
మొదటి షో వివరాలు : కుబేర
ఒక పాజిటివ్ నోట్ తో సినిమా పూర్తయ్యింది. మొత్తం రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
జిమ్ సర్బ్ నుంచి ధనుష్ ఒక ఊహించని డిమాండ్ కోరాడు. దీనితో జిమ్ షాకయ్యాడు. ఇలా గ్రిప్పింగ్ సన్నివేశాలతో పవర్ఫుల్ క్లైమాక్స్ కి రంగం సిద్ధం చేస్తుంది.
ఫైనల్ గా ధనుష్, నాగ్ ఒకరినొకరు ఎదురయ్యారు. ఇప్పుడు మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనితో పరిస్థితి మరింత హీటెక్కించేలా మారింది. అలాగే సాలిడ్ ఎమోషన్స్ తో సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ తర్వాత హిట్ సాంగ్ పోయిరా మామ సాంగ్ మొదలైంది. ధనుష్ ఎనర్జిటిక్ మూమెంట్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు కథనం మరింత ఆసక్తిగా మారుతుంది.
ఇప్పుడు నటుడు పోలీస్ పాత్రలో సాయాజీ షిండే ధనుష్ పరిస్థితి అర్ధం చేసుకున్నారు. ధనుష్, నాగ్ అసలు తనని ఎందుకు తాను తన మనుషులు వెంటాడుతున్నారు అనేది కనుక్కుంటున్నాడు. ఇంట్రెస్టింగ్ సీన్స్ కొనసాగుతున్నాయి
ఇప్పుడు రష్మిక అసలు ధనుష్ ఎవరో తెలుసుకోవాలి అని ఆతృతగా ఉంది. ఇంకోపక్క నాగ్ పై ధనుష్ ని వెతికే పనిలో ఒత్తిడి పెరుగుతుంది.
ఇంటర్వెల్ అనంతరం.. రష్మిక, ధనుష్ లపై సన్నివేశాలతో సెకండాఫ్ మొదలైంది. ఇంకోపక్క నాగార్జున మనుషులు ధనుష్ కోసం వెతుకుతున్నారు.
ధనుష్ అమోఘమైన నటనతో ఫస్టాఫ్ డీసెంట్ గా సాగింది. తన పాత్రలో ధనుష్ ఒదిగిపోయాడు. నాగ్ కూడా తన పాత్రలో సాలిడ్ గా కనిపించారు. కథ కూడా నీట్ గా వెళ్ళింది కానీ సెకండాఫ్ లోనే అసలు విషయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఇదెలా ఉంటుందో చూడాలి.
ధనుష్ ఇప్పుడు నెమ్మదిగా నిజం తెలుసుకుని విలన్ గ్యాంగ్ ని మ్యానేజ్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడితో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
ధనుష్, రష్మిక నడుమ కొన్ని సీన్స్ తర్వాత నాగ్, తన టీం ఒక ఊహించని టర్న్ తో కొంచెం టెన్షన్ లో ఉన్నారు. మరో పక్క లీడ్ జంట నడుమ మరిన్ని సన్నివేశాలు కొనసాగుతున్నాయి
ఒక ఊహించని ట్విస్ట్ తో కథనం మలుపు తిరిగిన తర్వాత కథనం మరింత ఇంటెన్స్ గా మారింది. వీటి తర్వాత రష్మిక ఒక సింపుల్ ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడు భిక్షాటన చేసేవారిపై కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి. ప్రతీ అంశం మరింత డెప్త్ గా తీసుకెళ్తుంది. ధనుష్ తన పెర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఇప్పుడు ధనుష్ ని సహా మరో ముగ్గురు బిచ్చగాళ్ళని ఓ గుంపు ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ధనుష్, ఇంకా ఆ ముగ్గురిపై ఫ్లాష్ బ్యాక్ వస్తుంది.
జిమ్ మిషన్ కోసం నాగ్ ఒక సాలిడ్ ప్లాన్ ని చేశారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎంట్రీతో పవర్ఫుల్ అవతార్ లో ధనుష్ ఎంట్రీ వచ్చింది. ఇది సర్ప్రైజింగ్ గా ఉంది.
ఒక నిజాయితీ గల సీబీఐ అధికారిగా కింగ్ నాగార్జున ఇప్పుడు పరిచయం అయ్యారు. జిమ్ సర్బ్ తో కలిపి నాగ్ పై పలు కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
ఇండియాలోనే అత్యంత స్వచ్ఛమైన చమురు రిజర్వాయిర్ కనుగొనబడింది. అత్యంత ధనిక బిజినెస్ మెన్ అయ్యిన జిమ్ సర్బ్ ఒక ప్లాన్ గీస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
హాయ్.. 3 గంటల 15 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.