-
జి.వి.ప్రకాష్ కుమార్ నిర్విరామంగా పోరాడి సవాళ్లను పరిష్కరించడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
Date & Time : 01:12 AM March 07, 2025
-
గతం తాలుక వాస్తవాలను జి.వి.ప్రకాష్ కుమార్ కనుగొంటాడు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలాంటి సమస్యనైనా ఎదురించాలని అతను నిశ్చయించుకుంటాడు.
Date & Time : 12:45 AM March 07, 2025
-
సముద్రంలో ఒక తెలియని ప్రదేశంలోకి ఓడ కొట్టుకుపోతుంది. అక్కడ వింత సంఘటనలు ఎదురవుతాయి. ఏదో తెలియని శక్తి తమను వెంటాడుతోందని గ్రహించి, అందరూ భయబ్రాంతులకు లోనవుతారు.
Date & Time : 12:30 AM March 07, 2025
-
హీరో, అతని స్నేహితులు సముద్రంలో ప్రయాణం ప్రారంభిడంతో సెకండాఫ్ మొదలైంది. కొంతసేపటికే వారు కొన్ని అసహజమైన ఘటనలను ఎదుర్కొంటారు.
Date & Time : 12:09 AM March 07, 2025
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ :
ఇప్పటివరకు కథ అంచనాలను అందుకోవడంలో వెనకబడింది. కథ సాగదీసినట్లుగా కనిపిస్తుంది. జి.వి.ప్రకాష్ కుమార్ పర్ఫార్మెన్స్ డీసెంట్‌గా ఉంది. మిగతా వారు పర్వాలేదు. సెకండాఫ్‌లోని కథ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 11:52 PM March 06, 2025
-
కొన్ని ఆసక్తికర సన్నివేశాల తర్వాత హీరో తన సొంత ఊరికి వెళ్లేందుకు సముద్రంపై ప్రయాణిస్తాడు. కథ ఇప్పుడు ఇంటర్వెల్‌కు చేరుకుంటుంది
Date & Time : 11:45 PM March 06, 2025
-
జి.వి.ప్రకాష్ స్మగ్లింగ్ వెనుక కారణాలు తెలుసుకుని, నాయకత్వ బాధ్యతలను తెలుసుకుంటాడు. కథ ఇప్పుడు 1982కి షిఫ్ట్ అవుతుంది.
Date & Time : 11:25 PM March 06, 2025
-
హీరో, అతడి గ్యాంగ్ సముద్రంపై స్మగ్లింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని సీన్స్ నడుస్తున్నాయి.
Date & Time : 11:10 PM March 06, 2025
-
తమిళనాడు లోని తూవతూర్ ప్రాంతంలో మత్స్యకారులు ఓ దుష్టశక్తి కారణంగా మరణిస్తారు. వారికి సంబంధించిన కొన్ని సీన్స్ వస్తుండగా.. కథ ప్రస్తుత కాలానికి షిఫ్ట్ అవుతుంది.. జి.వి.ప్రకాష్ కుమార్ ఎంట్రీ ఇస్తాడు.
Date & Time : 10:47 PM March 06, 2025
-
హాయ్.. ‘కింగ్స్టన్’ మూవీ లైవ్ అప్డేట్స్ మీ కోైసం.. 2 గంటల 21 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:37 PM March 06, 2025