-
ఒక సర్ప్రైజ్ ప్రకటనతో సినిమా ముగుస్తుంది. మ్యాడ్ స్క్వేర్ పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 10:40 AM Mar 28, 2025
-
కథలో ఓ చిన్న ట్విస్ట్ వస్తుంది. ఇక క్యామియో పాత్రకి సంబంధించిన డెన్ లో లీడ్ పాత్రలతో ఓ కామెడీ ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 10:35 AM Mar 28, 2025
-
మరికొన్ని ఫన్నీ సీన్స్ తర్వాత, మోస్ట్ అవైటెడ్ సాంగ్ 'జామ చెట్టుకు కాస్తాయి జామ కాయలు' వస్తుంది. స్వాతి రెడ్డి గా రెబా మోనికా జాన్ బాగుంది.
Date & Time : 10:20 AM Mar 28, 2025
-
లడ్డు తండ్రిని మాఫియా డాన్ (క్యామియో) నుండి కాపాడేందుకు, గ్యాంగ్ అందరూ ఒక వ్యభిచార గృహంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:05 AM Mar 28, 2025
-
క్యామియో పాత్ర లడ్డు అండ్ గ్యాంగ్ ని కిడ్నాప్ చేయడంతో సెకండ్ హాఫ్ మొదలైంది. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:50 AM Mar 28, 2025
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా డీసెంట్ గా సాగింది. ప్రతి ఒక్కరు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ఫన్ డైలాగులు నవ్విస్తాయి. కానీ కథలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:30 AM Mar 28, 2025
-
ప్రియాంక జవాల్కర్ ఉన్న ఓ పాట అనంతరం ఈ గ్రూప్ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఇప్పుడు ఓ క్యామియో పాత్ర ఎంట్రీ తో ఇంటర్వెల్ కార్డ్ పడింది.
Date & Time : 09:25 AM Mar 28, 2025
-
లీడ్ పాత్రలతో వస్తున్న కామెడీ సీన్స్ నవ్విస్తున్నాయి. ఇప్పుడు సత్యం రాజేష్ మ్యూజియం దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు.
Date & Time : 09:15 AM Mar 28, 2025
-
కథలో ఓ షాకింగ్ ట్విస్ట్ మరింత ఫన్నీ సీన్స్ కు దారి తీస్తుంది. నలుగురు కలిసి గోవా వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. దీనికి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:00 AM Mar 28, 2025
-
కొన్ని ఫన్నీ సీన్స్ తర్వాత లడ్డు పై ఒక పాట వస్తుంది. ఈ పాట మాస్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంది. గ్యాంగ్ అందరూ ఈ పాటలో కనిసపిస్తున్నారు.
Date & Time : 08:50 AM Mar 28, 2025
-
ఇప్పుడు లడ్డు పెళ్ళికి సమయం వచ్చింది. అతడి ముగ్గురు స్నేహితులు కూడా వచ్చేసారు. వీరికి సంబంధించి కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 08:40 AM Mar 28, 2025
-
తను జైల్ కి రావడానికి గల ఫ్లాష్ బ్యాక్ ని లడ్డు చెబుతున్నాడు. మనోజ్(రామ్ నితిన్), అశోక్(నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) పరిచయం అయ్యారు.
Date & Time : 08:20 AM Mar 28, 2025
-
హాయ్.. 2 గంటల 7 నిముషాలు నిడివి గల 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:10 AM Mar 28, 2025