-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:00 AM June 07, 2024
-
ఇప్పుడు భారత్ కి శర్వా తిరిగి వచ్చాడు. ఈ సమయంలో తన జీవితానికి కృతి ఎంత ముఖ్యం అనేది తెలుసుకుంటున్నాడు. ఈ సంబంధిత ముఖ్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:50 AM June 07, 2024
-
ఇప్పుడు శర్వానంద్ విషయంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. తన విషయంలో కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:40 AM June 07, 2024
-
ఇప్పుడు కృతికి శర్వానంద్ పై ఫీలింగ్స్ మొదలవుతున్నాయి. ఈ క్రమంలో ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ మొదలైంది.
Date & Time : 10:30 AM June 07, 2024
-
మెయిన్ లీడ్ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ ఖుషి పుట్టినరోజుని బాగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు టోనీగా సీనియర్ నటుడు విజయ్ కుమార్ పరిచయం అయ్యారు.
Date & Time : 10:20 AM June 07, 2024
-
ఇక ఓ స్పెషల్ ట్రిప్ సన్నివేశాలు స్టార్ట్ అయ్యాయి. ఈ సమయంలో నటి సీరత్ కపూర్ ఓ టూరిస్ట్ గైడ్ గా పరిచయం అయ్యింది. మరింత ఫన్ ఇప్పుడు కథనంలో చేర్చబడింది.
Date & Time : 10:10 AM June 07, 2024
-
ఇప్పుడు మెయిన్ లీడ్ పై మరిన్ని కామెడీ సీన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 10:00 AM June 07, 2024
-
ఇంటర్వెల్ అనంతరం సినిమా మంచి ఫన్ నోట్ తో మొదలైంది.
Date & Time : 09:50 AM June 07, 2024
-
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు సినిమా డీసెంట్ ఎమోషన్స్, మంచి ఫన్ తో బాగానే సాగింది. శర్వానంద్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్ కి ఆకట్టుకున్నాడు. అలాగే కృతి కూడా తన రోల్ ని చాలా నీట్ గా చేస్తుంది. మ్యూజిక్ కథనంలో అదనపు ఆకర్షణ అని చెప్పాలి. మరి సెకండాఫ్ కూడా ఇదే రీతిలో కొనసాగుతుందో లేదో చూడాలి.
Date & Time : 09:40 AM June 07, 2024
-
ఎందుకో శర్వానంద్ తాను కృతి పై ఫీలింగ్స్ ఉన్నట్టుగా సడెన్ గా రియలైజ్ అయ్యాడు. ఈ టైం లో కృతికి ఒక షాకింగ్ పర్శనల్ సమస్య ఉందని తెలుసుకొని వెనకడుగు వేసాడు. దీనితో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 09:30 AM June 07, 2024
-
ఇప్పుడు ఖుషి తండ్రి కోసం శర్వానంద్, కృతి శెట్టి లు కలిసి మళ్లీ వారి లైఫ్ సెట్ అయ్యే విధంగా ఫ్రెష్ జర్నీని స్టార్ట్ చేసి సాయం చేస్తున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:20 AM June 07, 2024
-
ఇప్పుడు ఒక ఊహించని సంఘటనతో శర్వా, విక్రమ్ లు కలిసిపోయారు. ఈ తర్వాత రోలెక్స్ రాములుగా నటుడు రాహుల్ రామకృష్ణ పరిచయం అయ్యాడు. ఇప్పుడు మరిన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:10 AM June 07, 2024
-
మరికొన్ని కామెడీ సీన్స్ ఆ పిల్లాడు, శర్వా నడుమ కొనసాగుతున్నాయి.
Date & Time : 09:00 AM June 07, 2024
-
ఇప్పుడు కొన్ని కామెడీ సీన్స్ శర్వానంద్, చిన్న పిల్లాడు ఖుషి (విక్రమ్ ఆదిత్య) మధ్య వస్తున్నాయి.
Date & Time : 08:50 AM June 07, 2024
-
ఇప్పుడు హీరోయిన్ కృతి శెట్టి సుభద్రగా పరిచయం అయ్యింది. కొన్ని ఊహించని పరిణామాలు తో ఇద్దరూ కలిసి ఒక బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.
Date & Time : 08:40 AM June 07, 2024
-
ఒక షాకింగ్ ఘటనతో విక్రమ్ భారత దేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ సంఘటన సంబంధించిన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 08:30 AM June 07, 2024
-
ఇప్పుడు సినిమా లండన్ లో మొదలైంది. విక్రమ్ గా శర్వానంద్ ఒక ఛార్మింగ్ ప్లే బాయ్ లా పరిచయం అయ్యాడు. ఇలా మొదటి సాంగ్ ఇక నామాటే మొదలయింది.
Date & Time : 08:20 AM June 07, 2024
-
హాయ్.. 2 గంటల 35 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.
Date & Time : 08:10 AM June 07, 2024