-
పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 07:10 AM October 15, 2021
-
ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ తర్వాత ఫన్నీ నోట్ లో సినిమా పూర్తయ్యిపోయింది.
Date & Time : 06:55 AM October 15, 2021
-
యే జిందగీ సాంగ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. అఖిల్, పూజా లు దగ్గరవుతున్నారు. సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 06:45 AM October 15, 2021
-
ఇప్పుడు పూజా హెగ్డే ఫ్లాష్ బ్యాక్ పై సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:35 AM October 15, 2021
-
ఓ ప్రత్యేకమైన సన్నివేశంలో అఖిల్, పూజా హెగ్డేలు లవ్ స్టోరీ సినిమా చూస్తున్నారు.
Date & Time : 06:25 AM October 15, 2021
-
ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అఖిల్ పూజా ని వెతకడం కోసం మళ్ళీ ఇండియా కి వచ్చాడు.
Date & Time : 06:15 AM October 15, 2021
-
ఇప్పుడు చిట్టి అడుగు సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 06:08 AM October 15, 2021
-
అఖిల్ బావగా అజయ్ మంచి పాత్రలో కనిపిస్తున్నాడు. అఖిల్ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాడు.
Date & Time : 06:04 AM October 15, 2021
-
ఇంటర్వెల్ అనంతరం, వెన్నెల కిషోర్ ఇప్పుడు ఎంటర్ అయ్యాడు.
Date & Time : 06:00 AM October 15, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పుడు వరకు సినిమా దాదాపు మంచి ఎంటర్టైన్మెంట్ తో కొనసాగింది. మంచి కామెడీ సీన్స్ తో ఎంగేజింగ్ గా ఉంది. అలాగే అఖిల్, పూజా హెగ్డే ల కెమిస్ట్రీ కూడా బాగుంది, సాంగ్స్ అంతా కూడా బానే ఉన్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:55 AM October 15, 2021
-
ఇప్పుడు మళ్ళీ అఖిల్ యూ ఎస్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విరామం.
Date & Time : 05:50 AM October 15, 2021
-
సినిమా అంతా ఒక్కసారిగా సీరియస్ టోన్ లోకి మారిపోయింది.
Date & Time : 05:45 AM October 15, 2021
-
ఇప్పుడు పోసానిపై ఓ కోర్ట్ సన్నివేశం వస్తుంది
Date & Time : 05:35 AM October 15, 2021
-
ఇప్పుడు మరిన్ని పెళ్లిచూపులు, కామెడీ సీన్స్ తర్వాత మరో చార్ట్ బస్టర్ లెహరాయి స్టార్ట్ అయ్యింది.
Date & Time : 05:25 AM October 15, 2021
-
హిట్ సాంగ్ గుచ్చే గులాబీ ఇప్పుడు మొదలయ్యింది.
Date & Time : 05:15 AM October 15, 2021
-
ఇప్పుడు పూజా హెగ్డే, అఖిల్ ల మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:10 AM October 15, 2021
-
ఒక స్టాండప్ కమెడియనీ గా పూజా హెగ్డే ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమెని చూసాక అఖిల్ కన్ఫ్యూజన్ లో పడ్డాడు.
Date & Time : 05:05 AM October 15, 2021
-
హిలేరియస్ ఫన్ తో సినిమా ఎంటర్టైనింగ్ గా వెళ్తుంది.
Date & Time : 05:00 AM October 15, 2021
-
నటి ఈషా రెబ్బాతో ఒక ఫన్నీ సీన్ వస్తుంది, అలాగే పూజా హెగ్డే తండ్రిగా మురళీ శర్మ పరిచయం అయ్యాడు.
Date & Time : 04:57 AM October 15, 2021
-
అఖిల్ ఇండియాకి వచ్చేసాడు, తన పెళ్లి చూపులు సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:52 AM October 15, 2021
-
ఒక ఎన్ ఆర్ ఐ, ఐటీ ప్రొఫెషినల్ గా అఖిల్ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు. తన పెళ్లి కోసం ఇండియాకి పయనం అయ్యాడు. తన ఫ్రెండ్స్ కుటుంబాలు ఒక పండుగ వాతావరణంలో పరిచయం అవుతున్నాయి.
Date & Time : 04:50 AM October 15, 2021
-
నిజ జీవిత భార్యా భర్తలు రాహుల్, చిన్మయి లు ఇప్పుడు పరిచయం అయ్యారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి సినిమా వెళ్ళింది.
Date & Time : 04:45 AM October 15, 2021
-
కొన్ని ఫన్నీ, కామికల్ జోక్స్ బ్యాక్గ్రౌండ్ లో వస్తూ టైటిల్స్ ఇప్పుడే మొదలయ్యాయి.
Date & Time : 04:40 AM October 15, 2021
-
హాయ్..2 గంటల 28 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:30 AM October 15, 2021