
మొదటి షో వివరాలు : కన్నప్ప
తిన్నడు కన్నప్పగా మారే హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ సన్నివేశం, శివ పార్వతుల ముగింపుతో సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
రుద్ర చూపిన మార్గంతో తిన్నడు పరమ శివ భక్తునిగా మారాడు. విష్ణు సింగిల్ టేక్ ఎమోషనల్ డైలాగ్ తర్వాత ఓ భక్తి సాంగ్ మొదలైంది.
ప్రభాస్ ముగ్గురు నటులు మోహన్, విష్ణు, ప్రీతి ముకుందన్ లపై కొన్ని ఇంటెన్స్ సీన్స్ తో మరిన్ని ఇంట్రస్టింగ్ సీన్స్ కొనసాగుతున్నాయి.
తిన్నడి పగ తీరినాక లీడ్ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇప్పుడు అవైటెడ్ ప్రభాస్ ఎంట్రీ రుద్రగా వచ్చేసింది.
ఇప్పుడు కథనంలోకి మళ్లీ కాలా ముఖుడు వచ్చాడు. ఓ యుద్ధ సన్నివేశం ఎమోషనల్ గా ముగిసింది.
ఇంటర్వెల్ అనంతరం.. విష్ణు, మోహన్ లాల్ నడుమ ఏ సన్నివేశాలు దగ్గర ఆగిందో వాటితోనే ఆరంభం అయ్యింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
తమ గూడెంలో ఒక ఘటనతో తిన్నడు కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ తర్వాత మోహన్ లాల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ విష్ణు కూడా మరో సర్ప్రైజింగ్ పాత్రలో కనిపించాడు. ఇప్పుడు విరామం.
లీడ్ జంట నడుమ కొన్ని సీన్స్ తర్వాత ఓ రొమాంటిక్ సాంగ్ మొదలైంది.
ఒక యాక్షన్ సన్నివేశం తర్వాత మంచు విష్ణు తెగ సహా ఇతర తెగలపై కాలా ముఖుడు నుంచి ఊహించని ఆపదకి పరిస్థితులు దారి తీస్తాయి. ఈ సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
తన చిన్నతనంలోనే ఒక విషాదకర ఘటనతో అక్కడ నుంచి నాస్తికుడు అవుతాడు. ఇప్పుడు హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఎంట్రీ తర్వాత ఒక పవర్ఫుల్ శివారాధన పాటతో మోహన్ బాబు పరిచయం అయ్యారు.
అరియానా, వివియాన మంచు లపై ఒక గ్రేస్ ఫుల్ ఎంట్రీతో మహా శివునిపై ఒక భక్తి పాటతో మొదలై అక్షయ్ కుమార్, కాజల్ లు మహా శివుడు, పార్వతి లుగా పరిచయం అయ్యారు.
హాయ్.. 195 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.