-
కొన్ని ఊహించని సన్నివేశాల అనంతరం ఈ చిత్రం చాలా ఆసక్తికరమైన ట్విస్ట్ తో ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:45 AM April 13, 2018
-
క్లైమాక్స్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుదేవా అంతలా రాక్షసుడిగా మారడానికి గల కారణాలకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:42 AM April 13, 2018
-
ప్రభుదేవా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.
Date & Time : 11:36 AM April 13, 2018
-
చాలా చిన్న ట్విస్ట్ తో చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది ..
Date & Time : 11:34 AM April 13, 2018
-
ప్రభుదేవా బ్యాడ్ పర్సన్ గా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు ... అతని మేకప్ చాలా బాగుంది ..
Date & Time : 11:28 AM April 13, 2018
-
ప్రభుదేవా స్నేహితులందరిని వెంబడిస్తున్నాడు. కథ కేవలం ఒక లొకేషన్ లో మాత్రమే కొనసాగుతోంది.
Date & Time : 11:25 AM April 13, 2018
-
విజువల్స్ మరియు కెమెరా పనితనం తెరపై ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 11:23 AM April 13, 2018
-
ప్రభుదేవా మరియు ఫ్రెండ్స్ గ్యాంగ్ మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో చిత్రం ముందుకు సాగుతోంది. టామ్ అండ్ జెర్రీ తరహాలో కొన్ని సీన్స్ వస్తున్నాయి.. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది
Date & Time : 11:17 AM April 13, 2018
-
మొత్తం సినిమా ఓల్డ్ కెమికల్ ఫ్యాక్టరీలో నడుస్తోంది. లైటింగ్, సౌండ్ డిజైన్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Date & Time : 11:08 AM April 13, 2018
-
విరామం తరువాత ప్రభు దేవా హింసాత్మకంగా మారాడు. మొత్తం గ్యాంగ్ అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
Date & Time : 11:05 AM April 13, 2018
-
ఆసక్తికరమైన ఇంటర్వెల్ పాయింట్.. ప్రభుదేవా తిరిగి గ్యాంగ్ ను టార్చర్ పెట్టె పనిలో పడ్డాడు. ఇప్పుడు బ్రేక్
Date & Time : 10:51 AM April 13, 2018
-
కథలో ఒక చిన్న ట్విస్ట్. ఒక అమ్మాయి గ్యాంగ్ లో కనిపించడం లేదు. కథ ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:49 AM April 13, 2018
-
గ్యాంగ్ మరియు ప్రభుదేవకు సంబంధించిన కొన్ని పోరాట దృశ్యాలు వస్తున్నాయి.. ఫ్యాక్టరీలో కథ ఆసక్తికరంగా కొనసాగుతోంది.
Date & Time : 10:47 AM April 13, 2018
-
ఈ చిత్రం ఒక హాంటెడ్ ఫ్యాక్టరీకి తరలించబడింది. కొన్ని భయానక దృశ్యాలు మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వస్తున్నాయి.
Date & Time : 10:37 AM April 13, 2018
-
పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గ్యాంగ్ అడవిలో చిక్కుకుంది. ఇప్పుడే ప్రభుదేవా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:24 AM April 13, 2018
-
స్నేహితుల్లో ఒకరు గుంపులో ఉన్న అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందరు ఒక నిర్మానుషమైన ప్రదేశానికి చేరుకున్నారు.
Date & Time : 10:15 AM April 13, 2018
-
సినిమా చాలా ఆసక్తికరమైన కథాంశంతో నడుస్తోంది. కథలో ఉన్న స్నేహితులందరు చెవుడు మరియు మూగవారు.
Date & Time : 10:06 AM April 13, 2018
-
కొంత మంది స్నేహితులు ప్రస్తుతం పార్టీ చేసుకుంటున్నారు..
Date & Time : 10:01 AM April 13, 2018
-
హాయ్..158 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.. ఆసక్తికరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టైటిల్స్ పడుతున్నాయి.
Date & Time : 09:56 AM April 13, 2018