-
-
మొత్తానికి "ఎన్.జి.కె" ముఖ్యమంత్రి అయ్యాడు.ఎండింగ్ టైటిల్స్ తో సూర్య ఇస్తున్న ఒక ఇంటర్వ్యూ పూర్తి కావడంతో సినిమా కూడా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 08:22 AM May 31, 2019
-
ప్రస్తుత తరంలో ఉన్న మనుషులను ఉద్దేశించి సూర్య ఒక అద్భుతమైన స్పీచ్ ను ఇస్తున్నారు.
Date & Time : 08:15 AM May 31, 2019
-
ఇప్పుడు సూర్య మరియు నెగిటివ్ పాత్రల మధ్య భీకర పోరాట సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:05 AM May 31, 2019
-
నంద గోపాల్ అక్కడి జనంలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు,ఇప్పుడు రకుల్ మరియు సూర్య ల మధ్య ప్రేమ ఓ ప్రేమ అనే ఒక డ్రీమ్ సాంగ్ వస్తుంది.
Date & Time : 07:50 AM May 31, 2019
-
ఇప్పుడు కథానుసారంగా అణచివేసిన పాట వస్తుంది.
Date & Time : 07:39 AM May 31, 2019
-
సూర్య పై ఇప్పుడు ఒక హత్యా యత్నం జరిగింది.ఇప్పుడు సూర్య పాత్ర చుట్టూ ఒక రకమైన సస్పెన్స్ ఏర్పడింది.
Date & Time : 07:33 AM May 31, 2019
-
ఇంటర్వెల్ అనంతరం రకుల్ మరియు సాయి పల్లవిల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:28 AM May 31, 2019
-
ఇప్పుడే కథలో కీలక మలుపు చోటు చేసుకోవడంతో సినిమా సగానికి చేరుకుంది,ఇప్పుడు విరామం.
Date & Time : 07:15 AM May 31, 2019
-
అధికార మరియు ప్రతిపక్షాల మధ్య కొన్ని రాజకీయ సన్నివేశాలు ఎన్నిలకు దారి తీశాయి.
Date & Time : 07:03 AM May 31, 2019
-
మరో పవర్ ఫుల్ పాత్రగా అదే రాజకీయ పార్టీలో మరో హీరోయిన్ అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు పరిచయం అయ్యింది.పార్టీ కార్యకర్తలు అందరికి హెడ్ గా ఆమె కనిపిస్తున్నారు.
Date & Time : 06:45 AM May 31, 2019
-
వడ్డీలోడు వచ్చేనే పాట ద్వారా సూర్య రాజకీయాల్లో ఎలా ఎదుగుతున్నాడో చూపిస్తున్నారు.
Date & Time : 06:39 AM May 31, 2019
-
కొన్ని కీలక పరిణామాల వల్ల సూర్య రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది.ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్తగా సూర్య కనిపిస్తున్నారు.
Date & Time : 06:24 AM May 31, 2019
-
ఇప్పుడు సినిమా మెల్లగా పొలిటికల్ డ్రామాగా మలుపు తీసుకుంటుంది.రాజకీయ నాయకులు సమాజంలో ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో వారు ప్రతీ దాన్ని ఎలా వారి ఆధీనంలో ఉంచుకుంటారో చూపిస్తున్నారు.
Date & Time : 06:18 AM May 31, 2019
-
నంద గోపాల్ మరియు అతని స్నేహితులు పెస్టిసైడ్(క్రిమి సంహారిణి)మాఫియా నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:12 AM May 31, 2019
-
ఇప్పుడు తిరగబడు పాట మొదలయ్యింది.ఈ పాటలో నంద గోపాల్ కు ఉన్న సేవ భావం మరియు దేశం పట్ల ఉన్న ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:05 AM May 31, 2019
-
ఇప్పుడు సూర్య కుటుంబం అంతా పరిచయం అయ్యింది.ఇప్పుడే సాయి పల్లవి సూర్య భార్యగా ఎంట్రీ ఇచ్చింది.ఒక ఎంఎన్ సి కంపెనీ ఉద్యోగాన్ని వదిలి రైతుగా స్థిరపడిన పాత్రలో సూర్య కనిపిస్తున్నారు.
Date & Time : 05:58 AM May 31, 2019
-
నంద గోపాల కృష్ణ గా సూర్య ఇంట్రో సింపుల్ గానే వచ్చింది.ఇప్పుడు టైటిల్స్ వస్తున్నాయి.
Date & Time : 05:52 AM May 31, 2019
-
హాయ్... 148 నిమిషాల నిడివి కల "ఎన్.జీ.కె" మూవీ ఇప్పుడే మొదలైంది.
Date & Time : 05:45 AM May31, 2019