కాంత
'Kaantha ' Live updates in English Version
మొదటి షో వివరాలు : కాంత
రానా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనే తేడా లేకుండా అందరినీ విచారిస్తున్నాడు. హీరో ని కూడా వదల్లేదు. ఇప్పుడు కథ సీరియస్ గా సాగుతుంది.
ఇక సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేసే ఫీనిక్స్ అనే పాత్రలో రానా దగ్గుబాటి ఎంట్రీ ఇచ్చాడు.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా పర్వాలేదు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ తమ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. ఇక సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
కొన్ని ట్విస్టులు కథను సినిమా ప్రారంభ సీన్ దగ్గరకు తీసుకొస్తాయి. దీంతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.
ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. దీంతో సముద్రఖని తన విధానాన్ని మార్చుకుంటాడు. అయితే, ఇద్దరి మధ్య ఈగో మాత్రం తగ్గదు.
ఓ ట్విస్ట్‌తో కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. హీరో, డైరెక్టర్ మధ్య విభేదం రావడానికి గల ఘటనలు వస్తున్నాయి. ఇప్పుడు ‘అమ్మడివే’ అనే పాట వస్తోంది.
హీరో, డైెరెక్టర్ మధ్య విభేదాన్నితెలుసుకునే ప్రయత్నం భాగ్యశ్రీ చేస్తుంది. కొన్ని సీన్స్ తర్వాత ‘పసి మనసే’ పాట వస్తోంది.
టికె మహదేవన్ గా దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఇచ్చాడు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ బొర్స్ పరిచయం అయ్యింది. ఒక ఈగో క్లాష్‌తో టైటిల్ కార్డ్ పడింది.
ఒక గన్ షాట్ తర్వాత.. తన తల్లి శాంత కథను ఎలాగైనా జనాలకి చెప్పాలనే దర్శకుడు అయ్య పాత్రలో సముద్రఖని పరిచయమయ్యాడు.
హాయ్.. 2 గంటల 43 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.