-
-
కథలో ఉన్న అన్ని మ్యాజిక్స్ కి సంతృప్తికరమైన లాజిక్స్ తో ఆన్సర్ ఇవ్వడంతో సినిమా ముగిసింది. 'కిల్లర్' మూవీ పూర్తి రివ్యూ కొరకు చూస్తూ ఉండండి.
Date & Time : 12:48 PM June 07, 2019
-
కథలో అసలు మలుపు ఏమిటో క్లైమాక్స్ లో బయటపడింది. దర్శకుడు తెలివిగా తెరకెక్కించిన పతాకసన్నివేశాలు ప్రేక్షకుడ్ని ఇంప్రెస్ చేస్తాయి.
Date & Time : 12:41 PM June 07, 2019
-
ఆధారాలన్నీ హీరో విజయ్ కి వ్యతిరేకంగా ఉన్నా, అర్జున్ కి మాత్రం ఎక్కడో పొరపాటు జరిగిందనే అనుమానము వీడటం లేదు. అద్భుతమైన కథనం ప్రేక్షకుడిని తదుపరి సన్నివేశం కోసం ఎదురుచూసేలా చేస్తుంది. సినిమా క్లైమాక్స్ దగ్గర పడుతుందనిపిస్తుంది.
Date & Time : 12:31 PM June 07, 2019
-
హత్యలు జరిగిన సమయాలను, కేసు లోని కీలక ఆధారాలు విజయ్ తన తెలివితేటల తో మాయం చేశాడు. మూవీ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది.
Date & Time : 12:24 PM June 07, 2019
-
సీనియర్ నటుడు నాజర్ ఇప్పుడే రంగ ప్రవేశం చేశారు.ఉత్కంఠగా కథ సాగుతుంది. హీరోయిన్ ఆషిమా చాలా చక్కగా తన పాత్రను పోషిస్తోంది.
Date & Time : 12:21 PM June 07, 2019
-
మర్డర్స్ మిస్టరీ కేసు ఆసక్తికరంగా సాగుతుంది. చివరికి విజయ్ వీటి వెనకున్న అసలు కారణాలు బయటపెడుతున్నాడు. మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
Date & Time : 12:19 PM June 07, 2019
-
విజయ్ మిస్టరీ హత్యల కేసు ను తన ప్రతిభతో పక్కదోవ పట్టిస్తాడు. దీనితో ఈ కేసును డీల్ చేస్తున్న అర్జున్ అయోమయానికి గురయ్యారు.
Date & Time : 12:15 PM June 07, 2019
-
పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ చాలా బాగా చేస్తున్నారు. ఇన్విస్టిగేషన్ సన్నివేశాలలో ఆయన నటనా శైలి బాగుంది. హీరో విజయ్ ,అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న అన్ని సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
Date & Time : 12:07 PM June 07, 2019
-
విరామం తరువాత ఇప్పుడే రెండవ భాగం మొదలయ్యింది. అసలు హీరో విజయ్ అసలు పాత్ర ఏమిటి అనే విషయం తెలియజేసారు. సినిమా కథనం గతంలోకి వెళ్ళింది. విజయ్ పాత్ర తీరు తెలిసేలా ఓ సోలో సాంగ్ వస్తుంది.z
Date & Time : 12:00 PM June 07, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: సస్పెన్స్ మర్డర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన "కిల్లర్" మూవీ చక్కగా తీశారు. పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ యాక్టింగ్ బాగుంది. హత్యలను వెనుక కారణాలు ఛేదించే సన్నివేశాలు బాగా వచ్చాయి. పాటలు బాగున్నప్పటికీ ఆసక్తికరంగా సాగుతున్న కథనంలో ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటి వరకు ప్రేక్షకుడు ఉత్కంఠ ఫీలైయ్యేలా చేయడంలో విజయం సాధించారు. మొదటి సగంలోనే సినిమా అసలు కథ తెలిసిపోవడంతో రెండవ భాగం లో ప్రేక్షకుడిని ఎలా మెప్పిస్తారనేది ఆసక్తికరం.
Date & Time : 11:44 AM June 07, 2019
-
కథలో ఓ ఆసక్తికరమైన మలుపుతో సినిమా మొదటి సగం పూర్తయ్యింది.
Date & Time : 11:39 AM June 07, 2019
-
ఈ మిస్టరీ హత్యల వెనుక కారణం ఏమిటనేది తెలిసింది. సన్నివేశాలు చాలా చక్కగా చిత్రీకరించారు.కాసేపట్లో సినిమా మొదటి భాగం పూర్తవనుంది.
Date & Time : 11:38 AM June 07, 2019
-
హీరో,హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సాంగ్ వస్తుంది, ఈ పాటలో ఆషిమా చాలా గ్లామర్ గా కనిపిస్తుంది.కానీ ఆసక్తికరంగా సాగుతున్న కథనం మధ్యలో పాటలు కొంచం ఇబ్బంది పెడుతున్నాయి.
Date & Time : 11:29 AM June 07, 2019
-
సినిమా ఇప్పడు ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటివరకు జరిగిన హత్యలన్నింటికీ హీరోయిన్ ఆషిమా కు సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. మర్డర్స్ వెనుక అసలు కథ ఏంటనేది తెలిసేలా ఉంది. మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.
Date & Time : 11:20 AM June 07, 2019
-
మరొక హత్యతో మూవీ కొంచెం గందరగోళం గా అనిపిస్తుంది. అసలు కథేంటి అన్న విషయం పై భిన్న ఆలోచనలు కలుగుతున్నాయి. ఈ మిస్టీరియస్ మర్డర్స్ కేసు ని అర్జున్ డీల్ చేస్తున్నారు.
Date & Time : 11:13 AM June 07, 2019
-
ఓ సీక్రెట్ మిషన్ ని లీడ్ చేస్తున్న విజయ్ హీరోయిన్ ఆషిమా ను అనుసరిస్తూ ఉన్నాడు. సన్నివేశాలు కొంచెం సీరియస్ మరియు ఉత్కంఠంగా నడుస్తున్నాయి.
Date & Time : 11:05 AM June 07, 2019
-
సీనియర్ హీరో అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా, హీరో విజయ్ ని హంతకుడిగా ఇద్దరి ముఖ్యపాత్రలను పరిచయం చేశారు. పోలీస్ కస్టడీ లో ఉన్న విజయ్ తన గతాన్ని వాళ్లకు చెప్పడం మొదలుపెట్టాడు. హీరోయిన్ బ్యూటిఫుల్ ఆషిమా ఓ పాట ద్వారా పరిచయం ఐయ్యింది.
Date & Time : 11:00 AM June 07, 2019
-
సినిమా ఆసక్తికరంగా ఓ దారుణమైన హత్యతో మొదలైంది. తెరపై టైటిల్స్ పడుతున్నాయి.
Date & Time : 10:50 AM June 07, 2019
-
విజయ్ ఆంటోని, అర్జున నటించిన 109 నిమిషాల నిడివి గల సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ "కిల్లర్" మూవీ ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:43 AM June 07, 2019