ ఇచ్చారు. హాస్యనటుడు వెన్నెల కిషోర్ కూడా సన్నివేశంలోకి వస్తాడు.
Date & Time : 04:15 AM June 14, 2018
-
ఈ చిత్రం కథ కాచిగూడ రైల్వే స్టేషన్ లో మొదలైంది ... ఒక రేడియో జాకీగా తమన్నా సింపుల్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 04:10 AM June 14, 2018
-
హాయ్..125 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 04:05 AM June 14, 2018