-
-
ఫ్రెండ్స్ సహాయంతో రాజ్ తరుణ్ హీరోయిన్ రిద్దిని విలన్ స్థావరం నుంచి చాలా తెలివిగా రక్షిస్తాడు. సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 08:40 AM July 20, 2018
-
ఈ సినిమా క్లైయిమాక్స్ కు చేరుకుంటోంది. రాజ్ తరుణ్ హీరోయిన్ ని కాపాడటానికి తన ప్లాన్స్ ను అమలు చేస్తున్నాడు.
Date & Time : 08:30 AM July 20, 2018
-
విలన్ గ్యాంగ్ హీరోయిన్ రిద్ది ని కిడ్నాప్ చేయగా రాజ్ తరుణ్ ఆమె కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు ఎమోషనల్ సాంగ్ ఏ వైపుగా నా చూపు సాగాలి వస్తోంది.
Date & Time : 08:20 AM July 20, 2018
-
విలన్ గ్యాంగ్ హీరోయిన్ ని ఎందుకు వెతుకుతున్నారు అనే అంశం బహిర్గతమయ్యింది. సుబ్బరాజు గ్యాంగ్ నుంచి రిద్దిని కాపాడటానికి రాజీవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Date & Time : 08:14 AM July 20, 2018
-
సుబ్బరాజ్ మరియు అతని గ్యాంగ్ హీరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. యువ జంటను కాపాడటానికి రాజీవ్ ఒక మెషిన్ లో ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:05 AM July 20, 2018
-
కొన్ని క్యూట్ సన్నివేశాల తరువాత ప్రధాన జంట మధ్య అద్భుతం అనే సాంగ్ వస్తోంది. కేరళలోని న్యాచురల్ లొకేషన్స్ లో సాంగ్ ని చిత్రీకరించారు.
Date & Time : 07:58 AM July 20, 2018
-
ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఒక అందమైన నగరం అలప్పుజ కి షిఫ్ట్ అయ్యింది (హీరోయిన్ యొక్క స్వస్థలం). రోహిణి హీరోయిన్ తల్లిగా సన్నివేశంలోకి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 07:51 AM July 20, 2018
-
ఇంటర్వెల్ అనంతరం రాజ్ తరుణ్ అండ్ రిద్ది వారిపై ఎటాక్ చేసే పర్సన్స్ ని కనుగోనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Date & Time : 07:46 AM July 20, 2018
-
ఆసక్తికరమైన సన్నివేశంతో సినిమా సగానికి పూర్తయ్యింది. ఇప్పుడు ఇంటర్వెల్
Date & Time : 07:40 AM July 20, 2018
-
కొన్ని ప్రయత్నాల తరువాత ఫైనల్ గా రాజ్ తరుణ్ లవ్ ని రిద్ది ఒకే చేసింది. ఇప్పుడు సూపర్ హిట్ లవ్ ట్రాక్ అంతే కదా మరి వస్తోంది.
Date & Time : 07:30 AM July 20, 2018
-
సత్య రాజేష్ కూడా హీరో యొక్క స్నేహితునిగా ఎంట్రీ ఇచ్చాడు.. హీరోయిన్ కు తన ప్రేమను తెలియజేయడానికి రాజ్ తరుణ్.. రాజేష్ సహాయం తీసుకుంటాడు.
Date & Time : 07:22 AM July 20, 2018
-
ప్రముఖ నటీనటులు రాజా రవీంద్ర జీవ అవినీతికర వైద్యులుగా పరిచయమయ్యారు. హీరోయిన్ రిద్దికి మరియు వారికి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:17 AM July 20, 2018
-
రాజ్ తరుణ్ హీరోయిన్ రిద్దిని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ ప్రాసెస్ లో మంచి ఆహ్లాదకరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:10 AM July 20, 2018
-
రాజ్ తరుణ్ చిత్తూరు యాసను ట్రై చేస్తున్నాడు. అతను హాస్పిటల్ లో హీరోయిన్ ను మొదటిసారి చూడగానే పడిపోయాడు. ఇప్పుడు సెకండ్ సాంగ్ నాలో చిలిపి కల వస్తోంది.
Date & Time : 07:05 AM July 20, 2018
-
హీరోయిన్ రిద్ది కుమార్ ఒక హాస్పిటల్ నర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆమె చాలా అందంగా కనిపిస్తోంది.
Date & Time : 06:55 AM July 20, 2018
-
కొన్ని పరిచయ సన్నివేశాల తరువాత మొదటి సాంగ్ రాముని బాణంలా.. వస్తోంది.
Date & Time : 06:49 AM July 20, 2018
-
రాజీవ్ కనకాల మరియు సుబ్బరాజ్ వీధి రౌడీలుగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజ్ తరుణ్ బైక్ బిల్డర్ గా పరిచయమయ్యాడు. అతను రాజీవ్ ను ఒక బ్రదర్ లా గౌరవిస్తాడు.
Date & Time : 06:43 AM July 20, 2018
-
రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్ తో సినిమా కథ స్టార్ట్ అయ్యింది. ఆరు నెలల క్రితం జరిగిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:39 AM July 20, 2018
-
హాయ్..130 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 06:35 AM July 20, 2018