మొదటి షో వివరాలు : కొరియన్ కనకరాజు
సీక్వెల్కు లీడ్ ఇస్తూ సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
కథలో ఓ కీలక ట్విస్ట్ రివీల్ అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, వరుణ్ తేజ్, రితిక లపై ఓ ముఖ్యమైన సీన్ వస్తుంది.
తమ సమస్యకు సంబంధించి లీడ్ పెయిర్ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత దాని నుంచి బయటపడేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్, అతని గ్యాంగ్ ఓ సమస్యలో చిక్కుకుంటారు. ఆ సమస్య నుంచి బయట పడేందుకు వారు ప్రయత్నిస్తుంటారు.
కొరియన్ ఆత్మకు సంబంధించిన నేపథ్యం రివీల్ అవుతుంది. ఇప్పుడు కథలోకి బుల్లిరాజు ఎంట్రీ ఇస్తాడు.
ఒక ఇంటెన్స్ ఫైట్ మరియు ఒక కీలక ట్విస్ట్తో సినిమా సగానికి చేరుకుంది.
హీరోను ఆత్మ ఆవహించిందనే విషయం సత్య తెలుసుకుంటాడు. దీనికి పరిష్కారం కోసం ఆయన ప్రయత్నిస్తుంటాడు
కథలో కీలకమైన సన్నివేశం వస్తుంది. వరుణ్ తేజ్ను ఓ కొరియన్ ఆత్మ ఆవహిస్తుంది. ఈ ఎపిసోడ్ చాలా చక్కగా ప్రెజంట్ చేశారు.
వరుణ్ తేజ్, సత్య, ఒక కొరియన్ నటుడిపై కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
హీరోయిన్ రితిక నాయక్ పరిచయం అవుతుంది. కియా ప్లాంట్లో ఆమె ఉద్యోగం చేస్తుంటుంది.
కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు దక్ష నాగర్కర్తో ‘రాస గుమ్మడి’ సాంగ్ వస్తుంది.
కథ కొరియాలో ప్రారంభమై వెంటనే అనంతపూర్లోని కియా ప్లాంట్కు షిఫ్ట్ అవుతుంది.
హాయ్.. 2 గంటల 45 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.