-
చిత్రం చాలా ఆసక్తికరంగా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 10:00 PM April 26, 2018
-
క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా సాగుతోంది. సాయి పల్లవి చివరకు తన కుమార్తెకు సంబంధించిన విషయాన్ని సెట్ చేసింది.
Date & Time : 09:59 PM April 26, 2018
-
కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు తెరపై ఆకట్టుకుంటున్నాయి. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 09:57 PM April 26, 2018
-
కథలో ఇప్పుడొక ప్రధానమైన ట్విస్ట్.. ఒక విషాదకర ప్రమాదంకు సంబంధించిన సన్నివేశాలు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 09:55 PM April 26, 2018
-
ప్రియదర్శి కేసును మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. పాప గురించి మేజర్ క్లూస్ బయటపడుతున్నాయి.
Date & Time : 09:52 PM April 26, 2018
-
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. కథను మలుపుతిప్పే కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:49 PM April 26, 2018
-
సాయి పల్లవి సెకండ్ హాఫ్ లో చాలా బాగా నటిస్తోంది .. ప్రధాన జంట మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:43 PM April 26, 2018
-
చిత్రంలో హీరో తనను తాను ఘోరమైన సమస్యల నుండి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 09:33 PM April 26, 2018
-
సాయి పల్లవి మరియు నాగ శౌర్య మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:28 PM April 26, 2018
-
ఇంటర్వెల్ తరువాత మేజర్ ట్విస్ట్ బయటపడింది. సాయి పల్లవికి మాత్రమే ఆ విషయం తెలుసు.
Date & Time : 09:20 PM April 26, 2018
-
మంచి సస్పెన్స్ ఎలిమెంట్ తో ఈ చిత్రం సగానికి చేరుకుంది. ఇప్పుడు బ్రేక్ ..
Date & Time : 09:03 PM April 26, 2018
-
కథలో మరొక ఊహించని ట్విస్ట్.. ఇంటర్వెల్ టైమ్ లో చిత్రం చాలా ఆకట్టుకుంటోంది. థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ గా కథ సాగుతోంది.
Date & Time : 08:59 PM April 26, 2018
-
ప్రియదర్శి కేసును విచారిస్తున్నారు. కథలో ఒక ట్విస్ట్. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 08:52 PM April 26, 2018
-
ఒక యాక్సిడెంట్ సన్నివేశాలు ప్రదర్శించబడుతున్నాయి. అన్ని చిన్న అమ్మాయికి సంబంధించినవే.. ఇది ఒక ఎమోషనల్ మూమెంట్!
Date & Time : 08:47 PM April 26, 2018
-
కొన్ని తీవ్రమైన సంఘటనలు ఒక దాని తరువాత మరొకటి జరుగుతున్నాయి. ఒకరు చంపబడ్డారు..
Date & Time : 08:42 PM April 26, 2018
-
ఒక విషాద సంఘటన జరుగుతుంది. యాక్టర్ ప్రియదర్శి ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 08:33 PM April 26, 2018
-
ఒక పాపతో ముడిపడి ఉన్న దుష్ట ఆత్మ యొక్క ఉత్కంఠభరితమైన అంశాలు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 08:29 PM April 26, 2018
-
జంట కొత్త అపార్ట్మెంట్ కు చేరుకుంది. ఈ చిత్రం అసలు కథ ఒక చిన్న బిడ్డ గురించి.
Date & Time : 08:22 PM April 26, 2018
-
సినిమా కథ ప్రస్తుతానికి మారింది.. సాయి పల్లవి - నాగ శౌర్య వివాహం చేసుకున్నారు.
Date & Time : 08:12 PM April 26, 2018
-
సీరియస్ హాస్పిటల్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలతో నటీనటులు నాగ శౌర్య - సాయి పల్లవి పరిచయం చేయబడ్డారు.
Date & Time : 08:06 PM April 26, 2018
-
హాయ్.. 101 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:04 PM April 26, 2018