-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:56 AM December 08, 2017
-
క్లైమాక్స్ సన్నివేశాలు వస్తున్నాయి. అన్ని అనుమానాలు తొలగిపోయాయి. హీరోయిన్ ఎమోషనల్ గా సుమంత్ కు ప్రపోజ్ చేస్తోంది.
Date & Time : 11:46 AM December 08, 2017
-
ప్రేమ కథలో ఇబ్బందులకు గల కారణాలని వివరించే సన్నివేశాలు వాస్తున్నాయి.
Date & Time : 11:36 AM December 08, 2017
-
పరిస్థితులు మరింత జఠిలంగా మారుతున్నాయి. సుమంత్, ఆకాంక్ష విడిపోవాలని నిర్ణయించుకున్నరు. చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:33 AM December 08, 2017
-
చిత్రం మరింత ఎమోషనల్ గా మారుతోంది. ప్రేమ కథలో మరిన్ని ఇబ్బందులు తలెత్తాయి.
Date & Time : 11:30 AM December 08, 2017
-
ప్రేమ కథలో కొత్త కోణం మొదలయింది. ఫ్లాష్ బ్యాక్ లో అసలు కథ రివీల్ అవుతోంది. సుమంత్ చాలా బాగా మెప్పిస్తున్నాడు.
Date & Time : 11:26 AM December 08, 2017
-
అన్నపూర్ణ గ్రాండ్ మదర్ గా తన పాత్రలో అద్భుతంగా నటిస్తున్నారు. కామెడీ మరియు సెంటిమెంట్ చాలా బాగా పండుతున్నాయి.
Date & Time : 11:22 AM December 08, 2017
-
సుమంత్ ప్రేమ మళ్లీ వికసించబోతోంది. అందమైన లవ్ ప్రపోజల్ సీన్ వస్తోంది. సుమంత్ తన పాత్రలో అద్భుతంగా నటిస్తున్నాడు.
Date & Time : 11:12 AM December 08, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభం అయింది. కథ బెంగుళూరుకు మారింది. సుమంత్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:05 AM December 08, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సింపుల్ స్టోరీ అయినా చాలా చక్కగా చూపిస్తున్నారు. ఆసక్తికరమైన సన్నివేశాలు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, రొమాంటిక్ మూమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ బావుంది. చిత్రంలోని ప్రేమ కథ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:50 AM December 08, 2017
-
తన ప్రేమలోని ఇబ్బందులతో సుమంత్ మనసు విరిగింది. ఇప్పుడు ఇంటర్వెల్.
Date & Time : 10:44 AM December 08, 2017
-
చిత్రంలో ట్విస్ట్ వచ్చింది. లీడ్ పెయిర్ ప్రేమలో ఇబ్బందులు మొదలయ్యాయి. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:34 AM December 08, 2017
-
సుమంత్ కు అతడి కాలేజీ స్నేహితులకు మధ్య సన్నివేశాలు వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది.
Date & Time : 10:24 AM December 08, 2017
-
చిత్రంలో ప్రస్తుతం అందమైన సాంగ్ వస్తోంది. హీరో హీరోయిన్ల స్కూల్ డేస్ కి సంబందించిన సన్నివేశాలు చూపిస్తున్నారు.
Date & Time : 10:14 AM December 08, 2017
-
హీరోయిన్ ఆకాంక్ష సింగ్ బ్యూటిఫుల్ లుక్స్ తో కనిపిస్తోంది. ఆసక్తికరమైన ప్రేమ కథ మొదలైంది.
Date & Time : 10:04 AM December 08, 2017
-
చిత్రం స్క్రీన్ ప్లే ఆధారంగా నడుస్తోంది. మూడు సమయాలు 1999,2012 మరియు 2017 కి సంబంధించిన సన్నివేశాలు ఒకదాని తరువాత మరొకటి వస్తున్నాయి.
Date & Time : 9:57 AM December 08, 2017
-
1999 సంవత్సరం నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ మొదలైంది. హీరో హీరోయిన్ల చిన్ననాటి నుంచే ప్రేమ సన్నివేశాలు చూపిస్తున్నారు.
Date & Time : 9:47 AM December 08, 2017
-
హీరో సుమంత్, హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ఇద్దరూ పరిచయం అయ్యారు. హైదరాబాద్ 2012 లో జరిగిన బ్రేక్ కప్ సన్నివేశంతో చిత్రం ప్రారంభం అయింది.
Date & Time : 9:37 AM December 08, 2017
-
హాయ్..128 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది.
Date & Time : 9:30 AM December 08, 2017