-
సినిమా ఆకట్టకునే నోట్ తో ముగుస్తుంది. కార్తికేయ 2 మూవీ యొక్క ఫుల్ రివ్యూ కోసం మా 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 02:40 AM Aug 13, 2022
-
నిఖిల్ మరియు అతని బృందం ఒక రహస్యాన్ని ఛేదించడానికి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది.
Date & Time : 02:20 AM Aug 13, 2022
-
ఒక పాట మరియు కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల తర్వాత, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఎంట్రీ ఇచ్చారు. అలానే నిఖిల్ మరియు అతని గ్యాంగ్‌కి ఆయన సహాయం చేస్తున్నాడు
Date & Time : 02:10 AM Aug 13, 2022
-
కథ ఆసక్తికరంగా సాగుతుంది మరియు ప్రస్తుతం మరొక ట్విస్ట్ వచ్చింది
Date & Time : 01:50 AM Aug 13, 2022
-
హర్ష చెముడు సులేమాన్గా ఎంట్రీ ఇచ్చాడు. మధురలోని కొంతమంది గ్రామస్థులకు నిఖిల్ సహాయం చేస్తాడు మరియు ఇక్కడ మళ్ళీ చిన్న ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 01:40 AM Aug 13, 2022
-
ఇప్పుడే సెకండాఫ్ మొదలైంది. అందరూ నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ కోసం చూస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 01:25 AM Aug 13, 2022
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా చక్కని కథనంతో డీసెంట్‌గా ఉంది. నిఖిల్ లుక్ బాగుంది. బీజీఎం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా సెకడాఫ్ ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.
Date & Time : 01:15 AM Aug 13, 2022
-
నిఖిల్ ఒక రహస్యాన్ని ఛేదించే పనిలో మునిగిపోయాడు మరియు ప్రస్తుతం విరామానికి సమయం.
Date & Time : 01:10 AM Aug 13, 2022
-
నిఖిల్‌ని కొందరు వ్యక్తులు వెంబడిస్తున్నారు. శ్రీకృష్ణుడితో వారి అనుబంధాన్ని యానిమేషన్ రూపంలో చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆ సన్నివశాలు వస్తున్నాయి.
Date & Time : 01:00 AM Aug 13, 2022
-
ద్వారకలో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం కథలో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది. ముగ్ధ పాత్రలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 12:50 AM Aug 13, 2022
-
ప్రస్తుతం కథ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. శ్రీకృష్ణుడి ఆభరణాల కోసం కొందరు వ్యక్తులు వెతుకుతున్నారు. తన అంకుల్ శ్రీనివాస రెడ్డిని కలిసేందుకు ద్వారకకు వచ్చాడు నిఖిల్. ప్రస్తుతం వారి మధ్య సన్నివేశాలు సాగుతున్నాయి.
Date & Time : 12:40 AM Aug 13, 2022
-
హీరో నిఖిల్ డాక్టర్ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. తనతో పాటు ప్రవీణ్, సత్య ఇద్దరూ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వారి ముగ్గురి మధ్య ప్రస్తుతం కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 12:30 AM Aug 13, 2022
-
మూవీ గ్రీస్ దేశంలో కృష్ణుడు, ద్వారక కి సంబందించిన కొన్ని సన్నివేశాలతో ప్రారంభం అయింది. ఇందులో యానిమేషన్స్ అదిరిపోయాయి.
Date & Time : 12:20 AM Aug 13, 2022
-
హాయ్, 145 నిమిషాల నిడివి గల మూవీ ఇప్పుడే మొదలైంది
Date & Time : 12:10 AM Aug 13, 2022