-
కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల తరువాత ఈ సినిమా దేశభక్తి సందేశంతో ముగిసింది. సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 06:04 AM May 04, 2018
-
శరత్ కుమార్ - బన్నీ మధ్య ఒక హార్డ్ హిట్టింగ్ లాంగ్ డైలాగ్ కన్వర్సెషన్ నడుస్తోంది.
Date & Time : 06:04 AM May 04, 2018
-
ప్రస్తుతం బన్నీ మరియు శరత్ కుమార్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:59 AM May 04, 2018
-
సినిమాలోని చివరి పాట ఇరగ ఇరగ.. వస్తోంది.
Date & Time : 05:52 AM May 04, 2018
-
ఇప్పుడు మరొక పెద్ద యాక్షన్ బ్లాక్ ... బన్నీ మరియు అనూప్ మధ్య తీవ్రమైన పోరాట సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:48 AM May 04, 2018
-
బన్నీ మళ్లీ తన హైపర్ క్యారెక్టర్ లోకి తిరిగి వచ్చాడు. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో చిత్రం ముందుకు సాగుతోంది.
Date & Time : 05:44 AM May 04, 2018
-
కథలో ఒక చిన్న ట్విస్ట్ బయటపడింది..
Date & Time : 05:40 AM May 04, 2018
-
తన కుటుంబానికి దూరంగా ఉన్న బన్నీ చివరకు వారిని కలుసుకుంటాడు. ఇప్పుడు ఏన్నియల్లో ఎన్నియల్లో అనే పాట వస్తోంది.
Date & Time : 05:30 AM May 04, 2018
-
బన్నీ మరియు ప్రభాస్ శీను మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:27 AM May 04, 2018
-
ఇప్పుడు సినిమాలోని నాలుగవ పాట మాయ.. వస్తోంది.
Date & Time : 05:19 AM May 04, 2018
-
సాయి కుమార్ మాజీ సైనికుడిగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అతను ఒక సమస్య పై శరత్ కుమార్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు ...
Date & Time : 05:16 AM May 04, 2018
-
బన్నీ మరియు అతని కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:11 AM May 04, 2018
-
ఇంటర్వెల్ తరువాత సినిమా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం యాంగర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. బన్నీ తన షార్ట్ టెంపర్ ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 05:06 AM May 04, 2018
-
సినిమా కథ సగం పూర్తయ్యింది.. ఇప్పుడు ఇంటర్వెల్
Date & Time : 05:02 AM May 04, 2018
-
ప్రస్తుతం బన్నీ మరియు అనూప్ సింగ్ ల మధ్య భారీ ఫైట్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:56 AM May 04, 2018
-
బన్నీ మరియు అర్జున్ మధ్య మరికొన్ని కౌన్సెలింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:48 AM May 04, 2018
-
ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది. సినిమా మళ్లీ ప్రస్తుత రోజుల్లోకి మారింది. ఇప్పుడు లవర్ ఆల్సొ ఫైటర్ ఆల్సొ అనే సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Date & Time : 04:39 AM May 04, 2018
-
పోసాని కృష్ణ మురళి హీరోయిన్ అను అంకుల్ గా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 04:29 AM May 04, 2018
-
ఈ చిత్రం తిరిగి వెనువెంటనే ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లిపోయింది మరియు ప్రస్తుతం హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ బన్నీ యొక్క ప్రేయసిగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రెండో పాట 'బ్యూటిఫుల్ లవ్' వస్తోంది.
Date & Time : 04:25 AM May 04, 2018
-
బన్నీ మరియు అతని తండ్రి అర్జున్ మధ్య కొన్ని సలహాల దృశ్యాలు వస్తున్నాయి ...
Date & Time : 04:21 AM May 04, 2018
-
శరత్ కుమార్ మరియు ఠాకూర్ అనూప్ సింగ్ తండ్రి మరియు కొడుకుగా పరిచయమయ్యారు ...
Date & Time : 04:19 AM May 04, 2018
-
ప్రస్తుతం అర్జున్ పని చేస్తున్న విశాఖపట్నంకి ఈ చిత్రం షిఫ్ట్ అయ్యింది. బన్నీ యొక్క రూమ్మెట్ గా కమెడియన్ వెన్నెల కిషోర్ సీన్ లోకి వచ్చాడు. అర్జున్ భార్యగా నదియా కూడా పరిచయంచేయబడ్డారు.
Date & Time : 04:17 AM May 04, 2018
-
సైకాలజీ ప్రొఫెసర్ గా యాక్షన్ హీరో అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన బన్నీ తండ్రిగా నటిస్తున్నారు. తండ్రి మరియు కొడుకుల మధ్య వివాదానికి సంబంధించిన కొన్ని చిన్ననాటి దృశ్యాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:14 AM May 04, 2018
-
ప్రముఖ నటుడు రావు రమేష్ బన్నీ గాడ్ ఫాదర్ గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:06 AM May 04, 2018
-
బోమన్ ఇరానీ మరియు బన్నీల మధ్య తీవ్రమైన మాటల సంభాషణ సన్నివేశం తరువాత అతి ఆగ్రహం వైఖరి కారణంగా బన్నీకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
Date & Time : 04:03 AM May 04, 2018
-
ఇప్పుడు మొదటి పాట సైనిక వస్తోంది ... బ్యాక్ గ్రౌండ్ లో ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 03:54 AM May 04, 2018
-
ఫస్ట్ ఫైట్ తరువాత పోలీస్ స్టేషన్ లో మరో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ వస్తున్నాయి.. ఈ సీన్ లో బన్నీ అసలు క్యారెక్టర్ భయటపడుతోంది.
Date & Time : 03:50 AM May 04, 2018
-
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం బార్ లో ఫస్ట్ ఫైట్ వస్తోంది.
Date & Time : 03:44 AM May 04, 2018
-
డెహ్రాడూన్ ఆర్మీ క్యాంప్ లో సినిమా కథ మొదలైంది..
Date & Time : 03:40 AM May 04, 2018
-
హాయ్..168 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 03:34 AM May 04, 2018