మొదటి షో వివరాలు : లెనిన్
సినిమా ముగిసింది. లెనిన్ పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
ఒక పెద్ద ట్విస్ట్ తో సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది. తనవారి పై అఖిల్ ప్రతీకారం తీర్చుకుంటాడు.
తనవారే తన పై చేసిన ప్రతి ప్లాన్ గురించి అఖిల్ తెలుసుకుంటాడు. భాగ్యశ్రీ కోసం వారందరిని అఖిల్ ఎదురిస్తాడు.
లెనిన్, అతని ఫ్రెండ్ పై మరోసారి దాడి జరుగుతుంది. అటుపై వచ్చే ఓ ట్విస్ట్ తో కథలో ఓ పాత్ర నెగిటివ్ షేడ్స్ లోకి మారుతుంది.
ఫస్ట్ హాఫ్ ఎక్కడ ముగిసిందో సెకండ్ హాఫ్ అక్కడ్నుంచి మొదలైంది.తమపై దాడి చేసింది ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు అఖిల్ ప్రయత్నం చేస్తుంటాడు.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : లెనిన్ పాత్రలో అఖిల్ డీసెంట్ గా ఉన్నాడు. భాగ్యశ్రీ తన పాత్రలో ఒదిగిపోయింది. వారి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ తర్వాత కథ ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. అఖిల్, అతని ఫ్రెండ్ పై దాడి జరుగుతుంది. ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఇంటర్వెల్ వస్తుంది.
భారతం మిట్ట వేడుక జరుగుతుంది. అంతా సవ్యంగా ఉందని అందరూ అనుకుంటున్న వేళ ఒక ఊహించని ట్విస్ట్ అందరినీ షాక్ లో పడేస్తుంది.
అఖిల్, భాగ్యశ్రీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఒక ఘటన భాగ్యశ్రీ ని చిక్కుల్లో పడేస్తుంది. దీంతో కథ సీరియస్ గా మారుతుంది. అఖిల్ ఇక యాక్షన్ మోడ్ లోకి మారుతాడు.
అఖిల్ ఇంట్రో తర్వాత కొన్ని సీన్స్ వస్తున్నాయి. ఫస్ట్ సాంగ్ తర్వాత భాగ్యశ్రీ పరిచయం అయింది. ఇప్పుడు వారి మధ్య రొమాన్స్ మొదలైంది.
జూ. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో శ్రీరామపురం నేపథ్యం పరిచయం చేస్తారు. కథ 2001 సమయంలో జరుగుతుంది.
హాయ్.. 158 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.