మొదటి షో వివరాలు : మా ఇంటి బంగారం
ఒక చక్కటి పాయింట్ తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
సమంత, ఆమె కుటుంబ సభ్యులుకు సంబంధించిన ఒక ఎమోషనల్ సీన్ తర్వాత సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటుంది.
సమంత పై పగ తీసుకునేందుకు గుల్షన్ దేవయ్య ప్రయత్నిస్తాడు. తన కుటుంబానికి తన గతం ఎక్కడ తెలుస్తుందో అని సామ్ ఆందోళన చెందుతుంది.
సమంత ఒక క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుంటుంది. ఇప్పుడు కథలో టెన్షన్ మొదలైంది.
'తస్సదియ్య' పాటతో సెకండ్ హాఫ్ మొదలైంది. స్క్రీన్ పై ఈ సాంగ్ నీట్ గా ఉంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సాధారణ కథ అయినా సినిమా ఇప్పటివరకు ఎంగేజింగ్ గా సాగింది. సమంత తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
సమంత - గుల్షన్ దేవయ్య మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో సినిమా సగానికి చేరుకుంది.
సమంత తన గతం గురించి చెబుతుంది. ఆమెతో పాటు గుల్షన్ దేవయ్యకి సంబంధించిన కొన్ని సీన్స్ వస్తున్నాయి.
ఆడవాళ్లు ఇన్వాల్వ్ అయిన కార్ ఛేజ్ సీక్వెన్స్ నవ్వులు పూయిస్తుంది.
తన మెట్టింటి వారిని ఆకట్టుకునేందుకు సమంత ప్రయత్నిస్తుంది. 'ముత్యాలముగ్గు' రీమిక్స్ సాంగ్ బాగుంది.
గుల్షన్ దేవయ్య పరిచయం అయ్యాడు. ఇప్పుడు సమంత అత్తారింట్లో కొన్ని ఫన్ సీన్స్ వస్తున్నాయి.
చిత్తూరు నేపథ్యంలో కథ మొదలవుతుంది. సమంత ఒక సింపుల్ ఎంట్రీ ఇస్తుంది.
హాయ్..2 గంటల 34 నిముషాలు నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.