-
-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 04:56 AM January 09, 2019
-
ఇప్పుడు సినిమా అంతిమ దశకు చేరుకుంటుంది.నందమూరి తారక రామారావు గారు తన రాజకీయ పార్టీని ప్రకటించేసారు.
Date & Time : 04:54 AM January 09, 2019
-
రాజకీయ పార్టీని స్థాపించేందుకు సిద్ధమవుతున్న కొన్ని సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:49 AM January 09, 2019
-
ఇప్పుడు చిత్రం మరో కీలక ఘట్టం రాజకీయ కోణంలోకి వెళ్తుంది.దగ్గుబాటి రానా చంద్రబాబు పాత్రలో ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 04:42 AM January 09, 2019
-
క్యామియో రోల్ లో రకుల్ ప్రీత్ సింగ్ వేటగాడు సినిమా పాటతో ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు సర్దార్ పాపారాయుడు సినిమాకి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:32 AM January 09, 2019
-
ఇప్పుడే యమగోల చిత్ర హీరోయిన్ జయప్రద పాత్రలో హన్సిక ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు ఎన్టీఆర్ జీవితంలో దివి సీమ వరదలకు సంబందించిన కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా వస్తున్నాయి.
Date & Time : 04:22 AM January 09, 2019
-
ప్రభ పాత్రలో హీరోయిన్ శ్రేయ దానవీర శూర కర్ణ షూటింగ్ లో కనిపిస్తున్నారు.ఆ సినిమా షూటింగ్ కు సంబందించిన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:08 AM January 09, 2019
-
అన్నదమ్ముల అనుబంధం సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ను ఎలివేట్ చేసే ఒక అద్భుత సన్నివేశం ఇప్పుడు వస్తుంది.
Date & Time : 04:00 AM January 09, 2019
-
విరామం అనంతరం నర్తనశాల సినిమాకి సంబందించిన సన్నివేశాలతో చిత్రం ప్రారంభం అయ్యింది.
Date & Time : 03:45 AM January 09, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా ఆరంభం నుంచి ఇంటర్వెల్ వరకు సాఫీ గానే సాగింది.ఇప్పుడు సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో దానికి సెకండాఫ్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలి.
Date & Time : 03:45 AM January 09, 2019
-
ఇప్పటికి సినిమా సగం పూర్తి కావచ్చింది.ఇప్పుడు విరామం
Date & Time : 03:35 AM January 09, 2019
-
ఎన్టీఆర్ మొదటి కొడుకు రామ కృష్ణ చనిపోయిన సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా భావోద్వేగ పూరితంగా వస్తుంది.
Date & Time : 03:30 AM January 09, 2019
-
ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో అత్యంత కీలక పాత్ర పది తలల రావణుని పాత్ర సీతా రామ కళ్యాణం సినిమా కోసం తీస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.ఈ పాత్రలో బాలకృష్ణ అభిమానులకు కనుల పండుగలా కనిపిస్తారు.ఇప్పుడే మహానటి సావిత్రి పాత్రలో నిత్యా మీనన్,హాస్య నటుడు రేలంగి పాత్రలో బ్రహ్మానందం,కృష్ణ కుమారి పాత్రలో ప్రణీత ఒక్కోక్కరిగా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 03:23 AM January 09, 2019
-
ఇప్పుడు మాయాబజార్ చిత్రంలో కృష్ణుని యొక్క పాత్రలో ఎన్టీఆర్ పాత్ర పరిచయం అయ్యింది.ఈ సీన్ మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది.
Date & Time : 03:11 AM January 09, 2019
-
ఎన్టీఆర్ మరియు బసవ తారకం మధ్య ఆప్యాయతకు చిహ్నంగా బంటురీతి కొలువు అనే పాట ఇప్పుడు వస్తుంది.
Date & Time : 03:02 AM January 09, 2019
-
రాయలసీమలోని కొన్ని కరువు ప్రాంతాల బాగు కోసం విరాళాల సేకరణను ప్రతిబింబిస్తూ జై కొట్టు తెలుగోడా అనే పాట ఇప్పుడు వస్తుంది.ఎన్టీఆర్ కి ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆదరణ క్రమక్రమంగా పెరుగుతుంది.
Date & Time : 02:55 AM January 09, 2019
-
ఇప్పుడు ఎన్టీఆర్ విజయ వాహిని బ్యానర్ లో కాంట్రాక్టు పై సంతకం పెడుతున్న సన్నివేశం వస్తుంది.దర్శకుడు నాగిరెడ్డి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్,చక్రపాణిగా మురళి శర్మ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.అలాగే పాతాళ భైరవి చిత్ర దర్శకుడు వెంకట రెడ్డి పాత్రలో క్రిష్ ఎంట్రీ కూడా ఇప్పుడే ఇచ్చారు.
Date & Time : 02:42 AM January 09, 2019
-
అప్పట్లో మరో అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటుడు సుమంత్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు ఎన్టీఆర్ మరియు ఎన్నార్ ల మధ్య ఉన్న బంధాన్ని చిత్రీకరిస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:35 AM January 09, 2019
-
సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలుకు సంబందించిన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.ఈ సీన్స్ అన్ని కొంచెం భావోద్వేగ పూరితంగా కనిపిస్తున్నాయి.
Date & Time : 02:30 AM January 09, 2019
-
ఇప్పుడు ఎన్టీఆర్ యొక్క మొదటి సినిమా మన దేశం షూటింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:25 AM January 09, 2019
-
ట్రైలర్ లో చూపిన విధంగా ఎన్టీఆర్ తన ఉద్యోగాన్ని వదిలేసి సినీ పరిశ్రమ వైపు అడుగులు వేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.ఈ సీన్లను ప్రతిబింబిస్తూ కథానాయక పాట బాక్గ్రౌండ్ లో వస్తుంది.
Date & Time : 02:20 AM January 09, 2019
-
రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగిగా ఎన్టీఆర్ పరిచయం కాబడ్డారు.ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:15 AM January 09, 2019
-
1984లో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ షాట్ తో చిత్రం ప్రారంభం అయ్యింది,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ మరియు బసవతారకం పాత్రలో విద్యా బాలన్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు మళ్ళీ 1947కాలంలోకి తీసుకెళ్లింది.ఇప్పుడే నందమూరి తారక రామారావు గా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 02:10 AM January 09, 2019
-
హాయ్..171 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడు మొదలయ్యింది.
Date & Time : 02:05 AM January 09, 2019