-
-
ఒక సున్నితమైన ఎమోషనల్ టచ్ తో సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 03: 40 AM May 09, 2019
-
ఇప్పుడు దేవిశ్రీ అందించిన ఎమోషనల్ సాంగ్ సౌల్ ఆఫ్ రిషి "ఇదే కదా నీ కథ" పాట వస్తుంది.
Date & Time : 03: 35 AM May 09, 2019
-
ఇప్పుడు రిషి రైతులకు సహాయం అందేలా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరినీ ప్రభావితం చేస్తున్నాడు.
Date & Time : 03: 31 AM May 09, 2019
-
రైతుల సమస్యలు మరియు వారు ఎదుర్కొనే ఇబ్బందులు మీద ఇప్పుడొక ప్రెస్ మీట్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 03: 24 AM May 09, 2019
-
కంచరపాలెం హీరో ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
Date & Time : 03: 22 AM May 09, 2019
-
ఇప్పుడు మహేష్ రైతుగా మారి నాగలి పట్టారు.ఈ సీన్ కు సంబంధించి పదరా పదరా పాట వస్తుంది.
Date & Time : 03: 13 AM May 09, 2019
-
ఇప్పుడు ట్రైలర్ లో చూపించిన మాస్ ఫైట్ సీన్ హై ఎమోషన్స్ తో వస్తుంది.ఇప్పుడే నెగిటివ్ రోల్ లో రాజీవ్ కనకాల పాత్ర ఎంటర్ అయ్యింది.
Date & Time : 03: 02 AM May 09, 2019
-
ఇప్పుడు సినిమా కాస్త సీరియస్ గా సాగుతుంది. జగపతి బాబు మహేష్ మరియు నరేష్ లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
Date & Time : 02: 54 AM May 09, 2019
-
ఆ గ్రామానికి సంబందించిన కొన్ని సన్నివేశాలు అయ్యిన తర్వాత మహేష్ మరియు పూజా ల మధ్య పాల పిట్ట పాట మొదలయ్యింది.
Date & Time : 02: 43 AM May 09, 2019
-
ఇప్పుడు పూజా, విద్యుల్లేఖ తో మళ్ళీ కథలోకి ఎంటర్ అయ్యింది. తన కంపెనీ పని మీద నరేష్ గ్రామానికి ఆమె చేరుకుంది.
Date & Time : 02: 35 AM May 09, 2019
-
ఇప్పుడు రిషి, జగపతిబాబుతో ఛాలెంజ్ చేసి నరేష్ గ్రామంలోనే తన కంపెనీ బ్రాంచ్ స్థాపించాడు.ఇప్పుడు ఫిర్ షురూ పాట మొదలయ్యింది.
Date & Time : 02: 30 AM May 09, 2019
-
నరేష్ తన గ్రామంలో భూ సేకరణ కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడు జగపతి బాబు(వివేక్ మిట్టల్) భారతదేశంలో ప్రముఖ కార్పొరేట్ కింగ్ గా పరిచయం చేయబడ్డాడు.
Date & Time : 02: 20 AM May 09, 2019
-
ఇంటర్వెల్ అనంతరం రిషి ఇండియా లో అడుగు పెట్టాడు.ఇప్పుడు గోదావరి జిల్లాలోని రామవరం అనే గ్రామానికి వెళ్తున్నాడు.
Date & Time : 02: 12 AM May 09, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా సగం పూర్తయ్యే సరికి కథనం చాలా బాగుంది.అలాగే కథానుసారం వచ్చే మహేష్ కామెడీ టైమింగ్ మరియు వింటేజ్ మహేష్ లుక్స్ అభిమానులకు మరియు ప్రేక్షకులకు చాలా బాగా అనిపిస్తాయి.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Date & Time : 02: 06 AM May 09, 2019
-
రిషి తన సీఈఓ పదవిని వదిలి భారతదేశానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇప్పుడు రిషి జర్నీ మొదలయిందని చెప్పొచ్చు. ఇప్పుడు విరామం.
