-
-
ఎమోషనల్ గా సాగుతూ సినిమా క్లైమాక్స్ పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:05 AM March 29, 2019
-
తనకి జరిగిన వెన్నుపోటు బాధను తట్టుకోలేక ఎన్టీఆర్ చనిపోతారు.ఇప్పుడు నిజమైన ఎన్టీఆర్ పార్థివదేహాన్ని చూపిస్తూ కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:55 AM March 29, 2019
-
ఇప్పుడు దగా వెన్నుపోటు పాట వస్తుంది.అసెంబ్లీ నుంచి కూడా మెజార్టీ చంద్రబాబుకే దక్కడంతో బాబు సీఎం గా అధికారం చేపట్టారు.
Date & Time : 06:42 AM March 29, 2019
-
చంద్రబాబు వెనుకున్న ఇద్దరు ముఖ్య వ్యక్తులుగా అశోక్ గజపతిరాజు మరియు దేవేందర్ గౌడ్ లను చూపిస్తున్నారు.ఇప్పుడు ఈ సినిమాలో అత్యంత కీలక ఘట్టమైనటువంటి వైస్రాయ్ ఎపిసోడ్ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:32 AM March 29, 2019
-
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను భయపెట్టి వారి సంపూర్ణ మద్దతుతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
Date & Time : 06:26 AM March 29, 2019
-
ఇప్పుడు అసలైన ఘట్టం వెన్నుపోటుకి ప్లాన్ సిద్ధమవుతుంది.చంద్రబాబు ఒక వార్తా పత్రిక యజమానితో కలిసి పార్వతిని దిగజార్చడానికి ప్లాన్ చేస్తూ పార్టీని తన చేతుల్లోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Date & Time : 06:17 AM March 29, 2019
-
94 ఎన్నికల్లో పార్టీ గెలిచింది.ఎన్టీఆర్ తన పార్టీ సభ్యులతో కలిసి విజయాన్ని పంచుకుంటున్నారు.వీరి విజయాన్ని ప్రతిబింబిస్తూ బ్యాక్గ్రౌండ్ లో విజయం పాట వస్తుంది.
Date & Time : 06:12 AM March 29, 2019
-
లక్ష్మీ పార్వతి వస్తున్న నెగిటివ్ ప్రచారం అంతటి వెనుక ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఒక్కరే ఉన్న విధంగా సన్నివేశాలు వస్తున్నాయి.1994 ఎన్నికల కోసం ఎన్టీఆర్ పార్టీ టిక్కెట్లను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసారు.దానికి అనుగుణంగా గర్జన పాట వస్తుంది.
Date & Time : 06:06 AM March 29, 2019
-
ఇంటర్వెల్ అనంతరం ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసేసుకున్నారు.ఇప్పుడు ఇద్దరి మధ్య మంచి ఫామిలీ సాంగ్ వస్తుంది.
Date & Time : 05:58 AM March 29, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : మొత్తానికి చూసుకున్నట్టయితే డీసెంట్ కథనంతో ఫస్టాఫ్ ఓకే అని చెప్పొచ్చు.కాకపోతే సినిమా అక్కడక్కడా గాడి తప్పుతున్న భావన కలుగుతుంది.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Date & Time : 05:52 AM March 29, 2019
-
మేజర్ చంద్రకాంత్ సక్సెస్ మీట్ లో తాను లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించేసారు.ఇప్పుడు విరామం.
Date & Time : 05:48 AM March 29, 2019
-
ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నానన్న విషయాన్ని తన కుటుంబంతో చెప్పారు.కానీ కుటుంబ సభ్యులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు.
Date & Time : 05:30 AM March 29, 2019
-
ఎన్టీఆర్ మరియు లక్ష్మీ పార్వతి మధ్య ఉన్న బంధాన్ని ప్రతిబింబిస్తూ నీ ఉనికి పాట వస్తుంది.
Date & Time : 05:17 AM March 29, 2019
-
వార్తా పత్రికలూ మరియు పార్టీలో పుకార్లు మొదలయ్యాయి.పార్వతి ఎన్టీఆర్ ఇంట్లో ఉంటుండడం పట్ల కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరుగుతుంది.
Date & Time : 05:12 AM March 29, 2019
-
ఎన్టీఆర్ ను మరో సినిమా చెయ్యాలని కోరుతూ మోహన్ బాబు పాత్ర ఇప్పుడే ఎంట్రీ అయ్యింది.ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ మీటింగ్ జరుగుతుండగా చంద్రబాబు నాయుడు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 05:05 AM March 29, 2019
-
ఇప్పుడు గెలుపు ఓటమి పాట వస్తుంది.ఎన్టీఆర్ మరియు లక్ష్మీల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:53 AM March 29, 2019
-
ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు అడగడానికి ఆయన ఇంట్లోకి అడుగుపెట్టారు.
Date & Time : 04:46 AM March 29, 2019
-
ఇప్పుడు బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ జీవితానికి సంబందించిన ఫొటోలతో టైటిల్స్ వస్తున్నాయి.
Date & Time : 04:40 AM March 29, 2019
-
హాయ్..151 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:38 AM March 29, 2019
-
ముఖ్య గమనిక : ఇప్పుడు మేము మీకు అందిస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో" అప్డేట్స్ యూ ఎస్ ప్రీమియర్స్ నుంచి ఇస్తున్నాం ఇది గమనించగలరు.
Date & Time : 04:35 AM March 29, 2019