-
మరి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అండ్ ఎమోషనల్ నోట్ తో కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 08:18 AM February 11, 2022
-
ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తో ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 08:04 AM February 11, 2022
-
కథనంలో ఇప్పుడు రవితేజ అసలు ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యింది. ఇది మరో ట్విస్ట్ అని చెప్పొచ్చు.
Date & Time : 08:00 AM February 11, 2022
-
ఇప్పుడు ఇంకో ట్విస్ట్ రివీల్ అయ్యింది. యాక్షన్ బ్లాక్స్ తో సినిమా కథనం సాగుతుంది.
Date & Time : 07:55 AM February 11, 2022
-
ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రవితేజ మరింత క్లారిటీ కనుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
Date & Time : 07:52 AM February 11, 2022
-
ఇప్పుడు రవితేజ మరియు మీనాక్షి ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు మరో హిట్ ట్రాక్ అట్టా సూడకే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:39 AM February 11, 2022
-
ఇప్పుడు జైల్లో ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. దీనిని డిజైన్ చేసిన విధానం బావుంది.
Date & Time : 07:37 AM February 11, 2022
-
మళ్ళీ రవితేజ యాక్షన్ లోకి దిగాడు. ఇప్పుడు తాను ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నట్టుగా సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:17 AM February 11, 2022
-
ఇప్పుడు సినిమాలో కీలక అంశాలపై అర్జున్ మాటల్లో కథనం వినిపిస్తుంది. ఇక తర్వాత మరో సాంగ్ క్యాచ్ మీ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:10 AM February 11, 2022
-
ఇప్పుడు రవితేజపై తన గొడవకు సంబంధించి కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టైటిల్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో రవితేజ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 07:03 AM February 11, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ :
ఇప్పటివరకు సినిమా సో సో గా సాగిందని చెప్పాలి. అక్కడక్కడా కామెడీ బాగానే ఉన్నా మెయిన్ పాయింట్ లోకి సినిమా రావడానికి చాలా టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక్కడ నుంచి సినిమా కీలకంగా మారే అవకాశం ఉంది. మరి అదెలా ఉంటుందో చూడాలి.
Date & Time : 06:58 AM February 11, 2022
-
ఈ అటాక్స్ వల్ల రవితేజ జైలు కి వెళ్ళాడు. మీనాక్షి అతన్ని బయటకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కథనంలో ఓ ట్విస్ట్. ఇప్పుడు విరామం.
Date & Time : 06:52 AM February 11, 2022
-
కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు తర్వాత రవితేజ మరింత సమాచారం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకోపక్క మరికొంత మంది కొత్త విలన్స్ రవితేజ ఫ్యామిలీ జోలికి వెళ్తున్నారు. ఇలా సినిమా ఇంటర్వెల్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 06:45 AM February 11, 2022
-
ఆ సమస్యని రవితేజ సాల్వ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ క్రమంలో ఒక యాక్షన్ సీక్వెన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:27 AM February 11, 2022
-
ఇప్పుడు రవితేజ ఆ బ్లాక్ మనీ సమస్య లోకి ఎంటర్ అయ్యాడు. తనకి మరియు రావు రమేష్ ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:24 AM February 11, 2022
-
ఇప్పుడు బ్లాక్ మనీ ని షిఫ్ట్ చేసే కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే రావు రమేష్ అరెస్ట్ అయ్యారు. ఒక సిబిఐ ఆఫీసర్ గా కథనంలోకి నటుడు అర్జున్ ఇంట్రెస్టింగ్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 06:18 AM February 11, 2022
-
ఇప్పుడు సినిమాలో మొదటి సాంగ్ ఫుల్ కిక్కు రవితేజ, డింపుల్ హయాతి ల మధ్య స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:00 AM February 11, 2022
-
ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. మరో హీరోయిన్ డింపుల్ హయాతి ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో రవితేజ లవ్ లో ఉన్నాడు. ఇద్దరి మధ్య కొన్ని కామెడీ మరియు రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:45 AM February 11, 2022
-
హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎంట్రీ సినిమా మొదలైంది. ఇప్పుడు మాస్ మహారాజ్ మాసివ్ ఎంట్రీ ని ఇచ్చాడు.
Date & Time : 05:42 AM February 11, 2022
-
హాయ్..154 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 05:30 AM February 11, 2022