Date & Time : 02: 03 AM May 09, 2019
-
ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు పూర్తయ్యింది.అసలు నరేష్ పాత్ర వెనుకున్న సస్పెన్స్ ఏమిటో "నువ్వని" అనే ఒక స్పెషల్ సాంగ్ బ్యాక్ డ్రాప్ తో వీడింది.
Date & Time : 01: 55 AM May 09, 2019
-
ఎన్నో ఆశలతో రిషి యూఎస్ లో అడుగు పెట్టాడు.ఇప్పుడే చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 01: 50 AM May 09, 2019
-
ప్రతీ ఒక్కరు తమ కాలేజ్ లైఫ్ ని పూర్తి చేసేసుకున్నారు.అలాగే రిషి కూడా తన లైఫ్ లో సక్సెస్ అయ్యేందుకు అడుగులు వేస్తున్నాడు.
Date & Time : 01: 41 AM May 09, 2019
-
ఇప్పుడు రిషి పూజా కుటుంబాన్ని కాస్త విచిత్రంగా కలుసుకున్నాడు.ఇప్పుడు ఎవరెస్ట్ అంచున పాట మొదలయ్యింది.
Date & Time : 01: 30 AM May 09, 2019
-
ఇప్పుడు మహేష్ మరియు ముఖేష్ రిషి మనుషుల మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది.మహేష్ కాలేజ్ ఎపిసోడ్స్ లో చాలా ఫిట్ గా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు.
Date & Time : 01: 25 AM May 09, 2019
-
ఇప్పుడు మహేష్, పూజ మరియు నరేష్ ల మధ్య ఫ్రెండ్ షిప్ ను చిత్రీకరిస్తూ చోటి చోటి బాతే పాట వస్తుంది.
Date & Time : 01: 15 AM May 09, 2019
-
ఇప్పుడే హీరోయిన్ పూజా హెగ్డే చిన్న ఫన్నీ సన్నివేశం ద్వారా పరిచయం అయ్యింది.ఇప్పుడు రిషి మరియు రవిల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 01: 08 AM May 09, 2019
-
టీజర్ లో చూపించిన పవర్ ఫుల్ సీన్ "సక్సెస్ ఈజ్ ఏ జర్నీ" అంటూ రిషి ఇచ్చిన స్పీచ్ అనంతరం,ఒక గ్రామానికి చెందిన పేద విద్యార్థిగా అల్లరి నరేష్(రవి) ఎంట్రీ ఇచ్చారు.నటుడు తనికెళ్ళ భరణి రవి తండ్రిగా పరిచయం అయ్యారు.
Date & Time : 01: 00 AM May 09, 2019
-
ఇప్పుడు కొన్ని కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.ప్రకాష్ రాజ్ మరియు జయసుధలు రిషి తల్లి తండ్రులుగా పరిచయం అయ్యారు.
Date & Time : 12: 55 AM May 09, 2019
-
ఇప్పుడు కథ మళ్ళీ ప్రస్తుతానికి చేరుకుంది.రిషి కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కలిసి అతనికి ఒక సర్ప్రైజ్ విజిట్ ఇచ్చారు.ఇప్పుడు రిషి కాలేజ్ టైమ్ ఫ్లాష్ బ్యాక్ కు సినిమా షిఫ్ట్ అయ్యింది.అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన గడ్డం లుక్ తో మహేష్ కనిపిస్తున్నారు.
Date & Time : 12: 50 AM May 09, 2019
-
ఇప్పుడు నటి ఝాన్సీ, రిషి నుంచి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు.ఇప్పుడు రిషి తాలూకా చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది.
Date & Time : 12: 43 AM May 09, 2019
-
బ్యాక్గ్రౌండ్ లో "నువ్వే సమస్తం" సాంగ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ప్రముఖ వ్యాపార వేత్తగా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మహేష్ రాకతో ఆడిటోరియం అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Date & Time : 12: 38 AM May 09, 2019
-
హాయ్..178 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది..
Date & Time : 12: 32 AM May 09, 2019