-
-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:19 AM April 05, 2019
-
చైతు మరియు సమంతల మధ్య ఇప్పుడొక భావోద్వేగ పూరిత సన్నివేశంతో క్లైమాక్స్ నడుస్తుంది.
Date & Time : 07:12 AM April 05, 2019
-
ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశకు చేరుకుంటుంది.చైతు ఇప్పుడిప్పుడే మాములు మనిషిగా మారుతున్నాడు.
Date & Time : 07:08 AM April 05, 2019
-
చైతు మరియు సామ్ ల మధ్య వస్తున్న కుటుంబ నేపధ్య సన్నివేశాలు బాగున్నాయి.ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఏ మనిషికి ఏ మజిలీయో పాట వస్తుంది.
Date & Time : 07:00 AM April 05, 2019
-
ఇప్పుడు మళ్ళీ సినిమా వైజాగ్ కు షిఫ్ట్ అయ్యింది.కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:47 AM April 05, 2019
-
ఇప్పుడు సినిమా డెహ్రాడూన్ కు మారింది.ఒక క్రికెట్ అకాడమీలో చైతు ఉద్యోగాన్ని వెతుక్కున్నాడు.ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 06:36 AM April 05, 2019
-
ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ పార్టీ చేసుకుంటున్నారు.ఇప్పుడు వన్ బాయ్ వన్ గర్ల్ పాట వస్తుంది.
Date & Time : 06:28 AM April 05, 2019
-
స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల చైతు సమంతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది.
Date & Time : 06:21 AM April 05, 2019
-
ఇప్పుడు సమంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయ్యింది.తన వెర్షన్ నుంచి చై ను ప్రేమిస్తున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి,దానికి తగ్గట్టుగా ప్రియతమా పాట వస్తుంది.
Date & Time : 06:13 AM April 05, 2019
-
సమంత పోసాని కృష్ణ మురళి కూతురిగా కనిపిస్తుంది.కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:05 AM April 05, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి సినిమా బాగానే కొనసాగింది.ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇచ్చిన సమంత పాత్ర తర్వాత కొనసాగబోయే మిగతా సినిమాకి కీలకంగా మారనుందని అర్ధమవుతుంది.మరి ఇక నుంచి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:58 AM April 05, 2019
-
సమంత ఇంట్రోతో సినిమా సగానికి పూర్తయ్యింది.ఇప్పుడు విరామం.
Date & Time : 05:52 AM April 05, 2019
-
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తయ్యింది.ఇప్పుడు చైతు మరియు సుబ్బరాజ్ మనుషుల మధ్య ఒక మాస్ ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 05:48 AM April 05, 2019
-
ఇప్పుడు సినిమా కాస్త సీరియస్ గా సాగుతుంది.పూర్ణ మరియు అన్షు లు వారి తల్లిదండ్రుల వల్ల వేరు చేయబడ్డారు.ఇప్పుడు ఏడెత్తు మల్లెలే పాట సెంటిమెంట్ వెర్షన్ లో వస్తుంది..
Date & Time : 05:41 AM April 05, 2019
-
ఇప్పుడు చై మరియు సుబ్బరాజ్ ల మధ్య ఒక వీధిలో గొడవ జరుగుతుంది.ఈ గొడవలో దివ్యాన్సాను కాపాడటానికి చైతు ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 05:33 AM April 05, 2019
-
చై తన జీవిత లక్ష్యం నుంచి మెల్లగా దారి తప్పుతున్నాడు.ఇప్పుడు మెల్లగా సుబ్బరాజు గ్యాంగ్ లోకి చేరుతున్నాడు.
Date & Time : 05:26 AM April 05, 2019
-
ఇప్పుడు నా గుండెల్లో పాట వస్తుంది.ఈ పాటలో వైజాగ్ విజువల్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి.
Date & Time : 05:16 AM April 05, 2019
-
పూర్ణ మరియు అన్షులా మధ్య ఇప్పుడిప్పుడే స్నేహం చిగురిస్తుంది.ఈ ఇద్దరి మధ్య వస్తున్న సన్నివేశాలు చాలా బాగున్నాయి.
Date & Time : 05:09 AM April 05, 2019
-
నావీ ఆఫీసర్ అతుల్ కులకర్ణి కూతురు అన్షుగా దివ్యాన్ష ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 05:03 AM April 05, 2019
-
ఒక యువ రాజకీయ నాయకుడిగా సుబ్బరాజ్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.అక్కడి లోకల్ క్రికెట్ టీమ్ సభ్యులుగా కొన్ని పాత్రలు ఇప్పుడు పరిచయం అయ్యాయి.
Date & Time : 04:58 AM April 05, 2019
-
చై తన స్నేహితులతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఇప్పుడు వారి మధ్య మాయ్య మాయ్య సాంగ్ వస్తుంది.
Date & Time : 04:52 AM April 05, 2019
-
మ్యాచ్ పూర్తయ్యింది.బ్యాక్గ్రౌండ్ లో ఏడెత్తు మల్లెలే పాటతో టైటిల్స్ వస్తున్నాయి.ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి చేరుకుంది.పూర్ణ టీనేజ్ వయసులోకి సినిమా వెళ్ళింది.
Date & Time : 04:47 AM April 05, 2019
-
చైతు ఇప్పుడే పూర్ణగా ఒక సింపుల్ మాస్ ఎంట్రీ ఇచ్చారు.ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:43 AM April 05, 2019
-
సినిమా జబర్దస్త్ మహేష్ క్రికెట్ కామెంట్రీతో ఇప్పుడే మొదలయ్యింది
Date & Time : 04:39 AM April 05, 2019
-
హాయ్ 154 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:36 AM April 05, 2019