-
ఎవరు ఊహించనటువంటి ఒక సరికొత్త ట్విస్ట్ తో సినిమా ముగింపు పలికింది. కాగా ఇక పూర్తి సినిమా సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి...
Date & Time : 01:30 AM December 25, 2019
-
ఈ చిత్ర క్లైమాక్స్ లో చాలా విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీరి స్నేహితులందరి మధ్యన కొన్ని ఉద్రిక్తంగా సన్నివేశాలు ప్రదర్శితమవుతున్నాయి..
Date & Time : 01:20 AM December 25, 2019
-
ఇక ఈ కథలో ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైన మలుపు బయటపడింది. వీటన్నింటికి వెనకాల ఉన్నటువంటి ఆ కీలకమైన వ్యక్తి బయటపడతాడు. ఇంతటితో ఈ చిత్రం క్లిమక్స్ వైపు పయనమైంది...
Date & Time : 01:12 AM December 25, 2019
-
ఇకపోతే బ్రహ్మాజీ ఫ్లాష్ బ్యాక్ లోకి ప్రవేశించారు. కాగా ప్రస్తుతానికి ఒక మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతుంది...
Date & Time : 01:05 AM December 25, 2019
-
ఈ చిత్రం ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. అసలు వీటన్నింటికి కూడా గతంలో ఏమి జరిగిందని హీరోయిన్ మరియు వెన్నెల కిషోర్ ప్రయత్నిస్తున్నారు...
Date & Time : 01:00 AM December 25, 2019
-
ఇప్పుడొక కీలకమైన పాత్ర ఈ కథలోకి ప్రవేశించింది. ఇక వెన్నెల కిషోర్ మళ్ళీ కథలోకి వచ్చాడు...
Date & Time : 12:50 AM December 25, 2019
-
సత్య తన పాత్రకి సరైన న్యాయం చేస్తున్నాడు. తన కామెడీ చాలా బాగుంది. కథలోని సస్పెన్స్ కూడా చాలా ఆకట్టుకుంటుంది.
Date & Time : 12:45 AM December 25, 2019
-
హీరో మరియు అతని స్నేహితులు ఆ అపార్టుమెంటు నుండి ఆధారాలను సేకరించడానికి తీవ్రంగా ఓరాయత్నిస్తున్నారు...
Date & Time : 12:40 AM December 25, 2019
-
విరామం తరువాత హీరో వద్ద రూ.50 లక్షలు ఉన్నాయి కానీ అవి ఎక్కడినుండి పొందాడో అర్థం కావడం లేదు...
Date & Time : 12:30 AM December 25, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు చాలా మంచి కథతో ఊహించని సస్పెన్స్ తో చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి సరళమైన కథ, కథనంతో చిత్రం ముందుకుపోతుంది. ముఖ్యంగా హాస్య నటుడు సత్య నటన ఆకట్టుకుంటుంది. ఇకపోతే రెండవ సగం ఈ చిత్రానికి కీలకంగా మారనుంది...
Date & Time : 12:15 AM December 25, 2019
-
ఇప్పుడు అసలైన సస్పెన్స్... మన హీరో అన్ని రకాల సమస్యలతో చిక్కుకుంటాడు... ఈ సస్పెన్స్ తో ఈ చిత్రం విరామానికి చేరుకుంది. ఇప్పటికి మొదటి బాగా పూర్తయినది.
Date & Time : 12:10 AM December 25, 2019
-
కథలో మరొక ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు హీరో ఇందాకటి పరిస్థితిలో లోతుగా ఇరుక్కపోయాడు... ఇక సినిమా విరామం వైపుగా వెళ్తుంది.
Date & Time : 12:05 AM December 25, 2019
-
హీరో ఇప్పుడొక విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. ఇప్పుడొచ్చే సస్పెన్స్ కామెడీ చాలా బాగుంది...
Date & Time : 12:00 AM December 25, 2019
-
మన హీరో కి ఒక డెలివరీ క్రైం సీన్ గా మారిపాయింది. ఇది చాలా ఆసక్తికరమైన కథనం. హాస్య నటుడు సత్య కి సంబందించిన మంచి హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:50 PM December 24, 2019
-
హీరో మరియు అతని స్నేహితులు అందరు డెలివరీ బాయ్స్. వాళ్ళందరూ కస్టమర్లను మోసం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఒక ఆసక్తికర అంశంతో సినిమా ప్రారంభం అయింది. ఇప్పుడు మరొక హాస్య నటుడు వెన్నెల కోశోర్ లోపలి వచ్చాడు.
Date & Time : 11:38 PM December 24, 2019
-
ఇప్పుడు హాస్య నటుడు సత్య పరిచయం జరిగింది. కాగా ఈ నేపథ్యంలో ఓడిపోయిన ముగ్గురు బ్యాచిలర్ల జీవితాలను చూపిస్తున్నారు...
Date & Time : 11:25 PM December 24, 2019
-
ఇప్పుడు హీరో శ్రీ సింహ పరిచయం జరిగింది. అతని పేరు బాబు మోహన్. అతడు ఒక డెలివరీ బాయ్... ఇకపోతే ఇప్పుడే చిత్ర టైటిల్స్ ఆసక్తికర రీతిలో వస్తున్నాయి...
Date & Time : 11:17 PM December 24, 2019
-
ఈ చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది మరియు ఇది 130 నిమిషాల నిడివి.
Date & Time : 11:08 PM December 24, 2019
-
హాయ్... మేము రాజమౌళి కుటుంబ సభ్యులకు సంబందించిన నూతన చిత్ర ప్రత్యక్ష ప్రసారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ చిత్రాన్ని చూడటానికి రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా వచ్చారు.
Date & Time : 11:00 PM December 24, 2019