-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. సినిమా పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 02:30 PM July 14, 2023
-
ఇప్పుడు హీరో మరియు మినిస్టర్ మధ్య ఓ ఆసక్తికర యాక్షన్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 02:20 PM July 14, 2023
-
ఇపుడు శివకార్తికేయన్ అన్నీ సెట్ చెయ్యాలని ఓ కీలక నిర్ణయం అయితే తీసుకున్నాడు. దీనితో మరో యాక్షన్ సీన్ స్టార్ట్ అయ్యింది. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 02:10 PM July 14, 2023
-
మరికొన్ని సన్నివేశాలు తర్వాత అయితే మరో యాక్షన్ సీన్ కామెడీతో కలిపి స్టార్ట్ అయ్యింది.
Date & Time : 02:00 PM July 14, 2023
-
హీరో మరియు విలన్ మధ్య ఓ కీలక సన్నివేశం వస్తున్నా సమయంలోనే కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇపుడు ఓ ఎమోషనల్ సాంగ్ అయితే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 01:50 PM July 14, 2023
-
ఓ ఫన్నీ యాక్షన్ సీన్ అయితే హీరో మరియు మినిష్టర్ పై ఇప్పుడు వస్తుంది.
Date & Time : 01:40 PM July 14, 2023
-
ఇంటర్వెల్ అనంతరం..సునీల్ శివకార్తికేయన్ పై కొన్ని ఫన్ సీన్స్ తో అయితే సినిమా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 01:30 PM July 14, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా నీట్ గా సాగింది. డీసెంట్ కామెడీ అండ్ సీరియస్ సన్నివేశాలతో అయితే సినిమా ఉంది. యోగిబాబు కామెడీ ఆకట్టుకోగా కథ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుండు. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 01:20 PM July 14, 2023
-
శివకార్తికేయన్ పై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ముగియడంతో అయితే సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 01:10 PM July 14, 2023
-
ఆ కోపంతో ఉన్న మినిష్టర్ హీరోని అటాక్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ కి ఇపుడు రంగం సిద్ధం అయ్యింది.
Date & Time : 01:05 PM July 14, 2023
-
మిస్కిన్ ఇపుడు ఎమ్మెల్యే జయసూర్య గా పరిచయం అయ్యారు. ఇప్పుడు హీరో చేసిన ఓ పని సీరియస్ ఇష్యూ కి దారి తీసింది. పలు ఆసక్తికర పరిస్థితులు ఇప్పుడు మొదలయ్యాయి.
Date & Time : 12:55 PM July 14, 2023
-
శివ కార్తికేయన్ కొన్ని ఊహించని పరిస్థితులతో తనకి ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు.
Date & Time : 12:45 PM July 14, 2023
-
ఇప్పుడు కథనంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. శివకార్తికేయన్ పై కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 12:35 PM July 14, 2023
-
ఇప్పుడు శివకార్తికేయన్ కుటుంబం ఓ అనుకోని సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనితో సినిమా కొత్త టర్న్ తీసుకుంది. కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 12:25 PM July 14, 2023
-
ఇప్పుడు హీరోయిన్ అదితి శంకర్ ఓ సబ్ ఎడిటర్ గా పరిచయం అయ్యింది. కొన్ని ఇంట్రెస్టింగ్స్ సీన్స్ అనంతరం మరో సాంగ్ ఇపుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 12:15 PM July 14, 2023
-
కొన్ని సన్నివేశాలు అనంతరం సినిమా ఫస్ట్ సాంగ్ గాన గాన వస్తుంది. ఇందులో శివకార్తికేయన్ డాన్స్ మూమెంట్స్ బాగా చేస్తున్నాడు.
Date & Time : 12:05 PM July 14, 2023
-
శివకార్తికేయన్ సహా కొందరు ఓ స్లమ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అక్కడ వారు ఓ పెద్ద సమస్యని ఎదుర్కొంటున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 12:00 PM July 14, 2023
-
ఒక కార్టూనిస్ట్ గా శివకార్తికేయన్ ఇపుడు పరిచయం అయ్యాడు. తన ఫ్యామిలీ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:50 AM July 14, 2023
-
హాయ్..2 గంటల 46 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 11:45 AM July 14, 2023