-
ఒక ఊహించని ట్విస్ట్ తో కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:00 PM March 27, 2025
-
ఫైట్ సీన్ తర్వాత ఇపుడు ఖురేషి లైఫ్ లో మరో ప్రమాదం ఎదురైన సన్నివేశాలతో ఎల్3 అనౌన్స్ అయ్యింది. ఈ బ్యాక్ స్టోరీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:45 AM March 27, 2025
-
ఖురేషి ఇపుడు జయేద్ మసూద్ (పృథ్వీ రాజ్ సుకుమారన్) ని కలిసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వచ్చాయి. ఈ తర్వాత ఓ ఇంటెన్స్ వార్నింగ్ సీన్ వస్తుంది.
Date & Time : 11:30 AM March 27, 2025
-
కొన్ని కీలక సన్నివేశాలు తర్వాత సీఎం జతిన్, మోహన్ లాల్ మొదటిసారి కలుస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:15 AM March 27, 2025
-
ఇప్పుడు ప్రియదర్శిని పై అటాక్ జరగడంతో ఖురేషి ఆమెని కాపాడేందుకు రంగం లోకి దిగారు. ఇప్పుడు ఖురేషి ఆ బాంబ్ బ్లాస్ట్ లో ఎలా తప్పించుకున్నారు అనేది చూపిస్తున్నారు.
Date & Time : 11:00 AM March 27, 2025
-
ఇంటర్వెల్ అనంతరం.. కేరళలో కొన్ని పొలిటికల్ సీన్స్ తో కథనం మొదలైంది. ప్రియదర్శినిని జతిన్ కీలక పార్టీ మీటింగ్ కి రాకూడదు అని వార్నింగ్ ఇస్తున్నాడు.
Date & Time : 10:40 AM March 27, 2025
-
ఫస్టాఫ్ అప్డేట్:
ఇప్పుడు వరకు ఓకే రేంజ్ లో ఉంది. మంచి విజువల్స్, ఎలివేషన్స్ బాగున్నాయి. కథనం కొంచెం స్లోగా ఉంది కాని మోహన్ లాల్ ఛార్మింగ్ గా ఉన్నారు. కొన్ని సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:30 AM March 27, 2025
-
ఖురేషి ఇపుడు ఒక డ్రగ్ డీలర్ ని కలిసి డీలింగ్ చేస్తున్నారు. ఒక భారీ బ్లాస్ట్ ఇక్కడ జరిగింది. ఇపుడు ఖురేషికి ఏం జరిగింది అనే సస్పెన్స్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:20 AM March 27, 2025
-
ఇపుడు గోవర్ధన్ (ఇంద్రజిత్ సుకుమారన్) ఖురేషీని కలవాలని అనుకుంటున్నాడు. ఆ అరేంజ్మెంట్స్ కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:05 AM March 27, 2025
-
మోహన్ లాల్ గ్రాండ్ ఎంట్రీ తర్వాత కొన్ని ఇంటెన్స్ సీన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 09:50 AM March 27, 2025
-
ఇప్పుడు సీఎం జతిన్ రామ్ దాస్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అభిమన్యు సింగ్ పై కొన్ని సన్నివేశాలు తర్వాత ఇపుడు ఖురేషి ఆగమనంకి సమయం ఆసన్నమైంది.
Date & Time : 09:35 AM March 27, 2025
-
ఇపుడు కథ కేరళకు షిఫ్ట్ అయ్యింది. మంజు వారియర్ ఇపుడు ఎంటర్ అయ్యారు.
Date & Time : 09:25 AM March 27, 2025
-
భారతదేశంలోని ఒక హవేలీలో మత అల్లర్లు చెలరేగాయి, బలరాజ్ భాయ్ (అభిమన్యు సింగ్) నేతృత్వంలోని హిందూ ప్రజలు ముస్లింలను చంపుతున్నారు. ఈ ఊచకోతకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:10 AM March 27, 2025
-
ఇరాక్ లో ఒక బ్లాస్ట్ తో ఖురేషి అబ్రమ్ (మోహన్ లాల్) పై ఇంట్రడక్షన్ తర్వాత సినిమా టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి.
Date & Time : 09:00 AM March 27, 2025
-
హాయ్.. 179 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:45 AM March 27, 2025